
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి.
నగరంలోని మలక్ పెట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చంపా పేట్, ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్, జూపార్క్, ఫలక్‌నూమా, బహదూర్ పురా, పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నగర శివారులోని దుండిగల్, సూరారం, దూలపల్లి, బహదూర్ పల్లి, పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో నగరవాసులకు ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment