
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని.. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా మరో 4 రోజులు రాష్టంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ రోజు(శుక్రవారం) ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్‌నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల అధికారులకు ఐఎండీ..సూచనలు జారీ చేసింది.
ఇప్పటికే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు కొనసాగుతున్న ఎల్లో అలెర్ట్ కొనసాగుతోంది. బలమైన ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని.. సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.