
కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – అర కేజీ (మెత్తగా ఉడికించి.. చల్లారాక తురుములా చిదుముకోవాలి)
చిలగడదుంప గుజ్జు (స్వీట్ పొటాటో పేస్ట్), శనగపిండి – పావు కప్పు చొప్పున
ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తురుము, కారం, గరం మసాలా – 1 టీ స్పూన్ చొప్పున
మిరియాల పొడి – అర టీ స్పూన్
పాలు – 2 టీ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు+3 టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
నీళ్లు – అర కప్పు, ఉప్పు – చిటికెడు
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో చికెన్ తురుము, చిలగడదుంప గుజ్జు, శనగపిండి, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తురుము, గరం మసాలా, మిరియాల పొడి, కారం, పావు కప్పు బ్రెడ్ పొడి, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. గారెల పిండిలా కలుపుకోవాలి. అనంతరం ఒక బౌల్‌లో మిగిలిన బ్రెడ్ పౌడర్, మరో బౌల్‌లో పాలు, కోడిగుడ్డు వేసుకుని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కట్లెట్స్ ఆకారంలో చేసుకుని.. వాటికి గుడ్డు, పాల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి... నూనెలో దోరగా వేయిచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment