
ముంబై బీచ్ ఒడ్డున వర్షంలో ఓ ప్రేమ జంట
న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీలో, ముంబైలో ఈ రోజు వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రుతుపవనాల రాక- ఉష్టోగ్రత తగ్గడంతో ఢిల్లీ, ముంబై నగరవాసుల ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. ఎండవేడిమికి అల్లాడుతున్నవారికి వర్షం పడటంతో ఒక్కసారిగా ప్రాణంలేచివచ్చినంత పనైంది.
వర్షం పడటంతో ఏర్పడిన చల్లదనాన్ని ముంబైవాసులు ఆస్వాదిస్తున్నారు. యువత రోడ్లపై చిందులు వేస్తోంది. ఈ సాయంత్రం యువతులు బీచ్ వద్ద కేరింతలు కొడుతున్నారు. ప్రేమ జంటలు బీచ్ ఒడ్డున వర్షంలో కూర్చొని ఆనందం అనుభవిస్తున్నారు.