చింత చిగురు తోడైతే.. చింత లేని వంట! | Various Recipes With Chintha Chiguru | Sakshi
Sakshi News home page

చింత వద్దిక.. చింత చిగురు ఉందిగా..

Published Fri, Jun 7 2024 2:51 PM | Last Updated on Fri, Jun 7 2024 2:51 PM

Various Recipes With Chintha Chiguru

సీజనల్‌ ఫ్రూట్స్‌ ఉంటాయి... సీజనల్‌ వెజిటబుల్స్‌ ఉంటాయి. అలాగే సీజనల్‌ ఆకులూ ఉంటాయి...చింతచిగురు నోరూరిస్తోంది. ఎప్పుడూ చింతచిగురు పప్పేనా! ఈ సారి ఇలా ట్రై చేద్దాం. ఓ పచ్చడి... ఓ పొడి... ఓ అన్నం... ఓ కూర. వెరైటీగా ఏం వండాలా అనే చింత వద్దు. చింత ఉంది చిరుపుల్లగా... జిహ్వకు హితవుగా.

చింతచిగురు కొబ్బరి పచ్చడి..
కావలసినవి..
చింత చిగురు – 2 కప్పులు (శుభ్రంగా కడగాలి);
పచ్చి కొబ్బరి ముక్కలు – కప్పు;
పచ్చిమిర్చి – 2;
ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;

పోపు కోసం..
ఆవాలు – అర టీ స్పూన్‌;
ఇంగువ – చిటికెడు;
కరివేపాకు – 2 రెమ్మలు;
మినప్పప్పు – అర టీ స్పూన్‌;
ఎండుమిర్చి – 2;
నూనె – అర టీ స్పూన్‌;

తయారీ..

  • కొబ్బరిముక్కలు, చింతచిగురు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

  • చిన్న పాత్రలో నూనె వేసి చిన్న మంట మీద వేడి చేసి అందులో ఆవాలు వేసి అవి వేగిన వెంటనే ఎండుమిర్చి (విరిచి ముక్కలు చేసి వేయాలి), మినప్పప్పు వేసి ఎర్రగా వేగిన తర్వాత ఇంగువ వేసి స్టవ్‌ ఆపేయాలి.

  • పోపును స్పూన్‌తో కలిపి అందులో మిక్సీలో గ్రైండ్‌ చేసిన కొబ్బరి పచ్చడి వేసి కలపాలి.

  • ఘుమఘుమలాడే కొబ్బరి పచ్చడి రెడీ.

  • ఇది ఇడ్లీ, దోశెలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.

చింత చిగురు పొడి..
కావలసినవి..
చింత చిగురు – కప్పు;
ఎండుమిర్చి –  7 లేదా 8;
ఎండు కొబ్బరి – అర చిప్ప;
వెల్లుల్లి రేకలు – 4;
ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచికి తగినంత;

తయారీ..

  • చింత చిగురును మంచినీటితో శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి.

  • స్టవ్‌ మీద మందపాటి బాణలి వేడి చేసి సన్నమంట మీద చింత చిగురులో తేమ పోయే వరకు వేయించాలి.

  • వేగిన ఆకును ఒక ప్లేట్‌లోకి తీసుకుని అదే బాణలిలో ఎండుమిర్చి, కొబ్బరి వేసి వేయించాలి.

  • అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం పలుకుగా గ్రైండ్‌ చేయాలి.

  • ఉప్పు, వెల్లుల్లి వేసి మరో రౌండ్‌ గ్రైండ్‌ చేస్తే చింత చిగురు పొడి రెడీ.

  • వేడి అన్నంలో చింతచిగురు పొడి, నెయ్యి కలుపుకుంటే రుచి అమోఘం.

  • ఇడ్లీ, దోశెల్లోకి కూడా బాగుంటుంది.

  • ఈ పొడిని గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే పది రోజుల వరకు తాజాగా ఉంటుంది.

  • ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement