
సాక్షి, హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు కాలనీల్లోకి ఇళ్లకు వరద నీరు వచ్చి చేరాయి. గత మూడు గంటలుగా వరంగల్, హన్మకొండ, కాజిపేటలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ట్రైసీటీస్‌లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రధాన ప్రాంతాలలో 5 అడుగుల మేర వరద నీరు వచి చేరడంతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం వల్ల వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలోగల ఐసీఎస్‌యూ వార్డులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు వచ్చి చేరుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment