సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. దుబాయ్‌లో మహిళకు పని కల్పిస్తామని చెప్పి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఒక్కో మహిళను రూ.2 లక్షలకు దుబాయ్‌కి చెందిన షేక్‌లకు బస్తీలోని బ్రోకర్లు అమ్ముతున్నారు. విజిటింగ్ వీసాలపై మహిళలను అక్కడక పంపిస్తూ విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని బ్రోకర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమవారి కోసం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ట్రిపుల్ తలాక్
పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి ఫోన్‌లో తన భార్యకు అదివలీ అనే వ్యక్తి తలాక్ చెప్పాడని బాధితురాలు సభా ఫాతిమా తెలిపారు. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను వలి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఫాతిమా భర్త అమెరికాలో ఉంటున్నాడు. తన భర్త వలి అమెరికా నుంచి ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చేప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆమె గురువారం ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment