
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కవాడిగూడ, గాంధీ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, రాంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిలల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ ప్రాంతాలతో పోల్చితే పాతబస్తీలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి పురాతన కట్టడం చౌమల్లా ప్యాలెస్ పాక్షికంగా దెబ్బతింది. రోడ్డు వైపు ఉన్న ప్యాలస్ ప్రహారీ గోడ కూలీపోయింది. దీనివల్ల అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment