వర్షాలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ | chandrababu teleconference on heavy rains | Sakshi
Sakshi News home page

వర్షాలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Published Wed, Nov 18 2015 11:19 AM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM

chandrababu teleconference on heavy rains

విజయవాడ: రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు పక్కాగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే పలువురు మృతిచెందగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement