
ధ్వనితోనూ చూడొచ్చు!
జీవకణాల లోపల చూడటానికి కాంతికి బదులు ధ్వనిని వాడే కొత్త పద్ధతిని పరిశోధకులు కనుగొన్నారు.
లండన్: జీవకణాల లోపల చూడటానికి కాంతికి బదులు ధ్వనిని వాడే కొత్త పద్ధతిని పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని స్టెమ్‌సెల్ మార్పిడిలో, కేన్సర్‌ను కనుగొనడంలోనూ ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా నిర్మాణం, కణాల ద్వారా జరిగే క్రియలను కనుగొనవచ్చు. ప్రజల శరీరం లోపల చూడటానికి అల్ట్రాసౌండ్‌ను ఎలా ఉపయోగిస్తామో, పదార్థాల నిర్మాణాలను కనుగొనడానికి కూడా దాన్ని అలానే వినియోగించవచ్చని పరిశోధకులు అంటున్నారు.
ఆప్టికల్ మైక్రోస్కోపీలో మనం చూడదగ్గ అతి చిన్న పదార్థం కాంతి తరంగదైర్ఘ్యం. కాంతిలా ధ్వనికి ఎక్కువ బరువుండదు. దీని వల్లే పరిశోధకులు చిన్న తరంగధైర్ఘ్యాలను ఉపయోగించి చిన్న పదార్థాలను చూడగలరు.