Vijay Sethupathi Turns Traditional Street Performer, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

ఆ పాత్ర మేకప్‌కే 45 నిమిషాలకు పైగా: విజయ్‌ సేతుపతి

Published Sat, Jan 1 2022 9:03 AM | Last Updated on Sat, Jan 1 2022 9:40 AM

Vijay Sethupathi Turns Traditional Street Performer - Sakshi

Vijay Sethupathi Turns Traditional Street Performer: నటుడు విజయ్‌ సేతుపతి తాజాగా వీధి బాగోతం కళాకారుడి అవతారమెత్తారు. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా  విజయ్‌ సేతుపతి రాణిస్తున్నాడు. అయితే వైవిధ్యం ఉంటే ఏ తరహా పాత్ర అయినా పోషించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ మధ్య సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో హిజ్రాగా నటించి ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా మాస్టర్‌ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి శభాష్‌ అనిపించుకున్నారు.

తాజాగా వీధి బాగోతం కళాకారుడి అవతారమెత్తారు. తమిళనాడులో పారంపర్య కళల్లో వీధి బాగోతం కళ (తెరు కూత్తు) ఒకటి. ఈ కళను నేర్చుకోవాలనే ఆసక్తిని నటుడు విజయ్‌ సేతుపతి వ్యక్తం చేశారు. ఈయన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిశ్చల ఛాయాగ్రాహకుడు ఎల్‌.రామచంద్రన్‌ వీధి బాగోతం కళాకారుడిగా తీర్చిదిద్ది నూతన సంవత్సర క్యాలెండర్‌ రూపొందించారు. ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. వీధి బాగోతం కళాకారుడిగా మారడానికి మేకప్‌కే 45 నిమిషాలకు పైగా పట్టిందన్నారు.  

చదవండి: (ఐదేళ్ల తర్వాత బిగ్‌స్క్రీన్‌పై కనిపించబోతున్నా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement