Women Trafficking
-
బస్సుల్లో మహిళల రద్దీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడాయి. ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించడంపై చాలా మంది మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. శాసనసభ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన వెంటనే.. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. బస్సుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉన్నందున.. కిక్కిరిసి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు ముందే ఊహించారు. కీలక ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సమీక్షించారు. అవసరమైతే అదనపు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో రద్దీపై స్పష్టత ఉండదని.. సోమవారం నుంచి ఉచిత ప్రయాణ ప్రభావం ఎంతనేది తెలుస్తుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పాయింట్ల వద్ద సోమవారం అదనపు సిబ్బందిని పెట్టి బస్సులను, రద్దీని పర్యవేక్షించనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను గుర్తించి.. అంతగా రద్దీ లేని రూట్ల నుంచి వాటివైపు బస్సులను మళ్లించాలని భావిస్తున్నారు. గుర్తింపు కార్డులు అడగకుండానే.. ఉచిత ప్రయాణ పథకం కేవలం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఉచితంగా ప్రయాణించాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవారని ధ్రువపరిచే గుర్తింపు పత్రాలను కండక్టర్లకు చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఒక వారం రోజుల పాటు అలాంటి పత్రాల కోసం పట్టుబట్ట వద్దని, మహిళలందరినీ అనుమతించాలని ఆదేశించారు. దీంతో తొలిరోజున ఎక్కడా గుర్తింపు కార్డులు అడగలేదు. అయితే ఎందరు ప్రయాణికులు, ఎంతెంత దూరం చొప్పున ప్రయాణించారన్న వివరాలను కండక్టర్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేసుకున్నారు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి స్మార్ట్ కార్డులు జారీ చేసేవరకు జీరో టికెట్లు జారీ చేయాల్సి ఉండనుంది. జీరో టికెట్‌కు సంబంధించి టిమ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయాల్సి ఉంది. ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సులపై ప్రభావం! ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సుల్లో వెళ్లేవారు ఆర్టీసీ బస్సులవైపు మళ్లారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిలోనూ కొందరు బస్సులెక్కారు. ఈ పథకం ఆటోలు, క్యాబ్‌లు, సెట్విన్ బస్సులపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ద్విచక్ర వాహనాల వినియోగం తగ్గితే కొంతమేర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయలూ వస్తున్నాయి. మరోవైపు ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరుగుతున్నందున.. వీలైనంత తొందరలో కొత్త బస్సులను సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్త బస్సులు రోడ్డెక్కితే.. ఆర్టీసీ సర్విసులు పెరిగి ప్రైవేటు వాహనాల రద్దీ కొంత తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ఆడ శిశువుల్ని సాకి.. వ్యభిచార రొంపిలోకి దింపి
యాదగిరిగుట్ట: బాలికలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ చాలా ఏళ్ల క్రితం ఇద్దరు ఆడ శిశువులను కొనుగోలు చేసి యుక్త వయస్సు వచ్చే వరకు పెంచి పోషించింది. సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ఉన్న కంసాని శ్రీనివాస్ వద్దకు బాలికలను పంపించింది. శ్రీనివాస్ అక్కడ ఆ బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుండేవాడు. అదే క్రమంలో యాదగిరిపల్లికి కూడా పంపిస్తుండేవాడు. వ్యభిచారం చేయించేందుకు అనసూయ వారిని కొడుతూ ఉండేది. అనసూయ, శ్రీనివాస్‌కు మరికొంతమంది సహకరించేవారు. తప్పించుకుపోయి.. పోలీసుల కంటపడి.. అనసూయ చిత్రహింసలకు తట్టుకోలేక ఇద్దరిలో ఓ బాలిక ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. జనగామ జిల్లా బస్టాండ్‌లో తిరుగుతూ పోలీసుల కంట పడింది. వారి విచారణలో యాదగిరిపల్లికి చెందిన అనసూయ, తంగళపల్లికి చెందిన శ్రీనివాస్ వ్యభిచారం చేయిస్తున్న విషయం వెలుగు చూసింది. దీంతో అక్కడి పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులుతో పాటు ఇక్కడి పోలీసులకు సమాచారం అందజేశారు. మెరుపుదాడి చేసి.. ఈ నెల 3న సైదులు ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట పోలీసులు, షీటీమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు కలిసి యాదగిరిపల్లిలోని కంసాని అనసూయ ఇంటిపై దాడి చేశారు. అనసూయను అదుపులోకి తీసుకుని విచారించగా సెక్స్ రాకెట్ డొంక కదిలింది. ఆమె ఇచ్చిన సమాచారంతో తంగళపల్లికి చెందిన కంసాని శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చంద భాస్కర్, చంద కార్తీక్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని టీచర్ కాలనీకి చెందిన కంసాని లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిపల్లికి చెందిన కంసాని ప్రవీణ్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. దాడుల్లో పాల్గొన్న డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, టౌన్ సీఐ సైదయ్య, యాదగిరిగుట్ట పోలీసు బృందానికి సీపీ మహేష్ భగవత్ అభినందనలు తెలిపారు. -
దారుణం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలను తీసుకెళ్లి..
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలను లైంగికంగా వేధించడం, దాడులు చేయడం వంటివి మాత్రం ఆగడం లేదు. తాజాగా మహిళలను ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి చేత అశ్లీల నృత్యాలు చేయాలని బలవంతం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జబల్‌పుర్‌కు చెందిన సన్నీ సొంధియా, నిధీ సొంధియా దంపతులు, దర్భంగాకు చెందిన పింటూ కుమార్ ఠాకుర్‌లతో కూడిన ముఠా ఉద్యోగాల పేరుతో మహిళలను వేధింపులకు గురిచేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలు, యువతులను నమ్మించి వారిని వివిధ ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తూ.. పెళ్లి వేడుకల్లో వారి చేత బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించేవారు. ఇదిలా ఉండగా.. ఉద్యోగాల పేరుతో కొందరు మహిళలను ఈనెల 11వ తేదీన ఈ ముఠా జబల్పూర్కు తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీహార్ పోలీసుల సాయంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మోతీహరీ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నలుగురు మహిళలను రక్షించారు. -
‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’
Parents Must Teach Good Values To Children, Know Why బీహార్: తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇళ్లు వదిలి వెళ్లి వివాహాలు చేసుకుంటున్న యువతుల్లో చాలా మంది హత్యకు గురౌతున్నారు. మరి కొందరు బలవంతంగా అక్రమ రవాణాకు బలి అవుతున్నారని బీహార్ డీజీపీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మాటల్లో.. ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన ఉదంతాలు మనం ఎన్నో చూశాం. ఐతే వారిలో చాలా మంది హత్యకు గురవుతున్నారు. మరికొందరు బలవంతంగా అమ్మకానికి గురవుతున్నారు. ఇలాంటి నిర్ణయాలకు మూల్యం చెల్లించేది తల్లిదండ్రులేనని’ బీహార్ డీజీపీ ఎస్కే సింఘాల్ సమస్తిపూర్‌లో నిర్వహించిన సమాజ్ సుందర్ అభియాన్ కార్యక్రమంలో అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ సంభాషిస్తూ ఉండాలి, మంచి విలువలు నేర్పించాలని, వారి భావాలను గుర్తించి అర్థమయ్యేలా వివరించి, కుటుంబ బంధాల్లో వారిని బంధించాలని ఈ సందర్భంగా సూచించారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివృద్ధి చేస్తున్న సామాజిక సంస్కరణ ప్రచారం (సమాజ్ సుధార్ అభియాన్)లో డీజీపీ సింఘాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ #WATCH We've seen cases where girls left their homes for marriage without parents' consent. Many of them get killed while others are forced into the flesh trade. It is parents who pay price for such decisions: Bihar DGP SK Singhal at 'Samaj Sudhar Abhiyan' event in Samastipur pic.twitter.com/wai9jNrnG1 — ANI (@ANI) December 30, 2021 -
పాతబస్తీలో యువతి విక్రయం
సాక్షి, చాంద్రాయణగుట్ట: దుబాయిలో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ దళారి చాంద్రాయణగుట్టకు చెందిన యువతిని సుడాన్ షేక్‌కు విక్రయించింది. దుబాయిలో నరకం అనుభవిస్తున్న ఆ యువతి ఎంతో కష్టపడి తన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసింది. దీంతో ఆ యువతిని భారత్‌కు రప్పించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ విదేశీ వ్యవహారాల శాఖకు ఈమెయిల్లో విన్నవించుకున్నారు. బండ్లగూడ గౌస్‌నగర్ హుందాహిల్స్‌కు చెందిన నర్సుగా పనిచేసేది. ఈ సమయంలో వట్టెపల్లికి చెందిన ఫాతిమా అనే మహిళకు ఆమె పరిచయమయ్యింది. షార్జాలోని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తే నెలకు రూ.40 వేలు వస్తాయని, అక్కడ తనకు తెలిసిన వారున్నారని నమ్మించి నూర్జహాన్ను గత డిసెంబర్ 15న షార్జాకు పంపించింది. అక్కడ ఆమెను అమ్మర్ అహ్మద్ ఉమర్ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మర్ ఇంట్లో గతంలో ఫాతిమాతో కలిసి ఉండే నజ్మీన్ అనే బాలికను నూర్జహాన్ చూసింది. మూడు నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ కింద నజ్మీన్‌ను పంపించినట్లు సదరు యువతికి తెలిసింది. అమ్మర్ తాను ఫాతిమాకు రూ.2 లక్షలు చెల్లించినట్టు ఆ యువతికి చెప్పాడు. ఫాతిమాకు అమ్మర్ ద్వారా ఫోన్ కాల్ రావడంతో ఆమె తల్లి వద్దకు వెళ్లి ఆమె ముందు రూ.2 లక్షలు పెట్టి వీడియో తీసి షేక్‌కు పంపించారు. అనంతరం డబ్బు తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఈ వీడియా చూసిన అనంతరం ఆ యువతి నాలుగు రోజులపాటు షేక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై తాను పడుతున్న నరకాన్ని వాట్సాప్ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు వెల్లడించింది. కాగా బాధిత కుటుంబం నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. -
పాతబస్తీలో వెలుగులోకొచ్చిన దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. దుబాయ్‌లో మహిళకు పని కల్పిస్తామని చెప్పి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఒక్కో మహిళను రూ.2 లక్షలకు దుబాయ్‌కి చెందిన షేక్‌లకు బస్తీలోని బ్రోకర్లు అమ్ముతున్నారు. విజిటింగ్ వీసాలపై మహిళలను అక్కడక పంపిస్తూ విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని బ్రోకర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమవారి కోసం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్ తలాక్ పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి ఫోన్లో తన భార్యకు అదివలీ అనే వ్యక్తి తలాక్ చెప్పాడని బాధితురాలు సభా ఫాతిమా తెలిపారు. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను వలి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఫాతిమా భర్త అమెరికాలో ఉంటున్నాడు. తన భర్త వలి అమెరికా నుంచి ఫోన్లో ట్రిపుల్ తలాక్ చేప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆమె గురువారం ఆశ్రయించారు. -
జ్యోత్స్న అను నేను..
నెహ్రూ నగర్ (గుంటూరు): ‘జ్యోత్స్న అను నేను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తాను. మహిళా చట్టాలపై వారికి అవగాహన కల్పిస్తాను. మహిళా కమిషన్ ద్వారా ఆడ పిల్లలకు, మహిళలకు ధైర్యం కల్పిస్తాను’ అని జాతీయ విలువిద్య క్రీడాకారిణి కె.జ్యోత్స్న అన్నారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లల హక్కులపై అవగాహన కల్పించేందుకు ‘పిల్లల కోసం.. పిల్లల యొక్క.. పిల్లల చేత’ అనే ఇతివృత్తంతో యునిసెఫ్, మహితా ఆర్గనైజేషన్, అలయన్స్ ఫర్ చిల్డ్రన్ రైట్స్, మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కిశోర బాలికలు శుక్రవారం ఒకరోజు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. బాలికలు కన్న కలల్ని నిజం చేయడానికి, వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించడానికి మహిళా కమిషన్ అన్నివిధాలుగా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో ఆడ పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని జాగృతులను చేస్తున్నట్టు చెప్పారు. అనాథ ఆశ్రమంలో ఉంటూ నైపుణ్యాలు పెంపొందించుకుంటున్న బాలికలకు ఒకరోజు చైర్పర్సన్, కమిషన్ సభ్యులుగా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించటం ఆనందాన్నిచ్చిందన్నారు. మహిళా కమిషన్ ఒకరోజు సభ్యులుగా నైని సుచరిత, కె.ఎస్తేరురాణి, ఎ.సిరివెన్నెల వ్యవహరించారు. -
బంగ్లాదేశ్ టు హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పేరుతో అమాయక యువతులను బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ అక్రమంగా తరలిస్తున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారం జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తొలుత 2019 సెప్టెంబర్‌లో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఉదంతం వెలుగుచూసింది. ఓ వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు తరువాత దీనితో సంబంధమున్న పది మందిని అరెస్టు చేశారు. జల్పల్లి, బాలాపూర్ తదితర ప్రాంతాల నుంచి పోలీసులు రక్షించిన యువతుల్లో బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారు. వీరిని ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా దేశం దాటించి తీసుకువచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి వద్ద భారతీయులుగా చలామణి అయ్యేందుకు ఉన్న నకిలీ ధ్రువపత్రాలు, ఐడెంటిటీ కార్డులతో పాటు ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ కేసు తరువాత ఎన్ఐఏకు బదిలీ అయింది. 1980 నుంచి ఇదే దందా.. ఈ కేసులో ఏ2గా ఉన్న రుహుల్ అమిన్ దాలిని 2019, డిసెంబర్ 12న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతను 1980లో అక్రమ మార్గాల్లో బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి తన భార్య బిత్తి బేగంతో కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో పలు వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నాడు. ఇందుకు కావాల్సిన యువతులను బంగ్లాదేశ్‌లోని తన ఏజెంట్ల ద్వారా భారత్‌కు రప్పిస్తున్నాడు. ముఖ్యంగా 19 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతులకు ఉపాధి ఎరవేసి భారత్‌కు తీసుకువస్తున్నారు. వీరికి అధికారిక వీసా రావడం కష్టం.. అందుకే అడ్డదారుల్లో తీసుకువస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. బెంగాల్‌లోని సోనాయ్ నది మార్గం గుండా తొలుత కోల్కతాలోకి తీసుకువస్తారు. అక్కడ నుంచి కోల్‌కతా, ముంబై, హైదరాబాద్‌లలోని వ్యభిచార గృహాలకు పంపిస్తున్నారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు అబ్దుల్ బారిక్ షేక్‌తో కలిసి భారత్ నుంచి యువతులను బంగ్లాదేశ్‌కు కూడా తరలించేవాడు. కాగా, అబ్దుల్ బారిక్ షేక్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇతడు బంగ్లాదేశ్‌కు పారిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన వారిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. పోలీసులు రక్షించిన బంగ్లాదేశీ యువతులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని షెల్టర్ హోంలలో ఆశ్రయం పొందుతున్నారు. నిందితులు వీరే.. యువతులను అక్రమంగా దేశ సరిహద్దులు దాటిస్తున్న వ్యవహారంలో మొత్తం 12 మందిని ఎన్ఐఏ నిందితులుగా గుర్తించింది. వీరిలో ప్రధాన సూత్రధారితో సహా పది మంది బంగ్లాదేశీయులు కాగా.. ఇద్దరు భారతీయులు. ఎన్ఐఏ చార్జిషీటు ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన 1.అబ్దుల్ బారిక్ షేక్, 2. రుహుల్ అమీన్ దాలి 4. మహమ్మద్ యూసుఫ్‌ఖాన్ , 5.బిత్తి బేగం, 6. మహమ్మద్ రానా హుస్సేన్ , 8. మహమ్మద్ అల్ మెమన్ 9. సోజిబ్ షేక్, 10. సురేశ్‌కుమార్ దాస్. 11. మహమ్మద్ అబ్దుల్లా మున్షి, 12.మహమ్మద్ అబ్దుల్ షేక్.. మహారాష్ట్రకు చెందిన 3. అసద్ హసన్ , 7.షరీఫుల్ షేక్‌లు నిందితులు. -
ఉద్యోగాల పేరుతో వ్యభిచారం
సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగాల పేరుతో ముంబయ్‌కి చెందిన మహిళలను నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను పట్టుకున్న పోలీసులు ఇద్దరు యువతులకు వ్యభిచారం నుంచి విముక్తి కల్పించారు. పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపినమేరకు..బిహార్ రాష్ట్రానికి చెందిన మిథిలేష్ శర్మ, రాజనీశ్ రాజన్‌లు గత కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహ్తిన్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళల అక్రమ రవాణాదారులతో సంబంధాలున్న వీరు అక్కడి నుంచి అమ్మాయిలను రప్పించేవారు. ఈ విధంగానే ముంబయ్ సమీపంలోని పాల్ఘర్ జిల్లా నాలాసొపార పట్టణానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రప్పించారు. (వేశ్యావాటిక గుట్టురట్టు) ఆ తర్వాత బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారు. యాప్రాల్‌లోని రిజిస్ట్రేషన్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్‌ను అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు మొదలెట్టారు. మిథేశ్ శర్మ తన సహచర నిర్వాహకుడు రాజనీశ్ రాజన్‌తో కలిసి రహస్యంగా కస్టమర్లను రప్పించేవాడు.అలాగే ఆయా ఇళ్లకు వచ్చే కస్టమర్లకు తగిన ఆహరంతో పాటు వారి అవసరాలను తీర్చేందుకు సుచిత్రకు చెందిన కాంబ్లీ సుఖేష్‌ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే యథావిధిగా ఎప్పటిలాగానే మంగళవారం ఇద్దరు విటులు సాయికిరణ్, సిరాజ్‌లు యాప్రాల్‌కు వచ్చారు. ఆ అమ్మాయిలతో వీరిద్దరూ ఉన్న సమయంలో అప్పటికే విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజ్గిరి జోన్ ఎస్వోటీ పోలీసులు, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాజనీశ్ రంజన్, సుఖేష్ రావణ్ కాంబ్లీ, పి.సాయికిరణ్, ఎండీ సిరాజ్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను సంరక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మితిలేష్ శర్మ కోసం గాలిస్తున్నారు. -
యువతుల అక్రమ రవాణా: కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : విదేశీ యువతుల అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోని నగరాలకు యువతులను తరలిస్తున్న కేసులో ప్రధాని నిందితుడైన హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ సలాంను ఎన్ఐఏ శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే నిందితుడి నుంచి ఇద్దరు యువతులను ఎన్ఐఏ కాపాడింది. కేసు విచారణలో భాగంగా కీలక డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని వివరాలను కోసం దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఇదే కేసులో పలువురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ నెట్‌వర్క్‌తో యువతులను దేశ సరిహద్దులు అక్రమంగా దాటిస్తున్న ముఠాను ఎన్ఐఏ గుర్తించి.. కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ ముఠా ఇప్పటికే ఎంతో మంది యువతులను తరలించిందని, వారి వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని ఎన్ఐఏ తెలిపింది. -
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..
