రొయ్యల పచ్చడికి కావలసినవి:
ఎండు రొయ్యలు – కప్పు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – ఐదు
నూనె – టేబుల్ స్పూను
కొత్తిమీర – పావు కప్పు
జీలకర్ర – టేబుల్ స్పూను
వెల్లుల్లి రెబ్బలు – పది
ధనియాల పొడి – టేబుల్ స్పూను
కారం – టేబుల్ స్పూను
గరంమసాలా పొడి – అరటేబుల్ స్పూను.
తయారీ విధానం: రొయ్యల తల, తోక తీసేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన రొయ్యలను ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండాలి∙ ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా తరిగి బాణలిలో వేయాలి∙ పచ్చిమిర్చిని కూడా దోరగా వేయించి తీసేయాలి∙ ఇదే బాణలిలో నూనె వేయాలి. కాగిన నూనెలో పిండిపెట్టుకున్న రొయ్యలను వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి ఇప్పుడు మిక్సీజార్‌లో వేయించిన ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేయించిన రొయ్యలు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే రొయ్యల పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
(చదవండి: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment