whitner
-
పాతబస్తీలో యువకుడి హంగామా: వైట్నర్ తాగి బ్లేడ్‌తో కోసుకొని
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో వైట్నర్ బాధితుల బెడద ఎక్కువైంది. వైట్నర్ సేవిస్తున్న యువకులు చేసే హంగామా జనాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సోమవారం ఉదయం పాతబస్తీ ఛత్రినాకలో వైట్నర్ సేవించిన ఇర్ఫాన్ అనే వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకోవడానికి రావటంతో మత్తులో ఉన్న ఆ వ్యక్తి వారికి దొరకకుండా పరిగెడుతూ బ్లేడుతో చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావటంతో అతను రోడ్డుపై పడిపోయాడు. ఇర్ఫాన్ తన చర్యలతో బీభత్సం సృష్టిస్తూ పోలీసులనే బెంబేలెత్తించాడు. అతికష్టం మీద అతన్ని పట్టుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గతకొన్ని రోజులుగా ఇర్ఫాన్ వైట్నర్ తాగుతూ బానిసగా మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: భర్త వేధింపులు: పోలీసు స్టేషన్లోనే పురుగుల మందు తాగి.. -
అర్థరాత్రి అలజడి.. వైట్నర్ మత్తులో..
సాక్షి, హైదరాబాద్ : అర్థరాత్రి సమయంలో వైట్నర్ మత్తులో ఉన్న కొంతమంది అలజడి సృష్టించారు. పూర్తిగా వైట్నర్ మత్తులో మునిగిన వాళ్లు ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడి చేసుకుని జనాలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటన పాతబస్తీలోని ఫలక్నామా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం అర్థరాత్రి వేళ ఫలక్నామాలో వైట్నర్ల మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు, కొందరు పురుషులు ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడిచేసుకున్నారు. మత్తులో మునిగిన ఓ మహిళ బ్లేడ్‌తో నరాలు కోసుకోవటంతో అక్కడి జనం భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. వైట్నర్ల మత్తు కారణంగానే వాళ్లు వీరంగం సృష్టించారని తెలిపారు. -
వైట్నర్ మత్తులో చోరీలు
నలుగురు బాలురులు, ఓ వ్యక్తి అరెస్ట్ ఎమ్మిగనూరు రూరల్: పట్టణంతో పాటు నందవరం మండలంలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు బాలురులు, ఓ వ్యక్తి ఉన్నారు. వారి వివరాలను పట్టణ ఎస్ఐ కె.హరిప్రసాద్ విలేకరులకు వివరించారు. కొన్ని రోజులుగా పట్టణంలో చోరీలు జరుగుతుండటంతో కానిస్టేబుళ్లు దశరథరాముడు, రవి, విజయ్‌కుమార్‌ను ప్రత్యేక బృందంగా నియమించి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో కొందరు బాలురులు జులాయిగా తిరుగుతూ వైట్నర్కు బానిసలై మత్తులో ఇళ్లలోకి దూరి దొంగతనాలు చేయటం, షాప్‌లను షర్టర్లు ధ్వంసం చేస్తున్నట్లు గుర్తించారు. వారిపై నిఘా ఉంచి 2016 అక్టోబర్‌లో ముగతి పేటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిన కేసులో నలుగురు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 2016 ఫిబ్రవరి నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో పట్టణానికి చెందిన బానును గురుజాల దగ్గర అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు రూ. లక్ష రూపాయాల విలువ చేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చెప్పారు. సమావేశంలో నందవరం ఎస్ఐ జగన్ మోహన్ యాదవ్, పోలీసులు తదితరులు ఉన్నారు.