సాక్షి, అదిలాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తానని మహిళకు మాయ మాటలు చెప్పి.. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్మేసిన ఘటన కోమరం భీం జిల్లాలో చోటు చేసుకుంది. తిర్యాణి మండలం కొలం తెగకు చెందిన మతిస్థిమితం లేని గిరిజన మహిళను సమీప బంధువుతోపాటు ఓ వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకొని మధ్యప్రదేశ్‌లోని మండ్పుర్ జిల్లాలోని ఓ వ్యక్తికి అమ్మేశారు. కూతురు కనబడటం లేదని మహిళ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో, తన కూతురు ఎక్కడికి వెళ్లలేదని తండ్రిని మభ్యపెట్టారు. మహిళను మధ్యప్రదేశ్‌లో ఇంటి పనులకు వాడుకోవడమే కాకుండా.. శారీరకంగా నరకం చూపించడంతో తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అనంతరం కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది. డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా అక్రమ రవాణాకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేశామని, నిందుతులకు శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. గిరిజన మహిళలు ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!
సాక్షి, ఆసిఫాబాద్: అమాయక గిరిజన మహిళలను ఉపాధి పేరుతో కొంత మంది దళారులు ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు. ఆర్థికంగా నిరుపేదలైన వారిని అమ్మాయిల కొరత ఉన్న రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. తాజాగా తిర్యాణి మండలానికి చెందిన ఓ వివాహితను ఉపాధి పేరుతో మధ్యప్రదేశ్‌కు రూ. 1.30 లక్షలకు విక్రయించారు. గత జూలైలో తన కూతురు కనిపించడం లేదని ఆ మహిళ తండ్రి తిర్యాణి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మహిళా విక్రయం వెలుగులోకి వచ్చింది. దళారుల చేతిలో మోసపోయి ప్రాంతం కానీ ప్రాుతంలో ఇతరుల చేతిలో చిక్కిన ఆ మహిళ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు అంతా చెప్పడంతో మరిన్ని విషయాలు తెలిశాయి. దీంతో జిల్లాలో మానవ అక్రమ రవాణా బయటకు తెలిసింది. తిర్యాణి మండలం మారుమూల గిరిజన గూడెం కొలం తెగకు చెందిన ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్తకు పెళ్లి అయిన రెండేళ్లకే మతి స్థిమితం కోల్పోవడంతో గత కొన్నాళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఇది గమనించిన బాధితురాలు సమీప బంధువు తిర్యాణి మండలం చాపిడికి చెందిన ఓ మహిళ, రెబ్బెన మండలం ఇందిరా నగర్‌కు చెందిన వ్యక్తి, ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మరో వ్యక్తి కలసి బాధితురాలకి మాయ మాటలతో ఉద్యోగం ఇప్పిస్తామని ఇతర ప్రాంతానికి అమ్మేసేందుకు ప్రణాళిక వేశారు. ఈ ముగ్గురు కలసి బాధితురాలి ఇంటికి గత నెల 1న రాత్రి వెళ్లి ఉద్యోగం పెట్టిస్తామని ఈ రాత్రే బయలు దేరి రావాలంటు ఆమె తండ్రికి చెప్పి ఒప్పించారు. అదే రాత్రి ఇంటి నుంచి తీసుకొచ్చి ఆసిఫాబాద్‌లోని పోలీసు కానిస్టేబుల్ ఇంట్లో ఉంచారు. ఆ మర్నాడు కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ వెళ్లే ట్రైన్ ఎక్కించారు. దాదాపు రెండు రోజుల రైలు ప్రయాణం తర్వాత బాధితురాలు మధ్యప్రదేశ్‌లోని మంద్‌సూద్ జిల్లా గరవాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లారు. మధ్యవర్తిగా మరో వ్యక్తి బాధితురాలిని జిల్లా దాటించడంలో ఈ ముగ్గురికి తోడ్పాడ్డాడు. ఇందుకు ఆ మధ్యవర్తికి రూ.10 వేలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.1.30లక్షలకు అమ్మకం మధ్యప్రదేశ్‌లో గరవాద్‌కు చెందిన రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బాధితురాలిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఇంటి పనులు చేయిస్తూ నరకం చూపించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి తండ్రి తన కూతురు కనిపించడం లేదని తన ఇంటికి వచ్చి తీసుకెళ్లిన వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కొంత కాలం పాటు ఆయనకు ఆదిలాబాద్‌లో ఉన్నట్లు అబద్దం చెబుతూ కానిస్టేబుల్ నమ్మించసాగాడు. మరో వైపు మధ్యప్రదేశ్‌లో ఉన్న బాధితురాలు కనీసం ఫోన్ చేసేందుకు తన వారిని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో అతి కష్టం మీద తప్పించుకుని తిరిగి వచ్చింది. బాధితురాలు ఆ వ్యక్తిని గట్టిగా నిలదీయడంతో తనను రూ.1.30 లక్షలు కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో ఎలాగైనా అతని బారి నుంచి తప్పించుకోవాలని చూసిన ఆమె ఎట్టకేలకు ఇంటికి చేరి పోలీసులకు విషయాలన్ని తెలిపింది. ప్రస్తుతం ఓ మహిళ, ఇద్దరు నిందితులను పోలీసులు అదపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చగా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. రిమాండ్‌లో ఉన్న ముగ్గురు వ్య క్తులకు సహకరించిన మధ్యవర్తి కోసం పోలీ సులు గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన వ్యక్తి సైతం మహిళను కొనుగోలు చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాపింగ్, రేప్, మానవ అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. మహిళలు లేక మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో మహిళా లింగ నిష్పత్తి మగ వారితో పోలిస్తే తక్కువగా ఉండడంతో అనేక మందికి యువకులకు వివాహాలు కావడం లేదు. దీంతో ఎలాగైనా మహిళలను తీసుకొచ్చి తమ ఇళ్లలో పెట్టుకో వాలని శారీరకంగా వాడుకోవడంతో పాటు తమ వంశం వారసులను కని పెంచుకునేందుకు అమాయక గిరిజన మహిళలను పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మూడేళ్ల క్రితం కెరమెరి మండలంలో మానవ అక్రమ రవాణా సంబంధించి రెండు కేసులు నమోదైయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. కఠిన శిక్షపడేలా చూస్తాం.. మహిళలకు మాయ మాటలు చెప్పి మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాం. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు. తప్పు చేసిన వారందరికి కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. గిరిజన మహిళలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. –సత్యనారాయణ, డీఎస్పీ, ఆసిఫాబాద్ ( కేసు విచారణ అధికారి) -
ఉద్యోగాల పేరుతో వల
కర్నూలు, నంద్యాల: ఉద్యోగాల పేరుతో యువతులు, బాలికలకు వల వేసి..మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ముఠా కబందహస్తాల్లో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు,వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు బాధితులు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నంద్యాలకు చెందిన ఓ బాలికను ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకెళ్లి..అక్కడ చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి వెళ్లి చెర నుంచి విడిపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని ఆటోనగర్‌కు చెందిన ఓ బాలికకు పట్టణానికే చెందిన సంధ్యా, మందిరా అనే మహిళలు పరిచయమయ్యారు. భువనేశ్వర్‌లోని గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని, మంచి వేతనం, కారు, బంగ్లా ఇస్తారని మాయమాటలు చెప్పారు. ముందుగా రూ.30 వేలు కట్టాలనడంతో సదరు బాలిక ఆ మొత్తం చెల్లించింది. తర్వాత భువనేశ్వర్‌కు తీసుకెళ్లి అక్కడ రోజులు గడుస్తున్నా ఏ ఉద్యోగమూ చూపలేదు. కంప్యూటర్ నేర్పిస్తామని చెబుతూ వచ్చారు. కొన్నిరోజుల తర్వాత స్నేహితులకు ఫోన్లు చేసి ఇక్కడ వేతనం బాగుందని చెప్పి..వారినీ రప్పించాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఈ విషయాన్ని సదరు బాలిక నంద్యాలలోని తల్లిదండ్రులకు ఫోన్లో తెలియజేసింది. బాలిక తల్లి జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలిసి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ షీటీంను భువనేశ్వర్‌కు పంపారు. బాలికను చెర నుంచి విడిపించి తీసుకొచ్చారు. ఇలాంటి బాధితులు అక్కడ చాలా మంది ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ చెప్పారు. సదరు కంపెనీపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
మహిళల అక్రమ రవాణా.. దంపతులపై పీడీ యాక్ట్
నాగోలు: మహిళలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ఇద్దరి నిందితులపై రాచకొండ పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్ బెంగాల్, కోల్‌కతా ప్రాంతానికి చెందిన బెనిడ్ వర్మా ఆలియాస్ షేక్ మిజాన్ (35) ఇతడి భార్య షేక్ నియాల్ఫా అలియాస్ లీలా(35) ఇద్దరు కలిసి నగరానికి వచ్చి నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చంద్రగిరి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంత కాలం వివిధ కంపెనీల్లో పనిచేసినా సరిపడా డబ్బులు రాచపోవడంతో వ్యభిచార దందాను నిర్వహించాలనుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి బాలికలను, మహిళలను నెల జీతం లెక్కన తీసుకువచ్చి నగరంలో వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వర్మను 2014లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. గత నెల 17న నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలు పట్టుబడ్డారు. దీంతో వీరిని నేరెడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలులో ఉన్న వీరిపై కమిషనర్ పీడీయాక్ట్ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
16 మంది మహిళలకు విముక్తి
న్యూఢిల్లీ : వుమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ముఠా చెర నుంచి 16 మంది మహిళలను ఢిల్లీ మహిళ కమిషన్(డీసీడబ్య్లూ) రక్షించింది. బుధవారం ఉదయం మునిర్క ప్రాంతంలో దాడులు చేపట్టిన కమిషన్ సభ్యులు.. ఒక గదిలో బంధించి ఉన్న మహిళలను గుర్తించారు. నేపాల్‌కు చెందిన మహిళలకు మాయ మాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకొచ్చారని డీసీడబ్య్లూ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. వారిని కొన్ని రోజుల్లోనే కువైట్, ఇరాక్‌లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమ విచారణలో తేలిందన్నారు. మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బాధితుల వద్ద నుంచి పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్న ముఠా సభ్యులు వారిని గదిలో బంధించారని తెలిపారు. ఈ రాకెట్ గత ఎనిమిది నెలలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. గత 15 రోజుల్లోనే ఈ ముఠా ఏడుగురు యువతులను కువైట్, ఇరాక్‌లకు అక్రమ రవాణా చేసిందని వెల్లడించారు. కేంద్రాన్ని నిలదీసిన కేజ్రీవాల్ ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్లు ఎక్కడున్నారంటూ చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు వారి ఆధ్వర్యంలోనే ఉన్నారని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై లేదా అని మండిపడ్డారు. -
యువతిని విక్రయించిన కేసులో ముగ్గురి అరెస్టు
చిట్టినగర్ (విజయవాడ వెస్ట్) : యువతి విక్రయించడంతో పాటు బలవంతంగా వ్యభిచారం చేయించిన కేసులో కొత్తపేట పోలీసులు శుక్రవారం గుంటూరుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన యువతిని వైఎస్సార్ కాలనీకి చెందిన శోభారాణికి విక్రయించిన కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. గుంటూరు ప్రకాష్‌నగర్‌కు చెందిన అన్నపురెడ్డి అంజిలి (29), ఆమె భర్త దుర్గాప్రసాద్ (32) తో పాటు సుమంత్ అనే యువకుడిని అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు అయ్యింది. -
‘డర్టీ డజన్’గ్యాంగ్ ...
► అక్కడికి వెళ్లాక అంగడి బొమ్మలవుతున్న మహిళలు ► షేక్‌ల సమక్షంలో వేలం పాటలు.. లైంగిక దాడులు ► వారికి ఎదురుతిరిగితే బెదిరింపులు ► వ్యభిచారంలోకి దింపి నరకం చూపుతున్న వైనం ► పురుషులతో వెట్టి చాకిరీ ► 12 మంది నిందితుల్లో ఏడుగురు అరబ్ దేశాల్లో తిష్ట ► ఐదుగురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు సాక్షి, హైదరాబాద్ : దుబాయ్‌లో జాబ్ అంటారు.. వేలల్లో జీతమని నమ్మబలుకుతారు.. మాయమాటలు చెప్పి లక్షల్లో గుంజుతారు.. తీరా వారి మాటల్ని నమ్మి వెళ్తే నరకకూపంలో దిగినట్టే! మహిళలు, యువతులు అరబ్ షేక్‌ల ముందు అంగడి బొమ్మలై ఏళ్లకేళ్లుగా వ్యభిచార కూపంలో మగ్గిపోతారు. పురుషులు బానిస సంకెళ్లలో బందీ అయిపోయి దేశంకాని దేశంలో నానా అగచాట్లు పడతారు. గత పదేళ్లుగా అమాయకులపై ఇలా వల విసిరి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు రట్టు చేశారు. గ్యాంగ్‌లోని ఐదుగురిని పట్టుకున్నారు. మరో ఏడుగురు దుబాయ్‌లో ఉండటంతో వారికోసం విదేశీ మంత్రిత్వ శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ‘డర్టీ డజన్’గ్యాంగ్ గడిచిన పదేళ్ల కాలంలో దాదాపు 100 మందిని అరబ్ దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ శుక్రవారం వెల్లడించారు. వీరిలో దాదాపు 30 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఠా నాయకుడు.. దుబాయ్ శ్రీను మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఈ ముఠా సూత్రధారి పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇతడు అమలాపురం నుంచి వెళ్లి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. ఈ దందా కోసం అక్కడా, ఇక్కడా మొత్తం 11 మంది దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రాంతానికే చెందిన మరియమ్మ, అల్ప శ్రీను, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్లతో పాటు కేరళకు చెందిన కరీంను శ్రీనుబాబు అరబ్ దేశాలకు పిలిచించుకున్నాడు. వీరిని దుబాయ్, మస్క ట్, కువైట్, ఖతార్ల్లో ఉంచి.. ఆయా చోట్ల మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలతో సంబంధాలు ఏర్పాటు చేశాడు. ఈ ఏడుగురికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన యు.త్రిమూర్తులు, ఎం.తాతాజీ, పి.దాసు, జి.రామారావు (మరియమ్మ భర్త), ఎస్.మురళి సహకరిస్తున్నారు. వీరంతా తమ చుట్టుపక్కల ప్రాంతా ల్లో చిన్న చిన్న పనులు చేస్తున్న వారిలో అరబ్ దేశాలకు వెళ్లాలన్న ఆసక్తి ఉన్న వారిని గుర్తిస్తారు. వారి వివరాలను దుబాయ్ శ్రీనుకు చేరవేస్తారు. అరబ్ దేశాల్లో ఇంటి సహాయకురాలు, కుక్, క్లీనర్స్, కేర్ టేకర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని, నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించుకోవచ్చని బా« దితులకు ఎర వేస్తారు. అక్కడకు పంపడానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అవుతాయని చెప్పి అందినకాడికి వసూలు చేస్తారు. ఆపై అరబ్ దేశాల్లో ఉన్న మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీల సాయంతో బో గస్ ఉద్యోగ ఆఫర్ లెటర్స్ పంపించి నమ్మిస్తారు. మహిళల వేలం పాట ముఠా సభ్యులు.. తమ మాటల్ని నమ్మి డబ్బు చెల్లించిన వారిలో కొందరికి విజిట్ వీసా, మరికొందరికి జాబ్ వీసాలు ఇప్పిస్తున్నారు. దుబాయ్‌కి వెళ్లాక పురుషులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇక మహిళల్ని స్థానికంగా ఉన్న మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. ఈ ఏజెన్సీలు అరబ్ షేక్‌లకు అనుబంధంగా పనిచేసే కన్సల్టెన్సీల సహకారంతో వేలంపాట నిర్వహిస్తుంటాయి. అరబ్ షేక్‌ల సమక్షంలో జరిగే ఈ వేలంపాటల్లో ఆకర్షణీయంగా ఉన్న వారికి గరిష్టంగా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇలా ఆ షేక్‌ల కబంధ హస్తాల్లో చిక్కిన తర్వాత ఆ మహిళల నుంచి పుస్తెలతాడు, మెట్టెలు తీయించేస్తున్నారు. తమ ఇళ్లకు తీసుకువెళ్లి బుర్ఖాలు ధరించాలని ఒత్తిడి చేస్తూ బానిసలుగా చూస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. పాస్‌పోర్టులు సైతం షేక్‌ల అధీనంలోనే ఉండడంతో వారంతా ఆ నరకాల్లో మగ్గుతున్నారు. విజిట్ వీసాతో వచ్చి పని చేస్తున్నందున బయటకెళ్తే పోలీసులు అరెస్టు చేస్తారని బెదిరించి తమ ఇళ్లలోనే బందీ చేస్తున్నారు. ఎవరైనా మరీ గొడవ చేస్తే వారిని తిరిగి ‘దుబాయ్ శ్రీను అండ్ కో’కు అప్పగించేస్తున్నారు. ఆ ముఠా.. ఇక్కడున్న బాధితుల సంబంధీకుల నుంచి మళ్లీ డబ్బు వసూలు చేసి, టికెట్లు కొని పంపిస్తున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్. చిత్రంలో నిందితులు ఓ జంట ఇచ్చిన ఫిర్యాదుతో.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రస్తుతం ఘట్కేసర్లోని అన్నోజీగూడలో నివసిస్తున్నారు. వీరిని సంప్రదించిన త్రిమూర్తులు దుబాయ్ పంపుతానంటూ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది వచ్చిన దుబాయ్ శ్రీను ఈ జంట నుంచి అదనంగా మరో రూ.లక్ష డిమాండ్ చేసి.. రూ.70 వేలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరి 12న భార్యను, పది రోజుల తర్వాత భర్తను దుబాయ్ పంపాడు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో పెట్టడంతో పాటు అక్కడున్న పరిస్థితుల్ని గమనించిన వీరు తిరిగి వెళ్లిపోతామంటూ గొడవ చేశారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వీరి బంధువు నుంచి మరో రూ.70 వేలు వసూలు చేసి, ఆ తర్వాత టికెట్లు కొని పంపారు. అక్కడ్నుంచి తిరిగొచ్చిన ఈ జంట గతేడాది జూన్‌లో ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన మల్కాజ్గిరి జోన్ ఎస్వోటీ పోలీసులు త్రిమూర్తులు, తాతాజీ, దాసు, రామారావు, మురళీలను అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.1.6 లక్షల నగదు, వివిధ బోగస్ పత్రాలు, విజిట్ వీసా కాపీలు స్వాధీనం చేసుకుంది. దుబాయ్ శ్రీను సహా పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురిని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
మహిళలకు రక్షా కవచం
విశాఖపట్నం : మహిళలు, బాలల అక్రమ రవాణా, వారిపై దాడులు, కిడ్నాప్‌లు వంటి సంఘవిద్రోహ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు సంయుక్త కార్యాచరణ సిద్ధం చేశాయి. విశాఖను మహిళా, బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించాయి. ‘బంగారు తల్లులు–అంగడి సరుకులు’ అనే శీర్షకతో ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కధనంపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఓ పక్క పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మరో వైపు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉమెన్ ట్రాఫికింగ్‌పై మంగళవారం జిల్లాస్థాయిలో సమీక్షించారు. మహిళలను ఆదుకునేందుకు, బాలకార్మికులు, బాల యాచకుల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. వివిధ రూపాల్లో హింసకు గురయ్యే బాధిత మహిళలకు అవసరమైన మద్దతు, సహాయం అందజేయడంతోపాటు వారి పునరావాసానికి ఉద్దేశించిన వన్‌స్టాప్ సెంటర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గత ఏడాది జనవరిలో కేజీహెచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంపై తగిన ప్రచారం లేకపోవడం వల్ల ఫలితాలు రావడంలేదన్న అభిప్రాయాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు. ఈ కేంద్రం పనితీరును మెరుగుపర్చాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఐసీడీఎస్ పీడీ చిన్మయిదేవిని ఆదేశించారు. వన్‌స్టాప్ సెంటర్‌కు శాశ్వత భవనం కోసం విమ్స్‌లో స్థలాన్ని కేటాయించేందుకు పంపిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం లభించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. హెల్ప్లైన్ల ఏర్పాటు హింసకు గురయ్యే మహిళలు 0891–2564575 లేదా ఉమెన్ హెల్ప్‌లైన్–181కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో బాలకార్మికుల, బాలయాచకుల లేకుండా చూడాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆయన కోరారు. నగరంలోని పలు కూడళ్లలో బాలయాచకుల సమస్య ఎక్కువగా ఉందని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తేగా దీనిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించేలా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలకార్మికులు, బాలయాచకులను గుర్తించి వారికి తగిన పునరావాసం కల్పించాలన్నారు. నగరంలో బాలకార్మికులు, బాలయాచకులు, తప్పిపోయిన బాలలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్–1098కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో డ్రాపవుట్స్‌పై సర్వే నిర్వహించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీపీవో రామశాస్త్రి, పంచాయతీరాజ్ ఎస్ఈ గజేంద్ర తదితరులతో పాటు ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
వ్యభిచార దందాపై పోలీసుల ఉక్కుపాదం
హైదరాబాద్: నగరంలో వ్యభిచార దందాను నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. అపార్ట్మెంట్లు, ఇళ్లలో వ్యభిచార దందా నిర్వాహకులను పట్టుకునే క్రమంలో ఆ ఇళ్లలో మైనర్లు దొరికితే మూడేళ్ల పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం మెజిస్ట్రేట్‌కు ఉందని, మేజర్లు దొరికితే మూడు నెలల నుంచి ఏడాది పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం ఉందని మహేష్ భగవత్ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలో ఈ ఏడాది జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు మహిళల అక్రమ రవాణాపై 23 కేసులు నమోదు చేసి 75 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందిన 40 మందికి వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. ఇటువంటి అరాచకాలు సాగకుండా ఉండేందుకు వ్యభిచార గృహాలను సీజ్ చేస్తున్నారు. రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు అపార్ట్మెంట్లను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అండ్ డిప్యూటీ కలెక్టర్ కం తహసీల్దార్ సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. వీటిలో సరూర్‌నగర్ మండలం అల్కాపురిలోని దుగ్గిరాల అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 103, దిల్సుఖ్నగర్ లలితా నగర్‌లోని శిల్పి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 106, సరూర్‌నగర్ కర్మన్‌ఘాట్‌లోని జ్యోతినగర్ రోడ్డు నంబర్ త్రీలోని రెండో అంతస్తు ప్లాట్ నంబర్ 22ను, కొత్తపేట న్యూ మారుతీనగర్ బాబు కాంప్లెక్స్‌లోని తొలి అంతస్తు 1-6-30ని సరూర్‌నగర్ తహసీల్దార్ సీజ్ చేశారు. అలాగే, వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇళ్లలో ఇకపై అటువంటి కార్యకలాపాలు ఆపేయాలని ఆరు అపార్ట్మెంట్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పడుచులే లక్ష్యం
కొలువుల పేరుతో యువతుల తరలింపు తిరుపతి కేంద్రంగా వ్యాపారం వ్యభిచార ముఠాల గుప్పిట్లో చిక్కుకుని విలవిల బాధిత కుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తం తిరుపతి ఏజెంటు రాణిమ్మను అదుపులోకి తీసుకుని విచారణ తిరుపతి : నిన్నా మొన్నటి వరకూ చిత్తూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్‌లనే ఇద్దరు ఏజెంట్లు సుమారు 150 మంది మహిళలను విదేశాలకు పంపారు. సత్యవేడుకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు. రఫీ, పాండియన్‌లను అరెస్టు చేశారు. కాగా ఈ తరహా మోసాలు, మహిళల అక్రమ తరలింపులు తిరుపతిలోనూ వెలుగు చూశాయి. దీంతో అర్బన్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముఠాల కోసం గాలిస్తున్నారు. తిరుపతి నుంచి ఇలా... పూతలపట్టు మండలం డీ మిట్టూరుకు చెందిన వెంకట రమణ, తిరుపతికి చెందిన వెటశాల శ్రీనివాసరావు మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తిరుపతికి చెందిన కొందరు మహిళల తరలింపు ఏజెంట్లు తమ తమ భార్యలను ఏ విధంగా విదేశాలకు తీసుకెళ్లారో వివరించి అక్కడి వ్యభిచార కూపాల్లో మహిళలు అనుభవిస్తోన్న నరక యాతనను వివరించారు. వివరాలు వారి మాటల్లోనే.... నా భార్యను రక్షించండి... మాది పూతలపట్టు మండలం డి. మిట్టూరు గ్రామం. కొన్నాళ్లుగా భార్యాపిల్లలతో తిరుపతి మంగళం రోడ్డులో ఉంటున్నాం. పక్కనే ఉన్న రాణిమ్మ పరిచయమైంది. దుబాయ్‌కి వెళితే నెలకు రూ.1 లక్ష సంపాదన ఉంటుందనీ, అక్కడి ఇళ్లల్లో పనిచేస్తే నెలవారీ జీతం వస్తోందని ఆశ చూపింది. ఇందుకోసం ఖర్చవుతుందని చెపితే రూ.50 వేలు చెల్లించాం. ఆగస్టు 12న నా భార్య అమృతతో పాటు మరో 14 మంది మహిళల్ని తీసుకుని రేణిగుంటలో రెలైక్కారు. మూడ్రోజులు ముంబయి హోటల్లో ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత ఎటు నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. 15 రోజుల తర్వాత సౌదీకి తీసుకెళ్తున్నారని ఫోన్లో చెప్పింది. తిరిగి ఈ నెల 17న మళ్లీ ఫోన్లో మాట్లాడింది. అక్కడ తనను హింసిస్తున్నారనీ, వ్యభిచారం చేస్తేనే ఉంటావనీ, లేకుండా ప్రాణాలతో ఉంచబోమని బెదిరిస్తున్నారని ఏడ్చింది. ఏం చేయాలో తెలియక ఆదివారం సాయంత్రం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు రాణిమ్మను పట్టుకొచ్చారు. విచారణ చేస్తున్నారు. ఎలాగైనా నా భార్యను రక్షించండి. పీ వెంకట రమణ, తిరుపతి. విచారణ జరుపుతున్నాం... మహిళల రవాణా గురించి తెల్సింది. ఎక్కడెక్కడ ఎంత మందిని విదేశాలకు పంపారో గుర్తిస్తున్నాం. అసలు మహిళల్ని ఎలా ట్రాప్ చేశారో, బాధితులు, ముఠా సభ్యుల మధ్య పరిచయాలు ఎలా మొదలయ్యాయే తెల్సుకుంటున్నాం. ఇటీవలనే ఈ తరహా కేసు మరొకటి నమోదైంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాం. ఎవర్నీ వదలం. జయలక్ష్మి, అర్బన్ ఎస్పీ, తిరుపతి. -
వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
నల్గొండ: వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జిల్లాలోని సూర్యపేటలో శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు యువతులను హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిస్తుండగా వారు పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ నుంచి కొంతమంది యువతులను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సూర్యపేటలో నిఘా ఉంచడంతో ఇరువురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. -
గ్యాంగ్ లీడర్ చౌదరికి 12 ఏళ్ల జైలు శిక్ష
మహిళల అక్రమ రవాణా కేసులో భారతీయ సంతతికి చెందిన గ్యాంగ్‌లీడర్ విశాల్ చౌదరి (35) కి బ్రిటన్ కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 100 మందికి పైగా మహిళలను బ్రిటన్ తరలించడమే కాకుండా వారితో బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు విశాల్‌పై నమోదైన నేరం రుజువైందని పేర్కొంది. విశాల్‌తోపాటు అతడికి సహాకరించిన నలుగురితోపాటు మరో మహిళకు లండన్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. నిందితులలో విశాల్ సోదరుడు కునాల్ చౌదరికి 5 ఏళ్లు, మహిళ సిజల్వియా అబెల్ 3 ఏళ్లు, ఆమె సోదరుడు క్రిస్జిటియన్ అబెల్ 10 ఏళ్లు, అట్టిల్లా కోవాస్ 6 ఏళ్లు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం ఆరోపణలపై విశాల్, కునాల్ చౌదరిలతోపాటు మరో ముగ్గురుని గతే ఏడాది మొదట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బిబిసి ఓ కథనాన్ని వెలువరించింది.