సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ | bathukamma is traditional symbol | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Published Mon, Sep 19 2016 11:58 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ - Sakshi

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

నల్లగొండ రూరల్‌ : తెలంగాణ సంస్క­ృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ అని బతుకమ్మ ఉత్సవ సమితి అధ్యక్షురాలు నూకల సంధ్యారాణి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బోయవాడలో బతుకమ్మ ఉత్సవ సమితి  కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు బతుకమ్మ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి సంస్క­ృతి, సంప్రదాయాలను ఘనంగా చాటిచెప్పాలన్నారు.  ప్రకృతి ప్రసాదించిన పూలతో బతుకమ్మలను నిర్వహించడం ఆడపడుచులకు గర్వ కారణమన్నారు.  సంబరాలను వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూతురు సత్యవతి, శ్రీలత, పద్మ, కోటగిరి రమ్యశాంతి, లక్ష్మి, శోభ, జ్యోతి, సుజాత, జయశ్రీ, కాశమ్మ, విజయలక్ష్మి, అర్చన, డాక్టర్‌ అనిత, డాక్టర్‌ ఇందిర తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement