ఏపీలో భీకర వర్షాలు.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద హైఅలర్ట్‌! | Very Heavy Rain Forecast For Many Districts In AP, Check Vijayawada Prakasam Barrage Flood Update | Sakshi
Sakshi News home page

AP Heavy Rains Update: తీరం దాటిన వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

Published Sun, Sep 1 2024 7:18 AM | Last Updated on Sun, Sep 1 2024 1:27 PM

Very Heavy Rain Forecast For Many Districts In AP

AP Rains Forecast Updates..

👉బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల్లో కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో పలు చోట్ల కుండపోత కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయవాడలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

👉 ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్ డేట్

  • భారీగా పెరుగుతున్న వరద
  • కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక జారీ
  • ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులు
  • మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేత

విజయవాడ నగరవాసులను వీడని వర్షం భయం. 

  • బిక్కుబిక్కుమంటున్న కొండ ప్రాంత ప్రజలు. 
  • కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో భయంలో స్థానికులు. 
  • రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన కొంత ప్రాంత ప్రజలు. 
  • మరోవైపు.. క్రీస్తురాజుపురం ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. 
  • కాగా, వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.
     

👉భారీ వర్షాల కారణంగా పలు రైలు సర్వీసులు రద్దు.. 

 

 

 

 

వైద్య ఆరోగ్య శాఖ‌ రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు..

  • రాష్ట్రంలో తుపాను, వ‌ర‌దల నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ‌ రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.
  • ముఖ్యంగా గ‌ర్భిణిలకు, పాము కాటుకు గురైన వారికి, విద్యుతాఘాతాల‌కు గురైన వారికి రాష్ట్ర కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుంది
  • అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల కోసం రాష్ట్ర కంట్రోల్ రూం ఫోన్ నంబ‌రు 9032384168కు ఫోన్ చెయ్యాలి.
  • ఇమెయిల్ ఐడీ: epeidemics.apstate@gmail.com
  • కంట్రోల్ రూం ఇన్‌ఛార్జిగా డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యేస్వ‌రి (7386451239),
  • హెడ్‌గా స్టేట్ హెల్త్ ఆఫీస‌ర్-ఐడిఎస్పీ డాక్ట‌ర్ ఎమ్వీ ప‌ద్మ‌జ‌(83748935490) వ్య‌వ‌హ‌రిస్తారు
  • వీరిద్ద‌రి ఆధ్వ‌ర్యంలో మూడు షిఫ్టుల వారీగా ముగ్గురు స‌భ్యుల బృందం సెప్టెంబ‌ర్-3వ తేదీ వ‌ర‌కు కంట్రోల్ రూంలో నిరంత‌రం అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల్ని ప‌ర్య‌వేక్షిస్తారు
  • షిఫ్టుల వారీ రిపోర్టుల్ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థకు అంద‌జేస్తారు

 

  • రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌తో స‌మ‌న్య‌యం చేసుకుని ప‌నిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ మొద‌టి షిఫ్ట్ కు (ఉద‌యం 6 నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు) టీబీ, జేడీ డాక్ట‌ర్ టి.ర‌మేష్‌-9849909911,
  • రెండో షిఫ్ట్‌కు (మ‌ధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు) ఐడిఎస్పీ జేడీ డాక్ట‌ర్ మ‌ల్లేశ్వ‌రి -9491423226,
  • మూడో షిఫ్ట్‌కు (రాత్రి 10 నుండి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు)
  • ట్రైబ‌ల్ హెల్త్ పీఓ డాక్ట‌ర్ ఎం.ర‌మేష్ బాబు-9959727979ను వైద్య ఆరోగ్య శాఖ నియ‌మించింది

 

👉విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

 

👉మరోవైపు.. సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా వరద నీరు పెరుగుతోంది.  

👉కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో వరద నీరు చేరే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్‌లో వరద ఉధృతితో సీఎం నివాసానికి వరద ముప్పు. దీంతో, అధికారుల్లో ఆందోళన నెలకొంది.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తి పూర్తిగా నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు దాటితే కరకట్ట వైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉంది. 

👉విజయవాడకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. బొమ్మలూరు వద్ద హైవేపైకి వరద నీరు చేరుకుంది. పలు చోట్ల వరద నీరు చేరుకోవడంతో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

 

👉ఇక, వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12:30-2:30 గంటల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

👉శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు.  

👉ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం

👉విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు

👉వైఎస్సార్‌, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

👉లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 
                                 
👉మరోవైపు.. భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద  ఉధృతి కొనసాగుతోంది.

👉ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

👉ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,55,250 క్యూసెక్కలుగా కొనసాగుతోంద.ఇ

👉నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా  ఉండాలి. కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలి. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకండి అని అధికారులు హెచ్చరించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement