సాక్షి, హైదరాబాద్ : విదేశీ యువతుల అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోని నగరాలకు యువతులను తరలిస్తున్న కేసులో ప్రధాని నిందితుడైన హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ సలాంను ఎన్‌ఐఏ శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే నిందితుడి నుంచి ఇద్దరు యువతులను ఎన్‌ఐఏ కాపాడింది. కేసు విచారణలో భాగంగా కీలక డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని వివరాలను కోసం దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఇదే కేసులో పలువురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ నెట్‌వర్క్‌తో యువతులను దేశ సరిహద్దులు అక్రమంగా దాటిస్తున్న ముఠాను ఎన్‌ఐఏ గుర్తించి.. కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ ముఠా ఇప్పటికే ఎంతో మంది యువతులను తరలించిందని, వారి వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని ఎన్‌ఐఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment