Chowmahalla Palace
-
చౌమహల్లా ప్యాలెస్‌లో సీఎం కేసీఆర్.. నిజాం రాజు ముకరం జాకు నివాళులు..
-
Mukarram Jha: నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు..
శంషాబాద్/చార్మినార్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ నెల 14న తుదిశ్వాస విడిచిన ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ పార్థివదేహం మంగళవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తెచ్చారు. భారీ బందోబస్తు నడుమ చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటలకు ముకరంజా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం కేసీఆర్ నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ముకరంజా భౌతికకాయానికి నివాళులర్పించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్యాలెస్ లో ముకరంజా భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతించనున్నారు. మధ్యాహ్నం ప్యాలెస్ నుంచి మక్కా మసీదు వరకు నిజాం అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. మక్కా మసీదులో తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కన ముకరంజా పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1967లో ఎనిమిదో నిజాంగా.. భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరం జాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. అద్దె ఇంట్లో మరణించాడు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన హైదరాబాద్ సంస్థానం 8వ నిజాం రాజు టర్కీలో అద్దె ఇంట్లో మరణించాడు. ఇస్తాంబుల్ నగరంలోని ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో జనవరి 14న మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ (89) కన్నుమూసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 1967లో కుబేరుడిగా ఉన్న ఆయన తన చివరి రోజుల్లో ఓ సామాన్యుడిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 1971లో భారత ప్రభుత్వ రాజాభరణాలు రద్దు చేసేంత వరకు ‘ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్’గా ఉన్నారు. అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలో ఆస్తి వివాదాలతో ముకరంజా దివాళా తీశారు. ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. 30 ఏళ్ల వయసులోనే 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడైన ముకరంజా ఆ తర్వాత నిర్లక్ష్యం కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. కాగా ముకరంజా భౌతికకాయం మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుందని నిజాంట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. తన అంతిమ సంస్కారాలను హైదరాబాద్ మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల వద్ద నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడే ముకరంజా. 1933 అక్టోబర్ 6న ఫ్రాన్స్‌లో ఆయన జన్మించారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య, లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1967లో 8వ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం 1967లో ఎనిమిదవ నిజాంగా.. భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. కాగా, మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం పరిశీలించారు. ముందుగా చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించిన అధికారుల బృందం సభ్యులు అక్కడ ఏర్పాట్లు పరిశీలించింది. ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో.. మంగళవారం ముకరంజా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించనున్నారు. 18న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చౌమహాల్లా ప్యాలెస్‌లో ఆయన పార్థివదేహాన్ని సందర్శించడానికి ప్రజలను అనుమతించనున్నారు. తర్వాత అంత్యక్రియలకోసం పార్థీవ దేహాన్ని తరలిస్తారు. -
చౌమహల్లా ప్యాలెస్.. చూద్దాం పదండి
సాక్షి, హైదరాబాద్: యూరోపియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం. అసఫ్ జాహీల పాలనకు నిలువుటద్దం పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్. రెండో నిజాం కాలంలో చార్మినార్– లాడ్‌బజార్‌కు అతి సమీపంలో నిర్మించిన చారిత్రక ప్యాలెస్ ఇది. 2020 జూన్ 27న ఖిల్వత్ క్రీడా మైదానం వైపు ఉన్న చౌమహల్లా ప్యాలెస్ ప్రహరీ పైభాగంలోని కిటికీ దిమ్మె కూలి కింద పడింది. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన మరమ్మతు పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. (క్లిక్: చౌమహల్లా ప్యాలెస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు) ప్రస్తుతం ఈ ప్యాలెస్ అందంగా ముస్తాబై పర్యాటకులను ఆకట్టుకుంటోంది. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్ ఆర్కిటెక్చర్‌ను పోలి ఉంది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో మరింత శోభాయమానంగా మారింది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ప్యాలెస్ ఒకప్పుడు నిజాంల నివాస గృహం. ప్రస్తుతం విద్యుద్దీపాలతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభ తెస్తున్నాయి. (క్లిక్: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ) -
Chowmahalla Palace: ప్యాలెస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?!
నగర సిగలో నందివర్ధనం... చక్కటి అభిరుచికి దర్పణం... కళాత్మకతకు ప్రతిరూపం... సునిశితమైన పనితనానికి ప్రతీక... శాస్త్ర సాంకేతికతకు నిలువుటద్దం... అలనాటి హైదరాబాద్ వెలుగు వీచిక... చౌమొహల్లా ప్యాలెస్... ఇది నాలుగు ప్యాలెస్‌ల సమాహారం. వాటి పేర్లు అఫ్జల్, మెహ్తాబ్, ఆఫ్తాబ్, తెహ్నియత్ ప్యాలెస్‌లు. అయితే ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఈ నాలుగు ప్యాలెస్‌ల కంటే ముందు దర్బార్ హాల్ స్వాగతం పలుకుతుంది. దర్బార్ హాల్ దర్పాన్ని సాంతం వీక్షించాలంటే ప్రధాన ద్వారం దగ్గర కొద్ది క్షణాల సేపు నిలబడి చూడాలి. దర్బార్ హాల్ ముందున్న నీటి కొలనుకు కుడి వైపు నుంచి మొదలు పెట్టి కనోపీ ట్రిమ్‌లో అందంగా కనిపిస్తున్న చింతచెట్టు ముందు నుంచి ప్రాంగణం మొత్తం ఒక రౌండ్ వేస్తే ఇందులో ఉన్న నాలుగు ప్యాలెస్‌లు, క్లాక్‌టవర్, బగ్గీఖానా, గుర్రాల విడిది ప్రదేశం... అన్నీ కవర్ అవుతాయి. పచ్చటి రకరకాల చెట్ల మధ్య గన్నేరు పూల సువాసనను ఆస్వాదిస్తూ సాగుతుంది చౌమొహల్లా రౌండప్. గ్రంథనిలయం మెహ్తాబ్ మహల్లో ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఖురాన్ గ్యాలరీలోకి వెళ్లేటప్పుడు చెప్పులు బయట వదలాలి. ఖురాన్ గ్రంథంతోపాటు అనేక ఉర్దూ పుస్తకాలు ప్రదర్శనలో ఉన్నాయి. తెరిచిన పుస్తకాలను ఉంచిన గ్రంథపీఠం కూడా సాదాసీదాగా లేదు. అవి కూడా వేటికవి ప్రత్యేకంగా అందమైన కళాకృతులే. బెల్జియం మిర్రర్ వర్క్ వాల్ హ్యాంగింగ్ ఉంది. అది షో పీస్ కాదు. ఖురాన్లో మంచి మాటను అద్దాలతో అమర్చిన కళాఖండం. అక్కడి నుంచి బయటకు వస్తే ఓ బాణం గుర్తు ఆఫ్జల్ మహల్, అఫ్తాబ్ మహల్, బగ్గీఖానాలను సూచిస్తుంది. ఆయుధాల ప్రదర్శన దర్బార్ హాల్ వరండాలో అడుగుపెట్టగానే ఇద్దరు గ్రీకువీరులు కుస్తీపడుతున్న పాలరాతి శిల్పం మీద చూపు నిలిచిపోతుంది. ప్రవేశించగానే ప్రధాన మందిరానికి రెండు వైపుల ఉన్న గదుల్లో నిజామ్ ఫొటో గ్యాలరీ, క్లుప్తంగా వారి జీవిత చరిత్ర, ఆయిల్ పెయింటిగ్స్ ఉన్నాయి. వాటి నుంచి ముందుకు వెళ్తే ఒక మూలగా ఉన్న గదిలో ఆయుధాలు ప్రదర్శనలో ఉన్నాయి. అలాగే మరో మూలగా ఓ గది లో కూడా ఆయుధాలున్నాయి. కత్తులు, కటారులు, పిడిబాకులు, ఫిరంగులు, తుపాకులున్నాయి. మొత్తం ఐదువేల ఆయుధాలున్నట్లు ప్యాలెస్ డైరెక్టర్ కిషన్‌రావు చెప్పారు. డాలుగా తాబేలు డొప్పలను వాడేవారని తెలిసింది. ఇక పై అంతస్థు... ప్రపంచదేశాలన్నీ తమవంతుగా కొలువుదీరినట్లు ఉంది. క్రాకరీ, కట్లరీ యూనిట్లో ఆస్ట్రియా, బెల్జియం, హాలండ్, జపాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, చెకోస్లోవియాల నుంచి సేకరించిన పింగాణీ, వెండి, గాజు డిన్నర్ సెట్లున్నాయి. ఇక్కడి గవాక్షాల నుంచి దర్బార్ హాల్ ప్రధానమందిరం, అందులో జరిగే కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తాయి. హాల్లో మొఘల్ శైలి పాలరాతి రాజపీఠం ఉంది. పక్కనే ఓ గదిలో ఆయిల్ పెయింటింగ్స్ గ్యాలరీ, అందులో మౌనంగా వీడియో ప్రదర్శన కొనసాగుతుంటుంది. మాటలు వినిపించకపోయినా కింద సబ్‌టైటిల్స్ అయినా వస్తుంటే ఆసక్తిగా చూడవచ్చు. టైటిల్స్ లేకపోవడం కొరత అనే చెప్పాలి. దర్బార్ హాల్ వెనుక వరండా వంటి పొడవైన గదిలో స్నూకర్ టేబుల్, ఫొటో గ్యాలరీ ఉన్నాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పిల్లలు బిలబిలమంటూ ప్యాలెస్‌లోకి పరుగులు తీశారు. అంతా ఐదు నుంచి పదేళ్ల లోపు వాళ్లే. వాళ్లతోపాటు మరికొంత మంది మహిళలు. ఏదో స్కూలు... విద్యార్థులను ప్యాలెస్ టూర్‌కి తీసుకువచ్చింది. కోవిడ్ తర్వాత పర్యాటకం ఊపందుకుంటున్న నేపథ్యంలో పిల్లలను బయటకు తీసుకువెళ్లడానికి ఇది సరైన ప్రదేశమే. ఎందుకంటే పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో పచ్చటి చెట్ల మధ్య, విశాలమైన ప్యాలెస్‌లో హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ హాలిడేని సంతోషంగా ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం ఈ ప్యాలెస్ సముదాయం. ప్యాలెస్‌లో విహారం ఎలా ఉంటుందో ఒక్కమాటలో చెప్పాలంటే... ‘స్కూలు పిల్లల ముఖాల్లో కాంతులీనుతున్న ఆనందంలాగ ఉంది’. గంటకొట్టే గడియారం అఫ్జల్ మహల్ ముందు జామెట్రికల్ డిజైన్‌లో రంగురంగుల పాలరాతి చిప్స్ఫ్లోరింగ్తో విశాలమైన వరండా. మహల్ అంతా ఉడెన్ ఫ్లోరింగ్. ఈ మహల్లో సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నట్లే గంట కొట్టే గడియారం ఉంది. ఆ హాల్లో మూడు రెక్కల ఫ్యాన్ పైన ఉన్న పైప్‌ను చూసినప్పుడు కానీ పై కప్పు కనీసం ముప్పై అడుగుల ఎత్తులో ఉందనే విషయం స్ఫురణకు రాదు. లోపలి గదిలో పియానో ఉందని చెప్పారు. కానీ పర్యాటకులకు ఆ గదిలోకి అనుమతి లేదు. ఈ మహల్ ఎడమవైపు కొద్దిగా వెనుకగా బగ్గీఖానా ఉంది. దుస్తుల గ్యాలరీ ఆఫ్తాబ్ మహల్లోకి అడుగు పెట్టగానే గ్రీన్ గ్లాస్ షాండ్లియర్లు మెరుస్తుంటాయి. చిక్కటి గ్రీన్ షేడ్‌ను చెప్పడానికి గ్లాస్గ్రీన్ అనే పదం వాడుతుంటాం. గ్రీన్ గ్లాస్ అసలు షేడ్ ఈ షాండ్లియర్లను చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నిజామ్ కుటుంబీకులు ఉపయోగించిన దుస్తులున్నాయి. ఒక గదిలో షేర్వాణీలు, మరో రెండు గదుల్లో చీరలున్నాయి. బెనారస్, పైఠానీ, కోట చీరలు, జర్దోసి ఎంబ్రాయిడరీ దుస్తులు, టోపీలున్నాయి. దుస్తులను హ్యాంగర్లకు తగిలించకుండా మానిక్వైన్లకు కట్టి ఉండడంతో నిజామ్ కుటుంబం తాలూకు వైభవోపేతమైన జీవనం కళ్లకు కడుతుంది. ఇక్కడ హుక్కా పీల్చే ప్రదేశం కూడా ఉంది. ఇక తర్వాత చూడాల్సింది తహ్నియత్ మహల్. ఇందులో చూడడానికి ప్రదర్శనలో ఏమీ పెట్ట లేదు. ఈ ప్యాలెస్‌ను పెళ్లి, రిసెప్షన్ వంటి వేడుకలకు అద్దెకిస్తారు. ప్యాలెస్ కబుర్లు మరికొన్ని... చౌ మొహల్లా ప్యాలెస్‌కి 1750లో సలాబత్ జంగ్ పునాదిరాయి వేశాడు. వందేళ్లు దాటిన రెండు దశాబ్దాలకు ఐదవ అసఫ్ జాహీ అఫ్జల్ అద్దౌలా పూర్తి చేశాడు. నిజామ్ వంశస్థుల్లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది నిజామ్ల కిరీటధారణలు ఇక్కడే జరిగాయి. ఏ మహల్లోకి వెళ్లినా బెల్జియం గ్లాస్ షాండ్లియర్లే ప్రధానంగా కనిపిస్తాయి. దర్బార్ హాల్లో ఏకంగా పందొమ్మిది షాండ్లియర్లున్నాయి. క్లాక్‌టవర్‌కు అమర్చిన గడియారం పని చేస్తూనే ఉంది. వర్షాలకు గోడలు దెబ్బతినడంతో మరమ్మతులు జరుగుతున్నాయి. ∙ఈ ప్యాలెస్ సముదాయానికి ఇన్టాక్ హెరిటేజ్ రెండుసార్లు అవార్డు (2002, 2005లో) ఇచ్చింది. 2010లో యునెస్కో ఈ మహల్‌కు ప్రత్యేకంగా ‘ఆసియా పసిఫిక్ మెరిట్ అవార్డు’ ప్రకటించింది. 2017లో నేషనల్ టూరిజమ్ డిపార్ట్మెంట్ ‘బెస్ట్ మెయింటెయిన్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫ్రెండ్లీ మాన్యుమెంట్’ అవార్డు వచ్చింది. ఈ ప్యాలెస్ పునరుద్ధరణ కోసం దాదాపుగా పది కోట్లు ఖర్చయ్యాయి. ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ రాహుల్ మల్హోత్రా బృందం 2005 నుంచి 2010 వరకు శ్రమించి చౌమొహల్లా ప్యాలెస్‌ను పూర్వపు రూపానికి తీసుకువచ్చింది. నిజాం కార్లు బగ్గీఖానాలో లండన్– ఎడిన్బర్గ్ చాసిస్ రోల్స్ రాయిస్, నేపియర్ కార్లు... మొత్తం ఎనిమిది వింటేజ్ కార్లు వరుసతీరి ఉన్నాయి. మేకోవర్ అయ్యి కొత్తగా మెరుస్తున్న రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్... హైదరాబాద్ నగరానికి వచ్చిన తొలి విదేశీ కారు. ఆ పక్కనే మరో షెడ్లో మూడు జీపులు, ఓ నిస్సాన్ కారు ఉంది. వీటితోపాటు మూడు మోటార్ బైక్‌లున్నాయి. ఒకటి హార్లీ డేవిడ్సన్ బైక్. మిగిలినవి రెడ్ ఇండియన్ షెఫ్స్, పారాట్రూపర్ బైక్. పక్కనే గుర్రపు బగ్గీలు కూడా బారులు తీరి ఉన్నాయి. పైకప్పు, తెరలతో ఆడవాళ్ల కోసం డిజైన్ చేసిన బగ్గీలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే విశాలమైన ప్రాంగణంలో గుర్రాలు సేదదీరేవని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : ఎన్. రాజేశ్ రెడ్డి -
శ్వేత సౌధం.. చౌమహల్లా ప్యాలెస్
సాక్షి, చార్మినార్: చౌమహల్లా ప్యాలెస్ సందర్శన తిరిగి ప్రారంభం కానుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చౌమహల్లా ప్యాలెస్ ట్రస్ట్ డైరెక్టర్ కిషన్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసే కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడానికి సిద్ధగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఆరు నెలలుగా చౌమహాల్లా ప్యాలెస్ సందర్శనను ట్రస్ట్ నిలిపి వేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సందర్శకుల అందుబాటులోకి వస్తున్న సందర్భంగా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్‌లోని నాలుగు ప్యాలెస్‌లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్ కొనసాగుతోంది. అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్ నిలువుటద్దంగా నిలుస్తుంది. రెండో నిజాం కాలంలో చార్మినార్–లాడ్‌బజార్‌కు అతి సమీపంలో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. చార్మినార్ కట్టడం నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్ యూరోపియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం. ఇది నాలుగు ప్యాలెస్‌ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్)గా నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అప్జల్–ఉద్–దౌలా–బహదూర్ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్ ప్యాలెస్‌లో నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్లో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మఫ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అప్జల్ మహల్ల నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్ మరింత శోభాయమానంగా మారింది. ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు. వీటిలో పొగరాని కొవ్వొత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. సందర్శన వేళలు, మార్గం ఎలా వెళ్లాలి: చార్మినార్ కట్టడం నుంచి లాడ్‌బజార్,ఖిల్వత్ చౌరస్తా ద్వారా ముందుకెళితే ఖిల్వత్ వస్తుంది. సందర్శించు వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు. సెలవు: శుక్రవారం. టికెట్ ధరలు: చిన్నారులకు రూ. 20, పెద్దలకు రూ.60, విదేశీయులకు రూ.200 రవాణా సౌకర్యం: నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసి బస్సు సౌకర్యం కలదు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆర్టీసి బస్సులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్: ప్యాలెస్ ఆవరణలో చార్జితో కూడిన పార్కింగ్ సౌకర్యం కలదు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కవాడిగూడ, గాంధీ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, రాంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిలల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ ప్రాంతాలతో పోల్చితే పాతబస్తీలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి పురాతన కట్టడం చౌమల్లా ప్యాలెస్ పాక్షికంగా దెబ్బతింది. రోడ్డు వైపు ఉన్న ప్యాలస్ ప్రహారీ గోడ కూలీపోయింది. దీనివల్ల అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయ ఏర్పడింది. -
విందు..పసందు
-
నిజం.. మీరే నిజాం..!
సాక్షి, హైదరాబాద్: తలపై రూమీ టోపీ.. పై నుంచి కిందికి షేర్వానీ.. మెడలో అందమైన ఆభరణాలతో రాజదర్పాన్ని తలపిస్తున్న వీరంతా ఆసఫ్జాహీ నవాబుల రాజ్యానికి చెందిన వారనుకుంటే పొరపాటే.. ఎందుకంటే వీరంతా సామాన్య పౌరులే.. చౌమొహల్లా ప్యాలెస్‌కు వచ్చిన సందర్శకులే. వీరే కాదు. మీరూ నవాబులా మారొచ్చు..! కొన్ని గంటల పాటు ఆ గెటప్‌లో అందర్నీ ఆకట్టుకోవచ్చు. పడక కుర్చీలో కూర్చొని మంతనాలు సాగించొచ్చు. రాజుగారిలా స్టిల్ ఇచ్చి అందర్నీ కట్టిపడేయొచ్చు. జిగేల్మనే దుస్తుల్లో మెరిసిపోవచ్చు. ఇంతకీ ఇదంతా ఎలా అనుకుంటున్నారు కదా..? అయితే ఇది చదవండి. చౌమొహల్లా ప్యాలెస్ చార్మినార్ సమీపంలో ఉంది. ఆసఫ్జాహీ నవాబుల రాజసానికి, గంభీరానికి ఈ ప్యాలెస్ నిలువెత్తు నిదర్శనం. మొగలాయి తర్వాత అంతటి గొప్ప రాజ్యానికి ప్రసిద్ధి. ఈ ప్యాలెస్‌లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నివాసం ఉండేవారు. ఇక్కడ ఆ రోజుల్లో ఉపయోగించిన ఎన్నో ప్రసిద్ధమైన వస్తువులున్నాయి. వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఇక్కడే ఒక ఫొటో స్టూడియో కూడా ఉంది. మిగతా వాటికంటే ఇది భిన్నమైంది. ఇక్కడ కేవలం నిజాం నవాబుల దుస్తుల్లో మాత్రమే ఫొటోలు తీస్తుంటారు. వెల వంద రూపాయలు మాత్రమే. సందర్శన వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. ఈ ఫొటో స్టూడియోలో అలనాడు నిజాం కుటుంబ సభ్యులు వేసుకున్న దుస్తుల్లాంటివి ఉంటాయి. పురుషులకు షేర్వానీ, పైజామా, రూమీ టోపీ, కుర్తా, కోటుతో పాటు పలు రకాలు దుస్తులు ఇక్కడ ఉంటాయి. షేర్వానీల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. మహిళలకు గాగ్రా, చోళీ, దుప్పట్టా తదితర దుస్తులున్నాయి. వీటితో పాటు రకరకాల ఆభరణాలు ఉంటాయి. క్షణాల్లో వీటిని వేసుకోవచ్చు. ప్యాలెస్ చూడటానికి వచ్చే వందలాది మంది యాత్రికులు వీటితో రెడీ అయితే అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్ క్షణాల్లో ఫొటో తీసి ఇస్తాడు. నలుపు తెలుపులో అలనాటి వైభవాన్ని గుర్తుకుతెచ్చేలా ఉండే ఈ ఫొటోలను చూసి సందర్శకులు మురిసిపోతుంటారు. తమ బంధువులు, మిత్రులకు చూపించి సంతోషాన్ని పంచుకుంటున్నారు. -
మహారాజసం
దేశంలో ఎన్నో రాచరికపు భవంతులు ఉన్నా... హైదరాబాద్‌లో కొలువుదీరిన ప్యాలెస్‌ల హంగు, ఆర్భాటాలు ఎంతో ప్రత్యేకం. మాటల్లో చెప్పే కంటే చౌమొహల్లా ప్యాలెస్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. నాటి ఘన చరిత్రకు సాక్ష్యాలుగా, కళాకారుల అద్భుత పనితనానికి నిదర్శనంగా, ఎందరో పర్యాటకుల మనసు దోస్తున్న ఈ ప్యాలెస్‌ను చూసొద్దాం రండి... చార్మినార్... లాడ్‌బజార్ దాటాక ఓ ఫర్లాంగ్ దూరంలో యూరోపియన్ శైలిలో నిర్మించిన నాలుగు ప్యాలెస్‌ల సముదాయం కనిపిస్తుంది. అదే చౌమొహల్లా. మక్కా మసీదుకు వెనకాల సుమారు 2.9 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. నాలుగు అత్యున్నత, అందమైన భవన సముదాయాల ప్రాంగణంగా, నిజాం ప్రభువుల నివాస గృహంగా చౌమొహల్లా ప్రసిద్ధికెక్కింది. రెండో నిజాం కాలంలో తొలుత ఈ ప్రాంతంలో ఖిల్వత్ ప్యాలెస్ నిర్మించారు. ‘ఖిల్వత్’ అంటే ఏకాంత ప్రదేశం అని అర్థం. చౌమొహల్లాలోని నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం ఐదో నిజాం అఫ్జల్ ఉద్ దౌలా బహదూర్ పాలనాకాలం (1857-69)లో జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. 1590-91 మధ్య కాలంలో హైదరాబాద్‌ను స్థాపించిన మహ్మద్ కులీ కుతుబ్‌షాషీ సామ్రాజ్యంలో, ‘చార్మినార్’ కేంద్ర బిందువుగా ఐదో కులీ కుతుబ్ భాగ్యనగరం, చుట్టు పక్కల పలు అపురూపమైన కట్టడాలను నిర్మించారు. అయితే 1687లో మొఘలు చక్రవర్తుల సైన్యం ఔరంగజేబు నేతృత్వంలో ఒక్క చార్మినార్, ఆ పరిసరాలలో గల మసీదులను మినహాయించి అన్నింటినీ నేలమట్టం చేసింది. కుతుబ్‌షాహీల పాలన తరువాత దక్కన్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న అసఫ్‌జాహీల పాలన సుమారు ఒకటిన్నర శతాబ్దం పైగా అప్రతిహతంగా కొనసాగింది. అసఫ్‌జాహీల పాలనాకాలంలో నాటి పూర్వ వైభవాన్ని చాటి చెప్పేలా ఆశ్చర్యం కలిగించే పలు భవన సముదాయాల నిర్మాణం జరిగింది. ఆ రకంగా అసఫ్జాహీలు తొలినాళ్లలో చేపట్టిన నిర్మాణాల్లో ‘ఖిల్వత్ ప్యాలెస్’ చెప్పుకోతగ్గది. ఐదో నిజాం అఫ్జల్ ఉద్ దౌలా బహదూర్ పాలనాకాలంలో ఖిల్వత్ ప్యాలెస్ ప్రాంగణంలో అనేక అపురూప కట్టడాల నిర్మాణం చేపట్టారు. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌తో చౌమొహల్లాలో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మహ్తాబ్ మహల్, తహ్నియత్ మహల్, అఫ్జల్ మహల్ల నిర్మాణం చేపట్టారు. టెహ్రాన్‌లోని ప్యాలెస్ కంటే ఎన్నో రెట్లు మిన్నగా నిజాం ప్రభువు ఈ ప్యాలెస్‌లను నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. కాగా, 1912 ప్రాంతంలో ఏడో నిజాం చౌమొహల్లాకు తగిన మరమ్మతులు చేయించి ప్యాలెస్‌ను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. చౌమొహల్లాలోని ప్రధాన ప్రవేశ ద్వారానికి అతిపెద్ద గడియారాన్ని 1915లో ఏడో నిజాం ఏర్పాటు చేశారు. ఇందులోని విశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను, అందులో అతిపెద్ద పాలరాతి ఫౌంటెయిన్ ఉన్నాయి. ఫౌంటెయిన్‌లో నుంచి నీళ్లు విరజిమ్ముతుంటే... నిండు పున్నమి రోజుల్లో, ‘అరేబియన్ నైట్స్’ కథల్లో వర్ణించినట్టు ఉంటుందని కళాభిమానులు చెబుతారు. ఈ ఫౌంటెయిన్‌కు ఉత్తరాన విశాలమైన దర్బార్ హాలు ఎత్తయిన పీఠంపై కనిపిస్తుంది. దర్బారు హాలులో నిజాం కొలువుదీరి ఉంటే, ఆ దారిన వచ్చే సందర్శకులంతా ఆయన కంట్లో పడేలా నిజాం తన సింహాసనం ఏర్పాటు చేసుకున్నాడు. దర్బారు హాలులో నేలపై పరిచిన పాలరాతిలో మన నీడ కనిపిస్తుంది. అంతేకాదు... తల ఎత్తి చూస్తే హాలు సీలింగ్ ఆకాశాన్ని తాకుతుందా... అన్నట్టు అనుభూతి. అందమైన లతలు, పూలంకరణలతో అరవై అడుగుల ఎత్తున సీలింగ్, ఆ సీలింగ్ నుంచి వేలాడుతూ లెక్కకు మిక్కిలిగా ఉన్న భారీ బెల్జియం క్రిస్టల్ శాండిలియర్స్ అందాలు... తప్పక చూసి తీరాల్సిందే! ఆనాటి రాచరికపు హోదాకు తీపి గుర్తుగా శాండిలియర్లు నేటికీ చెక్కు చెదరక కనిపిస్తున్నాయి. ఇవి చాలా వరకు నిజాంకు బహుమతిగా వచ్చాయని, మరికొన్ని 1799 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో భాగంగా ఆయనకు చెందాల్సిన వాటాగా టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ బహూకరించారని చెబుతారు. ఆ రోజుల్లో కరెంటు సౌకర్యం లేదు. కరెంటు లేని రోజుల్లో శాండిలియర్లను ఏం చేసుకోవాలి అనే సందేహం రావడం సహజం. వీటిల్లో పొగరాని కొవ్వొత్తులను వాడారు. మసి పట్టని ఆ కొవ్వొత్తులను లండన్ నుంచి దిగుమతి చేసుకొనేవారట. ప్రస్తుతం ఆ నాటి కొవ్వొత్తులతో భద్రంగా ఉన్న అందమైన శాండిలియర్స్ను చూస్తుంటే అబ్బురమనిపిస్తుంది. తన ఆస్థానానికి వచ్చే విదేశీ ప్రముఖులకు ఆహ్వానం, స్టేట్ రిసెప్షన్లు ఇక్కడే ఇచ్చేవారు. 1905లో కింగ్ జార్జ్-5, క్వీన్ మేరీలు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నిజాం వారికి సాదరంగా చౌమొహల్లా ప్యాలెస్‌లోనే స్వాగతం పలికారు. వందల ఏళ్లు పైబడి చరిత్ర ఉన్న ఈ ప్యాలెస్ నేడు నిజాం ట్రస్టు నిర్వహణలో ఉంది. చాలా కాలం... అంటే 2004 వరకు చౌమొహల్లాను సందర్శించాలనుకునేవారికి అందని ద్రాక్షగానే ఉండేది. కానీ, ప్రస్తుతం సామాన్యులు కూడా రాజభవనంలోకి వెళ్లి ఆ నాటి వైభవాన్ని కళ్లారా చూసే అవకాశం ఉంది. నాటి కళాకారుల అద్భుతమైన పనితనాన్ని పరిశీలించవచ్చు. ప్రవేశ రుసుము రూ.40. ప్రతి శుక్రవారం సెలవు. వివరాలకు ఫోన్:040-24522032. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇటీవల కాలంలో తరచూ సాయంత్రం పూట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్యాలెస్‌లోని ఆరుబయట పచ్చిక బయళ్లలో సమావేశాల నిర్వహణకు అవకాశం కల్పిస్తున్నారు. -
నిజాం వారసుల సందడి