
హద్దులు మీరిన శబ్దాలతో తలనొప్పి వస్తుంది.
నారాయణఖేడ్: ఎన్నికల సందడి మొదలయ్యిందంటే చాలు గ్రామాల్లో మైకులు హోరెత్తుతుంటాయి. ప్రచార రథాలకు మైకులు బిగించి ప్రచారం చేస్తుంటాయి. మీ ఓటు మాకే వేయండంటూ నాయకులు ఊదర గొడతారు. ప్రచార సాధనాల మోత చెవుల్లో మార్మోగుతుంది.
హద్దులు మీరిన శబ్దాలతో తలనొప్పి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా డీజే శబ్దాలతో విపరీత దోరణికి పోవడంతో కొంత సమస్యగా మారుతుంది. చట్టపరంగా ఏ మేరకు ధ్వని వినియోగించుకోవాలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. శబ్దం పెరిగిందా కేసులు నమోదు కాల్సిందే..
ఈ సారి ఎన్నికల్లో అతిశబ్దంతో ఊదరగొట్టిన వారిపై కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో అభ్యర్థులు ఆయన తరఫున ప్రచారం చేసేవారు జాగ్రత్త పడాల్సిందే. మరి ఏ ప్రాంతంలో ఎంత శబ్ధం వినియోగించాలో ఎన్ని డెసిబుల్స్ ఉండాలో పర్యావరణ చట్టానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు.
∙ నివాస ప్రాంతాల్లో 45– 55 డెసిబుల్స్ మాత్రమే వినియోగించాలి.
∙ ఆస్పత్రులు, విద్యాలయాలు, న్యాయస్థానాల సమీపంలో 40– 45 డెసిబుల్స్ ఉండాలి.
∙ వ్యాపార ప్రాంతాల్లో 55– 65 డెసిబుల్స్ ఉండొచ్చు.
∙ పారిశ్రామిక ప్రాంతాల్లో 70– 75 డెసిబుల్స్ మేరకు సౌండ్ వినియోగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment