చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కారణంగా షావోమీ 23 శాతం షిప్‌మెంట్ తగ్గినట్లు (ఇయర్ టూ ఇయర్) ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రిపోర్ట్ అందించే సైబర్ మీడియా రీసెర్చ్ వెల్లడించింది.
షావోమీకి సబ్ బ్రాండ్‌గా ఉన్న పోకో సైతం షిప్‌మెంట్ 14శాతం తగ్గినట్లు సైబర్ మీడియా రీసెర్చ్ నివేదించింది. కానీ షావోమీ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో 20 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా శాంసంగ్ 18శాతం, రియల్ మీ 16శాతంతో తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వివో 15శాతం, ఒప్పో 10శాతం మార్కెట్‌తో కొనసాగుతున్నాయి.
రిపోర్ట్ ప్రకారం.. 5జీ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లో శాంసంగ్ ఫోన్‌లు వృద్ధి సాధిస్తున‍్నట్లు పేర్కొంది. రూ.7వేల నుంచి రూ.24వేల మధ్య ఫోన్‌లు అమ్ముడవుతున‍్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు ఇన్నోవేటీవ్‌తో త్వరలో విడుదల కానున్న శాంసంగ్ ఫోర్త్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లు కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
కొనుగోలు దారుల్ని ఆకట్టుకునే సూపర్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్‌లలో యాపిల్ ఐఫోన్‌లు చోటు దక్కించుకున్నాయి. 80శాతం మార‍్కెట్ షేర్‌తో రూ.50వేల నుంచి రూ.లక్ష రేంజ్ ఫోన్‌లు ఉన్నాయి. షిప్‌మెంట్‌లో ఐఫోన్12, ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌లు అగ్రస్థానంలో నిలిచాయి. దీంతో భారత్‌లో యాపిల్ సంస్థ భారీ లాభాల్ని గడించినట్లు క్యూ2 ఫలితాల సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ సంతోషం వ్యక్తం చేశారు.
క్యూ2లో స్మార్ట్ ఫోన్‌లు షిప్‌మెంట్ అవ్వగా ప్రతి మూడు ఫోన్‌లలో ఒక 5జీ ఫోన్ ఉన్నట్లు నివేదిక హైలెట్ చేసింది. గతేడాది క్యూ2 నుంచి ఈ ఏడాది క్యూ2 వరకు 5జీ స్మార్ట్ ఫోన్‌ల షిప్‌మెంట్ 163 శాతం పెరిగాయి
ద్రవ‍్యోల్బణం ఎఫెక్ట్
పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా వరుసగా క్యూ2లో సైతం ఫీచర్ ఫోన్‌ల డిమాండ్ తగ్గించింది. 2జీ ఫీచర్ ఫోన్ 4 శాతం పెరిగింది. కానీ 4జీ ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ 45 శాతం క్షీణించింది.
మార్కెట్‌పై పట్టుకోల్పోతుందా?
దేశీయ మార్కెట్‌లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ యూజర్లను కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది షావోమీ విదేశీ మారక చట్టం(ఎఫ్‌ఈఎంఏ) నిబంధనల్ని ఉల్లంఘించడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో షావోమీ 2014 నుంచి ఎంఐ బ్రాండ్ పేరుతో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జరపడం ప్రారంభించింది.
ఆ తరువాతి ఏడాది అంటే 2015లో షావోమీ ఇండియా రూ.5,551.27కోట్ల నిధుల్ని విదేశీ కంపెనీలకు బదిలీ చేసినట్లు తేలింది. అంతేకాదు తనకు ఏమాత్రం సంబంధం లేని షావోమీ ఇండియా.. అమెరికా కంపెనీల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఏడీ తేల్చింది. ఆ విచారణతో దేశీయ కొనుగోలు దారులు షావోమీని దూరం పెట్టినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
చదవండి: సేల్స్ బీభత్సం..! 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన ఫోన్‌లు అమ్ముడయ్యాయి!
Comments
Please login to add a commentAdd a comment