రేగు వడియాలు.. ఇలా చేస్తే టేస్ట్‌ మామూలుగా ఉండదు! | Regi Vadiyalu: Easy Steps to Make, Regipallu, Elantha Vadai | Sakshi
Sakshi News home page

రేగు వడియాలు.. ఇలా చేస్తే టేస్ట్‌ మామూలుగా ఉండదు!

Published Fri, Dec 17 2021 8:24 PM | Last Updated on Fri, Dec 17 2021 8:24 PM

Regi Vadiyalu: Easy Steps to Make, Regipallu, Elantha Vadai - Sakshi

కావలసినవి: రేగుపండ్లు – యాభై; చింతపండు – నిమ్మకాయంత; రాక్‌ సాల్ట్‌ – టేబుల్‌ స్పూను; బెల్లం – పావు కప్పు; ఎండు మిర్చి – ఆరు; జీలకర్ర – అర టీస్పూను; ఇంగువ – టీస్పూను.

తయారీ: 
► ముందుగా రేగుపండ్లను తొడిమెలు తీసి శుభ్రంగా కడిగి టవల్‌తో తుడిచి ఆరబెట్టాలి

► ఇప్పుడు రోట్లో ఉప్పు, ఎండు మిర్చి వేసి దంచాలి

► ఇవి సగం నలిగాక జీలకర్ర ఇంగువ, రేగుపండ్లు వేసి దంచాలి

► రేగుపండ్లను కచ్చాపచ్చాగా దంచి, విత్తనాలను తీసివేయాలి. రేగుపండ్ల గుజ్జులో చింతపండు, బెల్లం వేసి దంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక కవర్‌పై వడియాలుగా పెట్టుకోవాలి

► వీటిని మంచి ఎండలో ఆరబెట్టాలి. రెండు వైపులా బాగా ఎండిన తరువాత తీసి ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోవాలి

► నోరు చప్పగా అనిపించినప్పుడు ఈ వడియాలు తింటే పుల్లగా, కారంగా, తియ్యగా తగులుతూ ఎంతో రుచిగా ఉంటాయి. అజీర్తి చేసినప్పుడు, భోజనం సహించనప్పుడు వీటిని చప్పరిస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement