చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఫిబ్రవరిలో మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 26 న షావోమీ 13 ప్రో’ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రత్యర్ధి సంస్థలైన ఐక్యూ 11 5జీ, వన్ ప్లస్ 11 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్‌లను స‍్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్‌ఓఎస్‌తో విడుదల చేయగా.. వాటికి పోటీగా షావోమీ స్నాప్ డ్రాగన్ 2 చిప్‌సెట్‌తో 4 ఫ్లాగ్ షిప్ ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది. తాజాగా అదే చిప్‌సెట్‌తో షోవోమీ 13ను విడుదల చేసి ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
భారత్‌లో షావోమీ 13 ప్రో
షావోమీ అధికారిక ప్రకటన ప్రకారం.. చైనా తర్వాత భారత్‌లో షావోమీ 13 ప్రో ఫిబ్రవరి 26 స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు విడుదల చేయనుంది. ఇక ఇదే ఫోన్ గత ఏడాది చైనాలో విడుదల చేయగా.. ఆ ఫోన్ ధర రూ.61,000గా ఉంది.
షోవోమీ 13 ప్రో స్పెసిఫికేషన్
షోవోమీ 13 ప్రో స్పెసిఫికేషన్ గురించి షావోమీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ పలు నివేదికలు మాత్రం ఫోన్ గురించి పూర్తి వివరాల్ని విడుదల చేశాయి. వాటి ప్రకారం.. ఆండ్రాయిల్ 13 వెర్షన్ అప్‌డేట్‌తో వచ్చిన షావోమీ ఇంటర్ ఫేస్ ఫీచర్ ఎంఐయూఐ 14, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.73 అంగుళాల 2కే ఒఎల్‌ఈడీ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్‌ఓసీ, 12జీబీ ఎల్‌పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్ ఫీచర్లు ఉన్నాయి.
వీటితో పాటు లైకా బ్రాండెడ్ 50 మెగా పిక్సెల్ రేర్ కెమరా సెటప్, ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, వైఫై 6, బ్లూటూత్ 5.3 అండ్ ఎన్‌ఎఫ్‌సీ(Near-field communication), ఎక్స్ - యాక్సిస్ లైనియర్ మోటార్, లేజర్ ఫోకస్ సెన్సార్, ఐఆర్ కంట్రోల్ సెన్సార్‌లు ఉన్నాయి.
మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఫోన్‌లో 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 8.38 ఎంం, బరువు 210 గ్రాములుగా ఉండొచ్చనే అంచనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment