
ఫిష్ కేకు తయారీకి కావాల్సినవి:
శుభ్రం చేసిన చేప ముక్కలు – మూడు కప్పులు(చర్మం, ముల్లు తొలగించి చిన్న ముక్కలు చేయాలి)
బ్రెడ్ ముక్కల పొడి – అరకప్పు
నూనె – టేబుల్ స్పూను
స్ప్రింగ్ ఆనియన్ తరుగు – కప్పు
బంగాళ దుంపలు – రెండు
మిరియాల పొడి – రెండు టీస్పూన్లు
నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు – అరకప్పు
పచ్చిమిర్చి – రెండు
ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: బంగాళదుంపలను ఉడికించి, తొక్కతీసి చిదుముకోవాలి. చేప ముక్కలను గిన్నెలో వేసి, పచ్చిమిర్చిని తరిగి వేయాలి. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర తరుగు, చిదుముకున్న బంగాళ దుంపల మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి ముక్కలు పట్టేలా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత మిశ్రమాన్ని టిక్కీల్లా తయారు చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల పొడిలో ఈ టిక్కీలను అద్దాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేకు నూనె రాసి, బ్రెడ్ ముక్కల పొడిలో అద్దిన ఫిష్ కేక్స్‌ను బేకింగ్ ట్రేలో పెట్టి అరగంటపాటు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన ఫిష్ కేక్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment