
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మంగళవారం ఉదయం బలహీనపడి అదే ప్రాంతంలో మధ్యాహ్నం వరకు తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 15°N అక్షాంశం వెంబడి తూర్పు-పశ్చిమ షేర్ జోన్ మీదుగా 3.1 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు వరకు తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు
ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కొస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లోని పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(బుధవారం) ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణా కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా.. తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(బుధవారం) రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా.. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి(గురువారం) రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment