pathabasthi
-
మూడేళ్ళ పాపను ఎత్తుకెళ్లిన యువకుడు
-
Old City: బామ్ ఫ్యామిలీ అరాచకాలు.. యువకుడి బట్టలు తొలగించి దాడి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–రాచకొండ పోలీసు కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతంలో బామ్ ఫ్యామిలీ అరాచకాలు చేస్తోంది. బార్కస్ కేంద్రంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అబుబకర్ కాలనీలోని వీరి ఫామ్‌హౌస్‌లో ఓ యువకుడి బట్టలు తొలగించి దాడి చేశారు. ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు బామ్ కుటుంబాల వ్యవహారాలను ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసుల అండదండలతోనే వీళ్లు రెచ్చిపోతున్నారని, వీరిపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదైనా సరైన చర్యలు లేవని స్థానికులు వాపోతున్నారు. 500 మందితో అతి పెద్ద ‘కుటుంబంగా’.. పాతబస్తీలోని పాతబస్తీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బామ్ కుటుంబం చాలా పెద్దదని స్థానికులు చెబుతున్నారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కజిన్స్... ఇలా మొత్తం దాదాపు 500 మంది ఉన్నారని వివరిస్తున్నారు. వీళ్లు ఇటు హైదరాబాద్–అటు రాచకొండ పోలీసు కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతాల్లో అరాచకాలు చేస్తున్నారు. దౌర్జన్యాలు, భూ కబ్జాలు, దాడులు ఇలా అనేక ఆరోపణలపై ఫిర్యాదులు, కేసులు సర్వసాధారణంగా మారిపోయింది. గొడవకు దిగాలన్నా, కబ్జాలకు పాల్పడాలన్నా వీళ్లు పథకం ప్రకారం ముందుకు వెళ్తారని బార్కస్ వాసులు చెబుతున్నారు. బార్కస్ బామ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఓ సంస్థను కూడా స్థాపించారని, దీని ముసుగులోనే కబ్జాలు చేస్తున్నారని బార్కస్ వాసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 50కి పైగా కేసులు... ఈ కుటుంబానికి చెందిన సౌద్ బామ్, ఇక్బాల్ బామ్, ఫైసల్ బామ్, అహ్మద్ బామ్, హుస్సేన్ బామ్, అబూద్ బామ్, దావూద్ బామ్, సులేమాన్ బామ్, ఫహద్ బామ్, తయ్యబ్ బామ్, ఒమర్ బామ్, జఫార్ బామ్, ఉస్మాన్ బామ్, ఇబ్రహీం బామ్, జక్రియా బామ్ తదితరులపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. 2010 నుంచి ఆదిబట్ల, బాలాపూర్, చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, పహాడీషరీఫ్ తదితర ఠాణాల్లో వివిధ సెక్షన్ల కింద వీటిలో ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ, సీఐడీల్లోనూ బామ్ కుటుంబీకులపై రెండు కేసులు ఉన్నాయి. వీరి వ్యవహారాలు ఉన్నతా«ధికారుల వరకు వెళ్లకుండా కింది స్థాయి వారిని మ్యానేజ్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే శాంతిభద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచ్, నిఘా విభాగాలకు చెందిన వాళ్లు కూడా ఇక్కడ ఏం జరుగుతోందో ఉన్నతాధికారులకు చెప్పకుండా తప్పుదారి పట్టిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. మేక చోరీకి యత్నించాడని దారుణం... కొన్నాళ్ల క్రితం అబుబకర్ కాలనీలో ఉన్న ఫైసల్ బామ్ ఫామ్ హౌస్‌లో దారుణం చోటు చేసుకుంది. మేకను చోరీ చేయడానికి వచ్చాడనే ఆరోపణలపై ఓ యువకుడిని పట్టుకున్న బామ్స్ నగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. ఆ సందర్భంగా వాళ్లల్లోనే ఒకరు తీసుకున్న వీడియో ఆలస్యంగా బయటకు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని నగ్నంగా మార్చి కొట్టడంతో పాటు చుట్టూ నిల్చున్న వ్యక్తులు తమ ఫోన్లలో వీడియోలు చిత్రీకరిస్తుడటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోతో పాటు బామ్ కుటుంబాల వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, రాచకొండలకు చెందిన అధికారులు దీనికోసం బుధవారం రంగంలోకి దిగినట్లు తెలిసింది. చట్టపరంగా పీడీ యాక్ట్ నమోదుకు ఆస్కారం ఉంటే ఆ దిశలో చర్యలు తీసుకోవాలని బార్కస్ వాసులు కోరుతున్నారు. బామ్స్కు భయపడి అనేక మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదని చెప్తున్నారు. పోలీసులు పక్షపాతంతో ఉన్నారు గత నెల 21న సలాలా పీలీ దర్గా సమీపంలోని జిమ్ వద్ద ఘర్షణ జరిగింది. మా సోదరులైన ముగ్గురిపై బామ్ ఫ్యామిలీకి చెందిన దాదాపు 25 మంది దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే మా వాళ్లు ఆత్మరక్షణ కోసం కత్తితో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట ఠాణాలో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. మా వాళ్లను అరెస్టు చేసిన పోలీసులు రెండు కేసులు ఉన్నా బామ్ సంబంధీకుల జోలికి వెళ్లట్లేదు. మా సోదరులపై దాడి చేసిన వారిపై మేము ఇచ్చిన ఫిర్యాదుతో పాటు మరో దాన్నీ స్థానిక పోలీసులు పట్టించుకోవట్లేదు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి న్యాయం చేయాలి. – సయీద్ బాయిసా ఆమోదీ, బార్కస్ వాసి -
Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తుండగా.. పాతబస్తీలో ఇంకా పనులను కూడా ప్రారంభించకపోవడంపై నిరాశకు గురవుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో పనులు పూర్తయ్యి ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. పాతబస్తీలో మెట్రో రైలు పనుల ఊసే లేదు. ఇటీవల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నూతనంగా నిర్మించనున్న మెట్రో పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన సైతం చేశారు. దీంతో ఇప్పట్లో పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు తీసే పరిస్థితులు కనిపించడం లేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరి»ౌలి, శాలిబండ, సయ్యద్ అలీ ఛబుత్రా, అలియాబాద్, షంషీర్గంజ్ ద్వారా ఫలక్‌నుమా వరకు 6 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. మెట్రో రైలు పనులను ప్రారంభించడానికి ఒక దశలో ముందుకు వచ్చిన ప్రాజెక్టు అధికారులు అంచనా వ్యయం పెరిగిందని వెనక్కి తగ్గారు. ఇదిలా ఉండగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి పాతబస్తీలో మెట్రో రైలు పనుల కోసం రూ.500 కోట్ల నిధులను మంజూరు చేయించామని పేర్కొంటూ వెంటనే పనులు ప్రారంభించాలని రెండు నెలల క్రితం మెట్రో రైలు ప్రాజెక్ట్ ఎండీని కలిసి కోరారు. అయినా.. పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభం కాలేదు. ట్విటర్లో పోస్టుచేసి మరచిన కేటీఆర్.. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని గతేడాది మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను మరిచిపోయాడని పాతబస్తీ ప్రజలు అంటున్నారు. గతంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అసెంబ్లీలో పాతబస్తీ మెట్రో రైలు ప్రస్తావన తెచ్చి.. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో పాతబస్తీ ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018లో అలైన్‌మెంట్‌ను పరిశీలించిన మెట్రో ఎండీ, ఎమ్మెల్యేలు.. 2018 ఆగస్టు 25న పాతబస్తీలో మెట్రో రైలు అలైన్మెంట్ పనులను ప్రారంభించడానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీతో పాటు మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు పాతబస్తీలో పర్యటించారు. గతంలో ప్రతిపాదించిన విధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(ఎంజీబీఎస్) నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు పనులను చేపట్టడానికి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారుల బృందం పరిశీలించింది. పాత అలైన్మెంట్ ప్రకారమే పనులు ప్రారంభిస్తామని అధికారులు, ఎమ్మెల్యేలు అప్పట్లో తేల్చి చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. -
చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా.. కారణం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌కు కొనసాగింపుగా నిర్మించిన ఎక్స్టెన్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది. మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్ ఫ్లోవర్ను ప్రారంభించాల్సి ఉండగా.. ఓపెనింగ్‌ను ఈనెల 27కు వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీజేపీ కార్యకర్తల ఆందోళన, పాతబస్తీలో ఉద్రిక్తత నేపథ్యంలో కేటీఆర్ పర్యటనను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట జంక్షన్ వద్ద ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుంది. చాంద్రాయణగుట్ట జంక్షన్ నుంచి వివిధ మార్గాలవైపు వెళ్లేవారికి ఎంతో సదుపాయం కలగనుంది. జంక్షన్ వద్ద వేచిఉండే సమయం తగ్గడంతోపాటు ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గనున్నాయి. ఫ్లైఓవర్ కింద పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారింది. ఫిల్లర్ల నడుమ చక్కటి గార్డెనింగ్‌ను ఏర్పాటు చేశారు. పాత, కొత్త ఫ్లై ఓవర్ల అనుసంధానం కారణంగా పాత ఫ్లై ఓవర్‌ను సైతం మూసేయ్యడంతో ఇన్నాళ్ల పాటు ఇబ్బందులకు గురైన వాహహనదారులకు ఇక ఊరట లభించనుంది. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ దిగగానే సంతోష్‌నగర్ వైపు రోడ్డు ఇరుకుగా (ఒకవైపు దర్గా, మరోవైపు దేవాలయం, దర్గా) ఉండి వాహనాల వేగం తగ్గి ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించేది. దీనికి తోడు కందికల్ గేట్ నుంచి చాంద్రాయణగుట్ట పాత పోలీస్‌స్టేషన్ రహదారి సిగ్నల్ కూడా ఇక్కడే ఉండడంతో సమస్య మరింత జటిలమైంది. ఈ సమస్య పరిష్కారానికి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రతిపాదనతో ఎక్స్టెన్షన్ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. దీంతో మొత్తం ఫ్లై ఓవర్ 980 మీటర్లకు చేరుకుంది. చదవండి: Breaking: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ ఫ్లై ఓవర్ ఎక్స్టెన్షన్ పొడవు: 674 మీటర్లు వెడల్పు: 16.61 మీటర్లు లేన్లు: 4, ప్రయాణం: రెండు వైపులా పాతబస్తీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ పాతబస్తీ అభివృద్ధి కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్లైవర్ల నిర్మాణాలు చేపట్టారు. 2005– 2007మధ్య కాలంలో మలక్‌పేట, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్లను నిర్మించారు. వీటితో పాటు ఉప్పుగూడ, కందికల్ రైల్వేగేట్ల వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి 2007 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. ఇందులో ఒకటి ఆర్ఓబీ, మరొకటి ఆర్యూబీ. ఇవే కాకుండా పాతబస్తీలో ప్రస్తుతం బహదూర్‌పురా, ఫిసల్‌బండ ప్రాంతాల్లోనూ రెండు ఫ్లై ఓవర్లు ఇటీవలే వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫలక్‌నుమా, డబిర్పురాలలో రైల్వే వంతెనలు కూడా ఉన్నాయి. వాహనదారుల కష్టాలు తప్పాయి.. చాంద్రాయణగుట్టలో వాహనదారుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఫ్లై ఓవర్ నిర్మాణ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారు. చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. – ఫహద్ బిన్ అబ్దాద్, ఉప్పుగూడ కార్పొరేటర్ ట్రాఫిక్ సమస్య దూరం.. టీఆర్ఎస్ సర్కార్ నగరంలో ట్రాఫిక్ సమస్యను దూరం చేసేలా వంతెనలను నిర్మిస్తుండడం సంతోషకరం. ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుండటంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాదు. ముఖ్యంగా కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయి. – శ్రీనివాస్ గౌడ్, కందికల్ గేట్ ఎస్సార్డీపీ ఫలాలు.. నగరంలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చేపట్టిన 41 ఎస్సార్డీపీ పనుల్లో చాంద్రాయణగుట్ట ఎక్స్టెన్షన్ ఫ్లైవర్తో 30 పనులు పూర్తయ్యాయి. మిగతా 11 పనులు పురోగతిలో ఉన్నాయి. వీటిల్లో నాగోల్ ఫ్లై ఓవర్ మరో రెండునెలల్లో అందుబాటులోకి రానుంది. శిల్పా లేఔట్, కొండాపూర్ ఫ్లై ఓవర్లు సైతం ఈ సంవత్సరంలో పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులున్నారు. ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు ఇప్పటి వరకు ఏడు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఆరాంఘర్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ వరకు అతి పొడవైన ఫ్లైవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. -
హైదరాబాద్: మొహర్రం సందర్భంగా పాతబస్తీలో భారీ బందోబస్తు
-
పాతబస్తీలో ఉచిత పార్కింగ్ సౌకర్యం
చార్మినార్: పాతబస్తీలో ఓవైపు పర్యాటకులు..మరోవైపు రంజాన్ షాపింగ్ రద్దీతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రాకపోకలకు సైతం ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల పార్కింగ్ మరింత క్లిష్టంగా మారగా... ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ► రంజాన్ మాసంలో చివరి పది–పన్నెండు రోజులు పాతబస్తీలోని మార్కెట్లు రద్దీగా మారుతాయి. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతం కిటకిటలాడుతుంది. ► అలాగే మక్కా మసీదులో ప్రతి రోజు నిర్వహించే ఐదు నమాజ్‌లకు ముస్లింలు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ► దీనిని దృష్టిలో పెట్టుకొని నగర ట్రాఫిక్ ఉన్నతాధి కారులు తాత్కాలిక పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పార్కింగ్ సౌకర్యం కల్పించిన ప్రాంతాలివే.. ►చార్మినార్ సమీపంలో.. ► యునానీ ఆసుపత్రి ప్రాంగణం ► కుడా స్టేడియం ► మోతీగల్లీ పెన్షన్ ఆఫీసు ► కోట్ల అలీజాలోని ముఫిదుల్లానామ్ హైస్కూల్ ప్రాంగణం ►పంచమొహల్లాలోని కూలగొట్టిన ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలం పార్కింగ్ ఉచితమే.. రంజాన్ మాసంలోని చివరి పది–పన్నెండు రోజులు ఎంతో కీలకం. పాతబస్తీ రద్దీగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమీపంలోని ఆరు ప్రాంతాల్లో వాహనదారుల కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశౠం. ఇక్కడ పార్కింగ్ ఉచితం. ఎలాంటి డబ్బులు వసూలు చేయరు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే..మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రెడ్డి, దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ -
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల సందడి ప్రారంభమైంది. 113వ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడం బోనాల ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల దర్శనార్థం రెండు లైన్ల ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనలు ఘనంగా జరుగుతున్నాయని, నేడు లాల్ దర్వాజ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం రంగం కార్యక్రమంతో పాటు, ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందని పేర్కొన్నారు. ప్రభుత్వమే బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించామని, కరోనను పారద్రోలి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈసారి కురిసిన మంచి వర్షాలకు కృష్ణ, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనము చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బీజేపీ నేత విజయశాంతి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం బంగారు బోనం ఎత్తుకుంటానన్న మొక్కును బోనం సమర్పించి తీర్చుకున్నట్లు తెలిపారు. కరోన తగ్గాలని, అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మంచి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే బంగారు బోనం సమర్పిస్తా అని మొక్కుకున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శించుకున్నారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని విజయశాంతి మొక్కుకున్నారని చెప్పారు. అమ్మవారు చాలా శక్తి వంతమైనవారని ఎక్కడ చూసిన పండగ వాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నారు.కరోనా మహమ్మరిని నుంచి దేశ ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లాల్ దర్వాజ బోనాలకు విచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తను హైదరాబాద్‌లోనే డాక్టర్‌గా పని చేశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి మనమంతా బయటపడాలని అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించినట్లు పేర్కొన్నారు. -
Hyderabad: అయ్యో! ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా?
సాక్షి, సిటీబ్యూరో: పాత నగరానికి మెట్రో జర్నీ కలగా మారనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో పనులు చేపట్టేందుకు గతంలో పలు మార్లు హడావుడి మొదలైనప్పటికీ అడుగు ముందుకు పడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మెట్రో నిర్మాణ సంస్థ వర్గాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. నష్టాల మెట్రో గాడిన పడేందుకు సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. దీంతో పాతనగరంతోపాటు రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలోనూ మెట్రో ఎప్పటికి పూర్తవుతుందన్న అంశం సస్పెన్స్‌గా మారడం గమనార్హం. సమస్యలు ఎన్నో.. ► ప్రధానంగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, మరో 69 వరకు ప్రార్థనా స్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించడం, మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే స్థలాన్ని సేకరించడం వంటి పనులు కత్తిమీద సాములా మారాయి. ► పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు వంద కోట్లకుపైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ► సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు రూ.1250 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► ఇక పనులు చేపట్టేందుకు వీలుగా ఆస్తుల సేకరణ ఆలస్యమైతే ప్రాజెక్టు నిర్మాణ గడువు పెరిగే అవకాశం ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ► ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనా స్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ► ఈ సమస్యల కారణంగానే నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ► గతంలో మెట్రో అధికారులు, నిర్మాణ సంస్థ వర్గాలు ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరిబౌలి, శాలిబండ, సయ్యద్ అలీఛబుత్రా, అలియాబాద్, షంషీర్గంజ్ ద్వారా ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు ప్రారంభిస్తామని హడావుడి చేసినా..అడుగు ముందుకుపడకపోవడం గమనార్హం. ► మరోవైపు తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగిందని..ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ఇటీవల ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం. మెట్రో కోసం మహా పోరాటం.. పాతబస్తీ మెట్రో కోసం పలు రాజకీయ పార్టీలు మహా పోరాటమే చేశాయి. పలు రాజకీయ పారీ్టలతోపాటు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేల పాదయాత్రలతో మెట్రో ప్రాజెక్టు కోసం మహా ఉద్యమమే సాగింది. 2017 నుంచి 2021 వరకు పలు రాజకీయ పార్టీలు మెట్రో కావాలని నినదిస్తున్న విషయం విదితమే. -
పాతబస్తీలో యువకుడి హంగామా: వైట్నర్ తాగి బ్లేడ్‌తో కోసుకొని
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో వైట్నర్ బాధితుల బెడద ఎక్కువైంది. వైట్నర్ సేవిస్తున్న యువకులు చేసే హంగామా జనాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సోమవారం ఉదయం పాతబస్తీ ఛత్రినాకలో వైట్నర్ సేవించిన ఇర్ఫాన్ అనే వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకోవడానికి రావటంతో మత్తులో ఉన్న ఆ వ్యక్తి వారికి దొరకకుండా పరిగెడుతూ బ్లేడుతో చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావటంతో అతను రోడ్డుపై పడిపోయాడు. ఇర్ఫాన్ తన చర్యలతో బీభత్సం సృష్టిస్తూ పోలీసులనే బెంబేలెత్తించాడు. అతికష్టం మీద అతన్ని పట్టుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గతకొన్ని రోజులుగా ఇర్ఫాన్ వైట్నర్ తాగుతూ బానిసగా మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: భర్త వేధింపులు: పోలీసు స్టేషన్లోనే పురుగుల మందు తాగి.. -
పాతబస్తీలో యువతి విక్రయం
సాక్షి, చాంద్రాయణగుట్ట: దుబాయిలో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ దళారి చాంద్రాయణగుట్టకు చెందిన యువతిని సుడాన్ షేక్‌కు విక్రయించింది. దుబాయిలో నరకం అనుభవిస్తున్న ఆ యువతి ఎంతో కష్టపడి తన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసింది. దీంతో ఆ యువతిని భారత్‌కు రప్పించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ విదేశీ వ్యవహారాల శాఖకు ఈమెయిల్లో విన్నవించుకున్నారు. బండ్లగూడ గౌస్‌నగర్ హుందాహిల్స్‌కు చెందిన నర్సుగా పనిచేసేది. ఈ సమయంలో వట్టెపల్లికి చెందిన ఫాతిమా అనే మహిళకు ఆమె పరిచయమయ్యింది. షార్జాలోని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తే నెలకు రూ.40 వేలు వస్తాయని, అక్కడ తనకు తెలిసిన వారున్నారని నమ్మించి నూర్జహాన్ను గత డిసెంబర్ 15న షార్జాకు పంపించింది. అక్కడ ఆమెను అమ్మర్ అహ్మద్ ఉమర్ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మర్ ఇంట్లో గతంలో ఫాతిమాతో కలిసి ఉండే నజ్మీన్ అనే బాలికను నూర్జహాన్ చూసింది. మూడు నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ కింద నజ్మీన్‌ను పంపించినట్లు సదరు యువతికి తెలిసింది. అమ్మర్ తాను ఫాతిమాకు రూ.2 లక్షలు చెల్లించినట్టు ఆ యువతికి చెప్పాడు. ఫాతిమాకు అమ్మర్ ద్వారా ఫోన్ కాల్ రావడంతో ఆమె తల్లి వద్దకు వెళ్లి ఆమె ముందు రూ.2 లక్షలు పెట్టి వీడియో తీసి షేక్‌కు పంపించారు. అనంతరం డబ్బు తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఈ వీడియా చూసిన అనంతరం ఆ యువతి నాలుగు రోజులపాటు షేక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై తాను పడుతున్న నరకాన్ని వాట్సాప్ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు వెల్లడించింది. కాగా బాధిత కుటుంబం నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. -
రోజుకు 15 గంటల పని.. లైంగిక వేధింపులు
సాక్షి, ఛార్మినార్: ఆర్థిక ఇబ్బందులతో కొంత మంది అమాయక ముస్లిం మహిళలు ఏజెంట్ల చేతుల్లో మోసానికి గురవుతున్నారు. పాతబస్తీలోని మురికివాడలకు చెందిన కొంత మంది మహిళా ముస్లింలు జీవనోపాధి కోసం దుబాయ్ తదితర అరబ్బు దేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల వలలో చిక్కుకుని పడరాని పాట్లు పడుతున్నారు. అమాయక మహిళలకు ఏజెంట్లు వారికి మాయమాటలు చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపుతున్నారు. అక్కడ వారు నరకయాతన పడుతున్నారు. తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు వస్తామంటూ వేడుకుంటున్నారు. చదవండి: మోజు తీరగానే ఫోన్లో తలాక్.. శాలిబండ, కిషన్‌బాగ్, బేగంపేట్లకు చెందిన 8 మంది బాధితుల కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ సహకారంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు రాతపూర్వకంగా వినతి పత్రం పంపించారు. ఎనిమిది మంది మహిళలను దుబాయ్‌కు పంపించిన ఏజెంట్ షఫీని టాస్‌్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతోందంటే... ► ఏజెంట్స్ ఇక్కడ చెప్పేదొకటి...అక్కడికి తీసుకెళ్లిన తర్వాత చేసేదొకటి. ► మంచి ఉద్యోగం..సరిపడా జీతం అని చెప్పే ఇక్కడి ఏజెంట్లు..అక్కడికి వెళ్లిన అనంతరం యుఏఈలోని కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలకు అప్పజెబుతున్నారు. ► దీంతో అమాయక ముస్లింలు తమకు సంబంధం లేని పనులు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► మూడు నెలల విజిటింగ్ వీసాపై వీరిని దుబాయ్‌కు తరలిస్తున్న ఏజెంట్లు అనంతరం కనుమరుగవుతున్నారు. ► దుబాయ్‌లో రిక్రూట్ చేసుకుంటున్న ఏజెన్సీలు అక్కడి డబ్బున్న ఇళ్లల్లో పాచిపని చేయడానికి వీరిని అప్పజెబుతున్నారు. ► వీరిపై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ► ఇంటి యజమానులు వీరిపై కనికరం లేకుండా అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్నారని బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. వారు పెట్టే నరక యాతనను భరించ లేక తిరిగి నగరానికి రావడానికి సిద్ధపడుతున్నారు. ► ఈ విషయాన్ని సంబందిత ఏజెంట్లకు తెలియజేస్తే...లక్షల్లో డబ్బులు చెల్లించాలంటూ మొండికే స్తున్నారు. అసలేం జరిగిందంటే.. ► కిషన్‌బాగ్‌కు చెందిన యాస్మిన్ బేగం, అమ్రీన్ బేగం, శాలిబండకు చెందిన రహీమాబేగం, బేగంపేట్‌కు చెందిన కనీజ్ ఫాతిమా, నజియాబేగంలతో పాటు మెహెరున్సీసా బేగం, అస్మా బేగం, జరీనా బేగం అనే 8 మంది ముస్లిం మహిళలు షఫీ అనే ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లారు. ► పాతబస్తీ మిశ్రీగంజ్‌కు చెందిన షఫీ అనే ఏజెంట్ వీరికి డబ్బు ఆశ చూపి మాయమాటలు చెప్పి సెపె్టంబర్–అక్టోబర్ మాసాల్లో దుబయ్‌కు తీసుకెళ్లాడు. ► మూడు నెలల విజిటింగ్ వీసాపై తరలించిన షఫీ అక్కడి లేబర్ రిక్రూట్మెంట్ అల్ సఫీర్ అనే రిక్రూట్ సంస్థకు అప్పగించాడు. ► అక్కడి రిక్రూట్ సంస్థ వీరిని ఒక్కొక్కరిని రూ.2 లక్షలకు అరబ్ కుటుంబాలకు అప్పగించింది. అక్కడి నుంచి వీరి కష్టాలు మొదలయ్యాయి. ► రోజుకు 15 గంటలు పని చేయించుకునే వారు కొందరైతే..శారీక వేధింపులకు గురిచేసే వారు కొందరు. ► దీంతో విసిగి పోయిన బాధితురాళ్లు ఇక్కడి నగరంలోని తమ కుటుంబ సభ్యులకు వాట్స్ యాప్ కాల్స్ ద్వారా బోరుమన్నారు. అక్కడ తమ వారు పడుతున్న బాధలను భరించలేని ఇక్కడి వారి కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ సహకారంతో కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసారు. ► సాధ్యమైనంత వెంటనే తమ వారిని భారత్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
మోజు తీరగానే ఫోన్లో తలాక్..
ఓ గదిలో కొందరు బాలికలు కూర్చొని ఉన్నారు.. వయసు పైబడిన ఓ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత వారిలో ఒక బాలికను ఓకే చేశాడు. ఇది ఏ ఉద్యోగం కోసమో జరుగుతున్న ఇంటర్వ్యూకాదు... అమ్మాయిల కొనుగోలు కోసం జరుగుతున్న తంతు. అందం.. ఆరోగ్యం ఉన్న హైదరాబాద్ అమ్మాయిలను ఎంత డబ్బు కుమ్మరించైనా సొంతం చేసుకునేందుకు సొమాలి, సూడానీలు పోటీపడుతున్నారు. ఈ తతంగానికి పెళ్లి అని పేరు పెట్టి.. యువతుల జీవితంతో ఆడుకుంటున్నారు. ఇలాగే ఓ సోమాలీ దేశస్తుడు (అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి) పాతబస్తీకి చెందిన మైనర్ అమ్మాయి సబాఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరగానే అమెరికా వెళ్లి ఫోన్లో తలాక్ చెప్పేశాడు. చదవండి: నెల రోజుల్లో పెళ్లి.. చేతిలో చిల్లిగవ్వ లేక ఏం జరిగింది... : పాతబస్తీ గాజియే మల్లత్ కాలనీకి చెందిన సబా ఫాతిమా(16)కు అబ్ది వలీ అహ్మద్(54)తో పెళ్లి జరిగింది. అప్పటికీ ఫాతిమా మైనర్. టోలిచౌకిలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉన్నారు. అలా 2 నెలలు గడిచిన తర్వాత వారం రోజుల్లో తిరిగి వస్తా అని చెప్పి దుబాయ్ వెళ్లాడు. ఏడాది తర్వాత వచ్చాడు. మళ్లీ రెండు నెలలు ఉండి ఎక్కడికో వెళ్లేవాడు. ఇలా నాలుగుసార్లు జరిగింది. అద్దె ఇళ్లను మారుస్తూ మెహిదీపట్నం, మలక్‌పేట్‌తో పాటు పలుచోట్ల సబాతో ఉండేవాడు. కాగా, 2020, ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఉన్న తన తల్లి వద్దకు వెళ్తున్నానని.. తర్వాత వచ్చి సబాను తీసుకెళ్తానని చెప్పి వెళ్లాడు. లాక్డౌన్ ముగిసే వరకు దుబాయ్‌లో ఉండి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లాడు. అక్టోబర్ 7న సబా తండ్రి మహ్మద్ ఫరీద్‌కు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని మూడుసార్లు ఆ పదం ఉచ్చరించాడు. అప్పటి నుంచి సబా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఘాన్సీబజార్‌లోని ఉమెన్స్ పోలీసులకు ఆశ్రయించింది. న్యాయం చేయండి... ‘మా నాన్నకు మేము ఐదుగురం అమ్మాయిలం. నాన్న ఆటో నడిపిస్తారు. నేనే ఇంట్లో పెద్ద. నాన్న బాధ చూడలేక నా కంటే రెండింతలు ఎక్కువ వయసున్న నల్లజాతీ యుడిని పెళ్లి చేసుకున్నా. తనకు అమెరికా పౌరసత్వం ఉందని, వాళ్లమ్మ దుబాయ్‌లో ఉంటుందని చెప్పాడు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని పెళ్లి చేసుకున్నా. తర్వాత ఎప్పుడూ నెల రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. అక్టోబర్‌లో నాన్నకు ఫోన్ చేసి తలాక్ ఇస్తున్నానని చెప్పాడు. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా’ – సబాఫాతిమా ఇది ఒక్కరి కథ కాదు.. సబాఫాతిమానే కాదు.. పాతబస్తీకి చెందిన ఎందరో అమ్మాయిల దీనగాథ ఇది. సోమాలీ, సూడానీ దేశస్తులు.. ఇక్కడి అమ్మాయిల అందానికి వెల కడుతున్నారు. పెళ్లి కోసం వచ్చే వీరంతా కుర్రాళ్లేం కాదు. 50–60 ఏళ్లు పైబడిన వారే. వీరు సంపన్నులు కాదు. సోమాలియా, సూడాన్‌తో పాటు ఇతర అరబ్బు దేశాల నుంచి విద్య, వ్యాపారం, వైద్యం కోసం వస్తున్నారు. శారీరక అవసరాల కోసం మాత్రమే లక్ష, 2 లక్షలు ఇచ్చి పాతబస్తీ అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు. ఇక్కడి కుటుంబాల్లో పేదలే ఎక్కువగా ఉండటం.. అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువగానే కావడం, పేదరికం, నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని దళారులు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారు టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లోనే అద్దెకు ఉంటున్నారు. దళారుల ద్వారా అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి నచి్చన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇష్టంలేకపోయినా ఒత్తిడి తెచి్చ మరీ తమ పంతం నెరవేర్చుకుంటారు. పెళ్లి చేసుకునే వ్యక్తి ఇచ్చే డబ్బును దళారులు.. ఏజెంట్లు.. తల్లిదండ్రులు పంచుకుంటారు. అయితే వీటిలో అధిక భాగం దళారుల చేతికే చేరుతుంది. పాతబస్తీలో గోప్యంగా పెళ్లి జరుగుతుంది. అక్కడి నుంచి మకాం కొత్తబస్తీకి మారుస్తారు. -
పాతబస్తీలో వెలుగులోకొచ్చిన దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. దుబాయ్‌లో మహిళకు పని కల్పిస్తామని చెప్పి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఒక్కో మహిళను రూ.2 లక్షలకు దుబాయ్‌కి చెందిన షేక్‌లకు బస్తీలోని బ్రోకర్లు అమ్ముతున్నారు. విజిటింగ్ వీసాలపై మహిళలను అక్కడక పంపిస్తూ విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని బ్రోకర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమవారి కోసం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్ తలాక్ పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి ఫోన్లో తన భార్యకు అదివలీ అనే వ్యక్తి తలాక్ చెప్పాడని బాధితురాలు సభా ఫాతిమా తెలిపారు. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను వలి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఫాతిమా భర్త అమెరికాలో ఉంటున్నాడు. తన భర్త వలి అమెరికా నుంచి ఫోన్లో ట్రిపుల్ తలాక్ చేప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆమె గురువారం ఆశ్రయించారు. -
పాతబస్తీలో 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో పుట్టి పెరిగారు. చట్టసభకు ఎంపికయ్యారు. రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉన్నారు. బల్దియా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్న వేళ ఆజంపురా కేంద్రంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు హోంమంత్రి మహమూద్ అలీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా డివిజన్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కడతారని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ► టీఆర్ఎస్ ఎన్ని డివిజన్లను కైవసం చేసుకుంటుంది? బల్దియాలో గత ఐదేళ్లలో దేశంలోని ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌లో జరిగింది. నగరం మెరుస్తోంది. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి గ్రేటర్ జనం ఓటు వేస్తారని భావిస్తున్నాం. వంద డివిజన్లకుపైగా గెలుస్తాం. ► మజ్లిస్‌తో టీఆర్ఎస్కు పొత్తు ఉందా? మేం సొంతంగా 150 డివిజన్లలో బరిలో నిలిచాం. మాకు ఏ పారీ్టతోనూ పొత్తు లేదు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 డివిజన్లలో గెలిచాం. పాతబస్తీలో ఈసారి 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం. మజ్లిస్‌తో టీఆర్ఎస్కు పొత్తు ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ► నగరంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి? దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక పరికరాలతో పోలీస్ శాఖ పని చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో నగర శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉండేది. టీఆర్ఎస్ అధికారంలో వచి్చనప్పటి నుంచి నగర ప్రజలు శాంతియుతంగా జీవనం కొనసాగిస్తున్నారు. మతకల్లోలాలు, కర్ఫూలు, ఘర్షణలు లేవు. క్రైమ్ రేట్ ఇతర నగరాల కంటే చాలా తక్కువగా ఉంది. ►నగరంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదనే విమర్శలపై మీరేమంటారు? టీఆర్ఎస్ అధికారంలో రాకముందు నగరంలో గంటల తరబడి విద్యుత్తు ఉండేది కాదు. ప్రస్తుతం 24 గంటలపాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. తాగునీరు పుష్కలంగా వస్తోంది. ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. రూ.5కు భోజనం అందిస్తున్నాం. విద్య, వైద్య వ్యవస్థలు మెరుగుపడ్డాయి ►టీఆర్ఎస్ పాలనలో మైనారిటీల సంక్షేమం ఎలా ఉంది? ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్యులర్ నాయకుడు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది. కేవలం మైనారిటీలనే కాదు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు ప్రవేశపెట్టాం. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. ►మైనారిటీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారానే విమర్శలున్నాయి? మతత్వ పార్టీలు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పింగిచాలని చూస్తున్నాయి. ఆ పార్టీల ఆగడాలు సాగవు. నగర ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ అన్ని మతాలను గౌరవిస్తుంది. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం సరికాదు. -
ఓల్డ్ సిటీ సంగతేంటి?: అక్బరుద్దీన్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ అద్భుతంగా పురోగమిస్తోందని, హైటెక్ సిటీ ప్రాంతం గత 20 ఏళ్లలో ఎంతో పురోగమించి ఇప్పుడు భారతదేశ న్యూయార్క్‌గా గుర్తింపు పొందిందని మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ పేర్కొన్నారు. కానీ 400 ఏళ్ల చరిత్ర ఉన్న పాతనగరం అదే దుస్థితిలో ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిం చాల్సి ఉందని, పాత నగరానికి ఐటీ సెంటర్ రావాలని డిమాండ్ చేశారు. పలు దఫాలుగా చెప్పినట్టుగా సీఎం హామీల అమలు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై బుధవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రం స్పీకర్‌గా ఉండగా, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు ప్రారంభమైందని, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతనగరంలోని అద్భుత నిర్మాణా లు దెబ్బతింటున్నాయని, వాటిని పరిరక్షించే చర్యలు మాత్రం లేవన్నారు. ముర్గీ చౌక్ సమీపంలో అతిపురాతన భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నా హెరిటేజ్ పేరుతో దాన్ని తొలగించటం లేదని, దాన్ని కూల్చి అక్కడ మార్కెట్ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. పాతనగరంలో పార్కింగ్ టవర్లను పూర్తి చేయాలని కోరారు. నవ యవ్వనంలో అసెంబ్లీలో అడుగుపెట్టిన నువ్వు జుట్టు నెరిసి వృద్ధుడివి అవుతున్నావు తప్ప పాతబస్తీ అభివృద్ధి చెందటం లేదని ప్రజలు తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది తన వల్లేనని, దీన్ని చాలెంజ్ చేసి చెప్తానని పేర్కొన్నారు. నా మాటల్లో తప్పుందని తేలితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. పీజేఆర్ మోనో రైల్ కోసం, తాను మెట్రో కోసం పోటీ పడగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఢిల్లీకి పంపి మెట్రో రైలు ప్రాజెక్టు పరిశీలించి రమ్మన్నారని, ఆ తర్వాతనే నగరానికి మెట్రో వచ్చిందని, కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాతబస్తీకి మాత్రం మెట్రో యోగం లేదా అని ప్రశ్నించారు. కృష్ణా ఫేజ్–2 పాతనగరం కోసం ఏర్పాటైందని, కానీ కొత్త నగరంలో అమలవుతున్నట్టు పాతనగరానికి రోజువిడిచి రోజు నీళ్లు రావటం లేదన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినట్టుగానే, నీటి విషయంలో పాతబస్తీకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాలుగు వేల ఎకరాల వైశాల్యంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను ఇప్పుడు వేయి ఎకరాలకే పరిమితం చేశారని, లుంబినీపార్కు, నెక్లెస్‌రోడ్డు, ఫుడ్‌కోర్టులకు ఎవరు అనుమతిచ్చారని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. -
పాతబస్తీలో ప్రారంభమైన బీబీ కా ఆలం ఊరేగింపు
సాక్షి, హైదరాబాద్: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం పాతబస్తీలో ప్రసిద్ధ బీబీ కా ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఊరేగింపునకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోవిడ్ ఆంక్షలతో ఏనుగుపై కాకుండా డీసీఎం వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. యాకత్పురా, చార్మినార్ గుల్జార్‌హౌస్, మీరాల మండి, దారుల్షిఫా మీదుగా చాదర్‌ఘాట్ వరకు ఆలం ఊరేగింపు జరిగింది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కవాడిగూడ, గాంధీ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, రాంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిలల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ ప్రాంతాలతో పోల్చితే పాతబస్తీలో భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి పురాతన కట్టడం చౌమల్లా ప్యాలెస్ పాక్షికంగా దెబ్బతింది. రోడ్డు వైపు ఉన్న ప్యాలస్ ప్రహారీ గోడ కూలీపోయింది. దీనివల్ల అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయ ఏర్పడింది. -
పాతబస్తీ దిగ్బంధం.. వీధులన్నీ నిర్మానుష్యం
సాక్షి, చార్మినార్: పాతబస్తీ వీధులన్నీ దిగ్బంధనమయ్యాయి. ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. బయటికి వెళ్లకుండా కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా మార్చడంతో జనసంచారం తగ్గింది. ప్రధాన రహదారులతో పాటు గల్లీలన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొన్నటిదాకా ప్రజల సంచారం ఎక్కువగా కనిపించింది. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ జనాలతో కొన్ని కొన్ని వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ చారి్మనార్ జోన్ పరిధిలోని 6, 7, 8 సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసిన అధికారులు.. శనివారం 9,10 సర్కిళ్లల్లోనూ కొత్తగా కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. బారికేడ్ల వద్ద నోడల్ అధికారులను నియమించారు. ఫోన్ సమాచారం ద్వారా నిత్యావసరాలను అందజేస్తున్నారు. బస్తీవాసులు బయటికి రాకుండా.. బయటివాళ్లు లోనికి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బారికేడ్ల వద్ద ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. లాల్‌దర్వాజా వద్ద రేషన్ బియ్యం తీసుకెళ్తున్న చిన్నారులు మూత పడిన మీరాలంమండీ.. మీరాలమండీలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఎలాంటి నిత్యావసర వస్తువులను విక్రయించడం లేదు. మూకుమ్మడిగా దుకాణాల మూసివేతతో ఇక్కడి వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తుండడంతో ఇక్కడి వీధులన్నీ మొన్నటివరకు రద్దీ ఉండేవి. దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా వినియోగదారులు చేరడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సంబందిత పోలీసులు కట్టడి చేసే ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇక్కడి వ్యాపారులను మీర్‌చౌక్ పోలీసులు వీరికి అవగాహన కలి్పంచారు. సామాజిక దూరం పాటించకపోతే కేసులు పెడతామని హెచ్చరించడంతో వ్యాపారులు మూకుమ్మడిగా తమ దుకాణాలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. తమకు పోలీసులు తగిన బందోబస్తు కల్పించి వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటే దుకాణాలను తెరచి నిత్యావసర వస్తువులను విక్రయిస్తామని మీరాలంమండీ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాజుల అంజయ్య తెలిపారు. పాతబస్తీలో కట్టడి ఇలా.. చార్మినార్ సర్కిల్– 9లో శనివారం కొత్తగా మాతాకీకిడికీ, ఫతేదర్వాజా, నూర్ఖాన్ బజార్ తదితర బస్తీలను దిగ్బంధనం చేశారు ఫలక్‌నుమా సర్కిల్– 10లో రోషన్కాలనీ, మహమూద్‌నగర్, అలీబాగ్ బస్తీలను కొత్తగా కంటైన్మెంట్ క్లస్టర్‌గా గుర్తించారు మలక్‌పేట్ సర్కిల్– 6 పరిధిలోని అక్బర్‌బాగ్ డివిజన్లో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బీ బ్లాక్ కాలనీ, ఆస్మాన్‌గఢ్, తిరుమల హిల్స్, ఆనంద్‌నగర్, వాకర్బాగ్, జీవన్ యార్ జంగ్ కాలనీ, ఎల్ఐసీ కాలనీ, సపోటా బాగ్, పూసలబస్తీ ప్రజలను కట్టడి చేస్తున్నారు చావునీ డివిజన్లో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సుల్తాన్దయారా, గుడ్డిబౌలి, బాగ్‌హే జహేరా, కుర్మగూడ కాలనీ ప్రాంతాలను కట్టడి చేశారు ఆజంపురా డివిజన్లో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆఫీసర్స్ కాలనీ, జడ్జెస్ కాలనీ, చంచల్‌గూడ, బాగ్‌హే జహేరా ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో ఒక పాజిటివ్ కేసుతో పాటు మర్కజ్‌కు వెళ్లొచ్చిన 46 మంది ఉండటంతో శంకర్‌నగర్, సరోజినీనగర్, పద్మానగర్, పంచశీల, మసీద్–ఇ–సాద్ బస్తీలను దిగ్బంధించారు సంతోష్‌నగర్ సర్కిల్–7 పరిధిలోని డబీర్‌పురా డివిజన్లో ఒక పాజిటివ్ కేసుతో పాటు మూడు అనుమానిత కేసులుండటంతో బెన్నీసాబ్కా బగ్లా, అలీ కేఫ్, గ్రేవియార్డ్, రోషన్‌దౌలా, జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హల్ ప్రాంతాల్లో ప్రజలను కట్టడి చేస్తున్నారు కుర్మగూడ డివిజన్లో రెండు పాజిటివ్ కేసులతో పాటు ఏడుగురు మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు ఉండటంతో దరాబ్‌జంగ్ కాలనీ, మస్కతీ గ్రౌండ్, సాలార్‌నగర్ దిగ్బంధించారు రెయిన్‌బజార్ డివిజన్ పరిధిలో ఒక పాజిటివ్ కేసుతో పాటు 14 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు ఉండటంతో ఇస్లామియా కాలేజీ, ఎస్సార్టీ కాలనీ, రెయిన్‌బజార్ చమాన్, మదీనానగర్, యశ్రఫ్‌నగర్, ఈస్ట్ చంద్రానగర్ ప్రాంతాలను కట్టడి చేసి.. ఆయా బస్తీల ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. కంటైన్మెంట్లో కంటిన్యూ సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు గుర్తించి ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్ల పరిధిలో శనివారం కూడా గస్తీ కొనసాగింది. పోలీస్, వైద్య, జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయక చర్యలో నిమగ్నమైంది. పోలీ సు లు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టగా, జీహెచ్ఎంసీ సిబ్బంది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో రసాయనాల స్ప్రే చేశారు. వైద్య సిబ్బంది కూడా ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఓల్డ్‌మలక్‌పేట్ కాలనీలో రసాయనాలు చల్లుతున్న సిబ్బంది ఫిలింనగర్ టోలిచౌకి సమీపంలోని హకీంపేటలో రాకపోకలు పూర్తిగా నిషేధించారు అక్కడ ఫ్లెక్సీలు, బారికేడ్లు, పికెట్ ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించి 24 గంటలు గడవకముందే హస్మత్‌పేటలో జనం బయటకు వచ్చి రాకపోకలు సాగించారు. పోలీసులు అమలు చేస్తున్న ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోలేదు. మలక్‌పేట పరిధిలోని వాదే ముస్తఫా, షాహిన్‌నగర్, మిలాన్ కాలనీ, కొత్తపేట, ఓల్డ్ మలక్‌పేట, శంకర్‌నగర్, వాహెద్‌నగర్, కాలాడేరా, రేస్‌కోర్స్ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ బయటకు రాకుండా చేశారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారుల సమన్వయంతో నిత్యావసర సరుకులు అందచేశారు. బాలాçపూర్, మలక్పేట్ల పరిధిలోని కాలనీల్లోని ప్రతీ ఇంటి ముందు జీహెచ్ఎంసీ సిబ్బంది రసాయనాలు స్ప్రే చేశారు. జలమండలి అధికారులు మంచినీటి సమస్య రాకుండా చూశారు. మోండాడివిజన్ మారేడుపల్లి టీచర్స్ కాలనీలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. వైద్య సిబ్బంది ఇళ్లల్లో సర్వే చేపట్టింది. చిలకలగూడ ఠాణా పరిధిలో బౌద్ధనగర్, కౌసర్మసీదు, శ్రీనివాసనగర్‌లలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బారికేడ్లు, ఇనుపజాలీలతో రాకపోకలను నిషేధించి ఆయా ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. జీహెచ్ఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఆర్ అండ్ బీ తదితర విభాగాలను సమన్వయం చేస్తు కంటైన్మెంట్ క్లస్టర్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టారు. అక్కడి నివాసితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయా ఇళ్ల వద్దకే కూరగాయలు, నిత్యావసరాలను సరఫరా చేశారు. షేక్‌పేట్ డివిజన్లో కంటైన్మెంట్ జోన్లలో బల్దియా సెంట్రల్‌జోన్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య పర్యటించారు. నిత్యావసర సరుకుల కోసం ఈజోన్ల పరిధిలో కుటుంబానికి ఒక్కరికే బయటికి వెళ్లే అనుమతి ఉందన్నారు. కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించిన హస్మత్‌పేట ప్రధాన రహదారిలో రాకపోకలు ఇలా -
పాతబస్తీలో ప్రైవేట్ ‘జూ’లు!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో జూ ఎక్కడ? అంటే.. బహదూర్‌పురాలో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్కు అని ఠక్కున చెబుతారు. అయితే, ఇప్పటి వరకు రికార్డుల్లోకి ఎక్కకుండా, గుట్టచప్పుడు కాకుండా పాతబస్తీలో ‘ప్రైవేట్ జూ’లు కూడా నడుస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో ఏడు వన్యప్రాణులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకోవడమే దీనికి నిదర్శనం. జనాల్లో ఉన్న మూఢ నమ్మకాలు, ఫ్యాషన్, మాంసానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ జూలు ఇలా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వరుసగా చిక్కుతున్న జంతువులు ఈ వన్యప్రాణుల దందా పాతబస్తీ కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. శివారు జిల్లాలు, పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ జంతువుల్ని అక్రమంగా తీసుకువస్తున్నారు. అక్కడి వేటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అక్రమ వ్యాపారులు వీటిని సమీకరిస్తున్నారు. ఆపై బోనుల్లో బంధించి రోడ్డు మార్గంలో తీసుకొస్తున్నారు. రహదారుల్లో ఉంటున్న చెక్‌పోస్టులు, అటవీ శాఖ తనిఖీ కేంద్రాలనూ వీరు దాటి వచ్చేస్తున్నారంటే మామూళ్ల మత్తులో ఆ సిబ్బంది పరోక్షంగా సహకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత తమ ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, దుకాణాల్లో ఈ జంతువుల్ని కొంతకాలం పెంచి ఆపై అసలు ‘పని’ ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మూడే ప్రధాన కారణాలు ఇతర ప్రాంతాల నుంచి సిటీకి గుట్టుగా, వ్యవస్తీకృతంగా ఈ వన్యప్రాణుల అక్రమ దందా సాగడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పాతబస్తీకి చెందిన వారి కుటుంబీకులు అనేక మంది దుబాయ్ వంటి దేశాల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వారు తరచు అక్కడకు వెళ్లి వస్తుంటారు. ఆయా దేశాల్లో పులులతో సహా కొన్ని వన్యప్రాణుల్ని ఇళ్లల్లో పెంచుకోవడం సరదా. అక్కడిలాగే ఇక్కడా వన్యప్రాణులను పెంచాలని కొందరు ప్రయతి్నస్తున్నారు. మరికొందరికి ఈ తరహా వన్యప్రాణుల్ని పెంచుకుంటే, సజీవంగా పాతిపెడితే, నిరీ్ణత రోజుల్లో బలి ఇస్తే అదృష్టం వరిస్తుందనే మూఢనమ్మకం ఉంది. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వీటితో పాటు కొన్ని జంతువుల మాంసానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో వన్యప్రాణుల అక్రమ రవాణా య«థేచ్ఛగా సాగుతోందని పోలీసులు వివరిస్తున్నారు. ‘అంతర్జాతీయ’ ప్రమేయంపై అనుమానాలు వన్యప్రాణుల అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ ముఠాల ప్రమేయం సైతం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా తీసుకెళ్లిన వన్యప్రాణుల్లో నక్షత్ర తాబేళ్లు వంటి వాటిని పాతబస్తీతో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌ల్లో కొంతకాలం ఉంచుతున్నారని, ఆపై బయటి దేశాలకు తరలించేస్తున్నారని భావిస్తున్నారు. ఈ కోణంలో అటవీ, కస్టమ్స్ అధికారులతో కలిసి ఆరా తీయాలని నిర్ణయించారు. ఈ దందా చేస్తున్న వాళ్లంతా ఏళ్లుగా పక్షులు, కుందేళ్లను విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు, వేటగాళ్లు, ఇతర వ్యాపారులతో ఏర్పడిన పరిచయాల నేపథ్యంలో వీరంతా వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలోకి దిగారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు నిఘా ముమ్మరం చేయడంతో పాటు అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేయాలని నిర్ణయించారు. స్మగ్లింగ్‌కు ఉదాహరణలు.. పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ సహా ఐదుగురు నగరవాసులు అరుదైన కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన పిల్లులు ఐదింటిని బీహార్ అడవుల్లో పట్టుకున్నారు. వీటిని కారులో ప్రత్యేకంగా రూపొందించిన బోనుల్లో సిటీకి తీసుకువస్తూ 2017 జనవరిలో మీర్జాపూర్ ప్రాంతంలో అక్కడి అటవీ శాఖ అధికారులకు దొరికారు. పాతబస్తీలోని బార్కస్‌కు చెందిన అన్నదమ్ములు సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్, అలీ బిన్ మహ్మద్ బదామ్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే నాలుగు స్లోలోరిస్‌లు, ఓ స్టార్ తాబేలు, మరో మొత్తడి డొప్ప తాబేలును విక్రయానికి ప్రయతి్నంచారు. ఓ నిందితుడిని ఈ నెల 17న దక్షిణ మండల టాస్‌్కఫోర్స్ పట్టుకుంది. వనసర్తి జిల్లా పెబ్చేర్‌లోని కృష్ణా నది ఒడ్డున పట్టుకున్న కృష్ణ జంకను బహ దూర్‌పురాలోని కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అన్వర్ అలీ, మహ్మద్ జావేద్ సిటీకి తీసుకొచ్చారు. కేజీ రూ.3 వేల చొప్పున దీని మాంసం విక్రయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ వీరికి చెక్ చెప్పింది. -
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య
-
రాకేష్ అనే వ్యక్తిని హత్య చేసిన ప్రత్యర్ధులు
-
పాతబస్తీలో దారుణం: కత్తిపోట్లకు దారితీసిన వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకుల మధ్య మొదలైన వాగ్వాదం వారిలో ఒకరి మృతికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ కాలా పత్తార్ పరిధిలోని ఓ గుర్రపు శాల వద్ద మహ్మద్ అమీర్, సలీం మొసిన్ల మధ్య జరిగిన గొడవ కత్తి పోట్లకు దారితీసింది. అమీర్, మొసిన్పై కత్తితో దాడి చేయడంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే మొసిన్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మొసిన్ మృతి చెందారు. విషయం తెలుసకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
పాతబస్తీలో అగ్నిప్రమాదం
-
భార్య దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు
-
పోలీసుల అదుపులో 70మంది యువకులు
హైదరాబాద్: పాతబస్తీలోని 9 చోట్ల ఆదివారం తెల్లవారుజామున దక్షిణ మండల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగరంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతుండటంతో.. వారిని అదుపులోకి తీసుకురావడానికి ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డన్ సెర్చ్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 70 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు, ఒక టాటాసుమో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అనుమానాస్పద యువకులతో పాటు, రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.