Gram Flour Or Besan Health Beneifits And Ways Of Consumption - Sakshi
Sakshi News home page

శనగపిండి మంచిదేనా?..వాటితో చేసే పిండి వంటకాలు తినొచ్చా!

Published Sat, Aug 19 2023 9:56 AM | Last Updated on Sat, Aug 19 2023 10:22 AM

Gram Flour Or Besan Beneifits Ways Of Consumption - Sakshi

చెరుపు చేస్తుందా?గోధుమలతో పోలిస్తే  శనగపిండిలో క్యాలరీలు తక్కువ... ప్రోటీన్లు ఎక్కువ. అదేవిధంగా శనగపిండిలో ఫోలేట్, విటమిన్‌ బి6, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియమ్, ఫైబర్‌ కూడా సమృద్ధిగా లభిస్తుంది.  

శనగపిండితో ఆరోగ్య ప్రయోజనాలు... 

  • శనగపిండిలో గ్లూటెన్‌ ఉండదు కాబట్టి చాలారకాల అలర్జీలను కలిగించదు.
  • శనగల గ్లైసిమిక్‌ విలువ తక్కువ. కాబట్టి శనగపిండి వల్ల అంత త్వరగా బరువు పెరగదు. స్థూలకాయం కూడా త్వరగా రాదు. 
  • శనగపిండిలో తక్కువ గ్లైసీమిక్‌ విలువ కారణంగా డయాబెటిస్‌ రోగులకు ఇదెంతో మంచిది. అందుకే డయాబెటిస్‌ ఉన్నవారు గోధుమల కంటే దీనితో చేసిన పరోఠాలూ, రోటీలు తీసుకోవడం మేలు. 
  • శనగల్లో నీటిలో కరిగే పీచు ఉండటం వల్ల శనగపిండి వాడేవారి గుండె ఆరోగ్యం దీర్ఘకాలం పాటు బాగుంటుంది. శనగపిండి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. 
  • రక్తహీనతను నివారిస్తుంది. డెర్మటైటిస్‌ హెర్పిటోఫార్మిస్, కొన్ని రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులు, స్కి›్లరోసిస్, ఆటిజమ్, ఏడీహెచ్‌డీ వంటివాటిని నివారిస్తుంది. 
  • ∙శనగపిండిలో గ్రోత్‌ హార్మోన్స్‌ ఎక్కువ. అందుకే ఎదిగే పిల్లలకు దీనితో తయారు చేసిన పదార్థాలు పెట్టడం మంచిది. ఇందులోని ఫాస్ఫరస్‌ వల్ల ఎదిగే పిల్లల ఎముకలు బాగా గట్టి పడతాయి. 
  • ∙ఇందులో ఫోలేట్‌ ఎక్కువగా ఉండటం వల్ల కాబోయే తల్లులు, ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న మహిళలూ దీన్ని వాడటం మేలు. ఇది ఎర్రరక్తకణాలనూ పెంపొందిస్తుంది.

ఈ జాగ్రత్త పాటించాలి మరి... 
శనగపిండి కాస్త కడుపు ఉబ్బరం కలిగిస్తుంది అందుకే మల్టీగ్రెయిన్స్‌ ఆటాతో కలిపి తీసుకుంటే ఈ పొట్ట ఉబ్బరం వంటివి తగ్గుతాయి. శనగపిండిలో ఉండే ఈ ఒక్క ప్రతికూల అంశం కారణంగా దానితో కలిగే అనేక ప్రయోజనాలను వదులుకోవడం సరికాదు. 

(చదవండి: యమ్మీ యమ్మీ.. "కుల్ఫీ"ని ఇష్టపడని వారుండరు..ఎలా చేస్తారంటే..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement