
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారు జామున అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు సైతం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment