కావలసినవి:
పచ్చిబఠాణి – కప్పు
సూజీ రవ్వ – కప్పు
బియ్యప్పిండి – మూడు టీస్పూన్లు
పచ్చిమిర్చి – మూడు
అల్లం – అరంగుళం ముక్క
కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు
జీలకర్ర – టీస్పూను
పెరుగు – అరకప్పు
వంటసోడా– 1/2 టీ స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – ఊతప్పం కాల్చడానికి తగినంత.
తయారీ విధానం: మిక్సీజార్‌లో పచ్చిబఠాణి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి తగినంత నీటిని వేస్తూ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని సూజీ రవ్వ, బియ్యప్పిండి, గ్రైండ్ చేసిన బఠాణి పేస్టు, పెరుగు కలిపి నానబెట్టాలి. అరగంట తరువాత రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా, కొద్దిగా నీళ్లు పోసుకోని గరిట జారుడుగా కలుపుకోవాలి.
పెనం వేడెక్కాక కొద్దిగా నూనె వేసి రెండు గరిటలు పిండి వేసి రొట్టెలా వేసుకోవాలి. దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి. ఓ నిమిషం తర్వాత మూత తీసి ఊతప్పాన్ని తిరగేసి మరో అర స్పూన్ నూనె వేసి రెండోవైపు కూడా కాల్చుకుంటే గ్రీన్‌పీస్ ఊతప్పం రెడీ. చట్నీ, సాంబార్‌తో చాలా బావుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment