strom alerts
-
ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం
ఢిల్లీ: భానుడి ప్రతాపంతో ఉడికిపోయిన ఢిల్లీ.. ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు, భారీ వర్షంతో అతలాకుతలం అయ్యింది. శనివారం వేకువఝాము నుంచే కురిసిన భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గాలులకు పలుప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. మరోవైపు విమాన రాకపోకలపైనా ఇది ప్రభావం చూపెట్టింది. నోయిడా, ఘజియాబాద్తోపాటు దేశ రాజధాని రీజియన్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణంలోని మార్పుల కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని, సరైన సమాచారం కోసం తమను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల్ని చవిచూసింది ఢిల్లీ. ఈ సీజన్లో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో నగరవాసులు అల్లలాడిపోయారు. #DelhiRains pic.twitter.com/1dcdsPmygm — Munna Bhai (@3MunnaBhai3) May 27, 2023 Storm Alert ⚠️ Massive Thunderstorms impacting #Haryana is moving towards NCR. Strong surface winds of 50 to 100km/h, moderate to heavy rains, non stop lightning, thunder and #hailstorm would occur in #Delhi #Gurgaon #Noida #Faridabad #Ghaziabad b/w 6:00 too 8:00AM.#DelhiRains pic.twitter.com/gwLXi17yVV — Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) May 26, 2023 Woke up because of this #DelhiRains #delhiweather pic.twitter.com/kKn9jNzIsI — samridhi (@swiminpul) May 27, 2023 Operations at #Delhi Airport are highly affected as morning supercell #Thunderstorm and #DelhiRains hit entire national capital region. Airport clocked massive 102km/h wind gust, flights seen circling around and none was able to land. weather is improving but light to moderate… https://t.co/toAisuXuA3 pic.twitter.com/r6vlPJeT3I — Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) May 27, 2023 Kind attention to all flyers!#Badweather #Rain pic.twitter.com/2NUCfzpczw — Delhi Airport (@DelhiAirport) May 27, 2023 -
12 అంతస్తుల భవనం.. క్షణాల్లో నేలమట్టం
వాషింగ్టన్: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 121 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. అయితే ప్రస్తుతం ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనం జూన్ 24 తెల్లవారుజామున కూలిపోగా.. 2021, జూలై 4న పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజనీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగింది. కాగా, వచ్చే వారంలో ఎల్సా తుపాను వచ్చే అవకాశం ఉండటంతో.. సర్ఫ్సైడ్లోని మిగిలిన 12-అంతస్తుల చాంప్లైన్ టవర్స్ సౌత్ను అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 తర్వాత కూల్చివేశారు. తుపాను ముప్పు కాగా, చాంప్లైన్ సౌత్ టవర్ కూల్చివేతను చూడటానికి పెద్ద మొత్తంలో ప్రజలు అక్కడి చేరుకున్నారు. ఈ ఘటనపై కౌంటీ మేయర్ లెవిన్ కావా మాట్లాడుతూ.. ఉష్ణమండల తుఫాను ఎల్సా కరేబియన్ మీదుగా ఉత్తరం వైపు వస్తుండటంతో.. అధికారులు బిల్డింగ్ కూల్చివేత షెడ్యూల్ను వేగవంతం చేశామని తెలిపారు.. గతవారం ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల బంధువులను ఓదార్చారు. అంతే కాకుండా రెస్క్యూ కార్మికులను కలుసుకుని వారి పనితీరుని ప్రశంసించారు. WATCH: The portion left standing of the partially collapsed Champlain Towers South condo building in Surfside, Florida, was demolished.https://t.co/ssfxO7WmMN pic.twitter.com/hKOS0nAr4e — CBS 21 News (@CBS21NEWS) July 5, 2021 -
హైదరాబాద్ సల్లబడింది.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఎండ వేడికి అల్లాడిన నగరవాసులు శనివారం చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా భారీ వర్షాల కారణంగా కొత్తగూడెం పట్టణంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. -
ఆ మూడు జిల్లాలకు పెను తుపాన్ల తాకిడి!
విశాఖపట్నం: రాష్ట్రంలోని మూడు జిల్లాలు పెనుతుపాన్ల తాకిడికి గురయ్యే ప్రాంతాల జాబితాలో ఉన్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గుర్తించింది. తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు పెను తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉందని ఐఎండీ ఓ నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా 13 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తుపాన్ల తాకిడి తీవ్రంగా ఉండే జిల్లాలపై ఐఎండీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోని 12 జిల్లాలు ఈ జాబితాలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. వాటిలో మన రాష్ట్రంలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరికి ఆనుకుని ఉన్న యానాం కూడా ఉన్నట్టు ప్రకటించారు. మిగిలిన వాటిలో ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగ్జిత్సింగ్పూర్, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ, ఉత్తర 24 పరగణ, మిడ్నాపూర్, కోల్కతా జిల్లాలు ఉన్నాయి. 1891 నుంచి 2010 వరకు సంభవించిన తుపాన్లు ఎక్కువ సార్లు తీరాన్ని తాకడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు.