
చిట్టినగర్ (విజయవాడ వెస్ట్) : యువతి విక్రయించడంతో పాటు బలవంతంగా వ్యభిచారం చేయించిన కేసులో కొత్తపేట పోలీసులు శుక్రవారం గుంటూరుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన యువతిని వైఎస్సార్ కాలనీకి చెందిన శోభారాణికి విక్రయించిన కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. గుంటూరు ప్రకాష్‌నగర్‌కు చెందిన అన్నపురెడ్డి అంజిలి (29), ఆమె భర్త దుర్గాప్రసాద్ (32) తో పాటు సుమంత్ అనే యువకుడిని అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment