బంగారు బొడ్డెమ్మ
-
‘బతుకమ్మ’కు ముందు వచ్చే సంబరం
-
కొన్ని చోట్ల నేటి నుంచి ప్రారంభం
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం.. తెలంగాణ. ఆచార, వ్యవహారాలే కాదు.. పండుగల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. యాస భాషకే అందాన్నిస్తే.. పండుగలు సంప్రదాయాలకు అద్దం పడతాయి. మహిళలకే ప్రత్యేకమైన మన ‘బతుకమ్మ’.. తెలంగాణే కాదు.. దేశ సరిహద్దులు దాటి నేడు విశ్వవ్యాప్తమైంది. ఈ బతుకమ్మకు ముందు వచ్చే మరో ముఖ్యమైన పండుగ బొడ్డెమ్మ. బతుకమ్మ పెద్దల పండుగ అయితే, బొడ్డెమ్మ చిన్నపిల్లలు, కన్నె పిల్లల వేడుక. అయితే, ఒక్కోచోట ఒక్కోలా ఈ పండుగను జరుపుకొంటారు. కొన్నిచోట్ల పది రోజుల పాటు బొడ్డెమ్మ ఆడుతుంటే, మరికొన్ని చోట్ల ఐదు రోజుల పాటు ఆడతారు. మరికొన్ని చోట్ల ఐదు వారాల పాటు ఆడతారు. భాద్రపద బహుళ పం^è మి మొదలుకొని మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మను, మహాలయ అమావాస్య నుంచి అశ్వీయుజ శుద్ధ నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటారు. ఒకప్పుడు పల్లె పల్లెన, పట్టణాల్లో వీధివీధిన కనిపించిన ‘బొడ్డెమ్మ’కు ప్రస్తుతం ఆదరణ కరువైంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే బొడ్డెమ్మ ఆడడం కనిపిస్తోంది.
నిజామాబాద్ కల్చరల్/కామారెడ్డి: