cool weather
-
పరిస్థితి ఇంత దారుణమా!.. చలికి ఏకంగా బట్టలే గడ్డకట్టిపోయాయి
-
‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వంసం
బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాన్ విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. మెరుగవని రవాణా వ్యవస్థ దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహించారు. ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్‌వెస్ట్ ప్రకటించింది. యథేచ్ఛగా లూటీలు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది. ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి! వరద ముప్పు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. బఫెలో.. దయనీయం! పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ వాపోయారు. నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్‌కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లాం మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్కు చెందిన డిట్జక్ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్ హోమ్ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్ గుర్తు చేసుకున్నాడు. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
-
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరంలోని మలక్ పెట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చంపా పేట్, ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్, జూపార్క్, ఫలక్‌నూమా, బహదూర్ పురా, పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే నగర శివారులోని దుండిగల్, సూరారం, దూలపల్లి, బహదూర్ పల్లి, పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో నగరవాసులకు ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగింది. -
హైదరాబాద్‌ను కప్పేసిన దట్టమైన పొగమంచు.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను పొగమంచు కప్పేసింది. ఆదివారం తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పేసింది. మరోవైపుసాయంత్రం అయిదు గంటలకే కారుచీకట్లు అలుముకునేలా సర్పిలాకారంలో (స్పైరల్) కమ్మేసిన కారుమబ్బులు.. మరోవైపు వాహనాల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ.. వెరసీ.. సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భూ వాతావరణానికి తక్కువ ఎత్తులో.. కేవలం 0.9 కి. మీ ఎత్తులోనే దట్టమైన క్యుములో నింబస్మేఘాలు ఏర్పడడం వీటి నుంచి నింబోస్ట్రేటస్, అల్టోస్ట్రేటస్ అనే వాయువులు వెలువడడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ సమస్యలున్నవారు ఊపి రాడక విలవిల్లాడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: ‘గుడ్’మార్నింగ్.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు కాలుష్యం.. కారుమబ్బులు.. ► నగరంలో పీల్చే గాలిలో వాయు కాలుష్యం తీవ్రమవడంతో ఆయా కారకాలు దట్టమైన మేఘాల కారణంగా భూ ఉపరితల వాతావరణంలో పైకి వెళ్లలేక భూవాతావరణాన్ని ఆవహిస్తున్నాయి. మరోవైపు అనూహ్యంగా పడిపోతున్న కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా.. సిటీజన్లు న్యుమోనియా, అస్తమా, ఓమిక్రాన్ తదితర తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. ► క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి సీఓపీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడడం)తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం గమనార్హం.ì గత మూడు రోజులుగా ఇదే దుస్థితి నెలకొంది. కాలుష్యం విషయానికి వస్తే..సిటీలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. చదవండి: HYD: మందుతాగి పోలీసులకు దొరికితే.. ఇక ఆఫీస్‌లో మీ పని అంతే! ►గ్రేటర్ పరిధిలో సుమారు 55 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఘనపు మీటరు గాలిలో ధూళికణాలు (పీఎం10) మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. పలు కూడళ్లలో సుమారు 90–100 మైక్రోగ్రాముల ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శ్రుతిమించుతున్నట్లు తేలింది. అంతేకాదు ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త... ఉష్ణోగ్రతలు పడిపోతుండడం, పొగమంచు కారణంగా వృద్ధులు, రోగులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున బయటకు రావద్దని స్పష్టం చేస్తున్నారు. చలినుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరని సూచిస్తున్నారు. -
ఈ చలేంట్రా బాబూ...
-
హైదరాబాద్ సల్లబడింది.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఎండ వేడికి అల్లాడిన నగరవాసులు శనివారం చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా భారీ వర్షాల కారణంగా కొత్తగూడెం పట్టణంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. -
వణికిస్తున్న చలి
-
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
⇒ రాత్రి వేళ 2 - 6 డిగ్రీల తగ్గుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పడుతుండటంతో చలి వాతావరణం నెలకొంది. గత 24 గంటల్లో మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు పడిపోయింది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, నిజామాబాద్ లలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికా ర్డయ్యాయి. హన్మకొండలో సాధారణం కంటే ఏకంగా 6 డిగ్రీలు తక్కువగా నమోదైంది. హైదరాబాద్, ఖమ్మంలలో 4 డిగ్రీల చొప్పున, నిజామాబాద్, రామగుండంలలో 3 డిగ్రీల చొప్పున తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం మినహా అన్నిచోట్లా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. -
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. వ్యక్తి మృతి
జన్నారం(ఆదిలాబాద్) : చలి పులి పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలకు పడిపోతోంది. జన్నారం మండల వాసులు చలికి బెంబెలెత్తుతున్నారు. చలి తీవ్రతకు తట్టుకోలేక మండలంలోని పొన్కల్‌కు చెందిన గోలి దుబ్బయ్య(59) మృతిచెందాడు. దుబ్బయ్య భార్య లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త దుబ్బయ్య వృత్తి రీత్యా బట్టలు ఉతుకుతూ.. ఇస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున 3గంటలకు చలికి తట్టుకోలేకపోయూడు. దుప్పటి కప్పమని భార్యకు సూచించాడు. భార్య అతడికి దుప్పటి కప్పి నిద్రపోయింది. తెల్లవారినా భర్త లేవకపోవడంతో వెళ్లి చూసింది. చలి తీవ్రతకు తట్టుకోలేక భర్త దుబ్బయ్య చనిపోయాడని గుర్తించింది. మృతుడు దుబ్బయ్యకు ఇద్దరు కూతుళ్లున్నారు. ఉన్నారు.