
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో వైట్నర్ బాధితుల బెడద ఎక్కువైంది. వైట్నర్ సేవిస్తున్న యువకులు చేసే హంగామా జనాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సోమవారం ఉదయం పాతబస్తీ ఛత్రినాకలో వైట్నర్ సేవించిన ఇర్ఫాన్ అనే వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకోవడానికి రావటంతో మత్తులో ఉన్న ఆ వ్యక్తి వారికి దొరకకుండా పరిగెడుతూ బ్లేడుతో చేతిని కోసుకున్నాడు.
తీవ్ర రక్తస్రావం కావటంతో అతను రోడ్డుపై పడిపోయాడు. ఇర్ఫాన్ తన చర్యలతో బీభత్సం సృష్టిస్తూ పోలీసులనే బెంబేలెత్తించాడు. అతికష్టం మీద అతన్ని పట్టుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గతకొన్ని రోజులుగా ఇర్ఫాన్ వైట్నర్ తాగుతూ బానిసగా మారినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: భర్త వేధింపులు: పోలీసు స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి..
Comments
Please login to add a commentAdd a comment