
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఎండ వేడికి అల్లాడిన నగరవాసులు శనివారం చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా భారీ వర్షాల కారణంగా కొత్తగూడెం పట్టణంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment