AP Rains Updates..
👉దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్రరూపం దాల్చి మంగళవారం అర్ధరాత్రి వాయుగుండంగా బలపడింది. దీంతో, రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.
👉తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో రన్‌వే పైకి వరద నీరు చేరుకుంది. దీంతో, రేణిగుంట రావాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు.
👉వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం
- కడప నగరంతో పాటు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం
- రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదు
- భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్లు
- జిల్లా కలెక్టరేట్లతో పాటు రెవిన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
👉అనంతపురం..
భారీ వర్షాల నేపథ్యంలో 16, 17 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
👉శ్రీ సత్యసాయి జిల్లా..
భారీ వర్షాల నేపథ్యంలో 16, 17 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
👉నెల్లూరులో భారీ వర్షం..
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపిలేని భారీ వర్షాలు.
- నేడు రేపు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.
- జలదంకిలో అత్యధికంగా 17 సెం.మీల వర్షపాతం.
- మూడో రోజూ విద్యా సంస్థలకి సెలవు ప్రకటించిన కలెక్టర్..
- గ్రామాలు, మండల కేంద్రాల్లోనే అధికారులు, ఉద్యోగులు.
- సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు. పెరుగుతున్న గాలుల తీవ్రత.
- సోమశిల డ్యాంలో 52 టీఎంసీల నీటి నిల్వ. ఎగువనుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లో
- నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, శ్రామిక్ నగర్, గాంధీ గిరిజన కాలనీ ప్రాంతాలలో భారీగా రోడ్ల మీదకు చేరిన వర్షపు నీరు.
- తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది.
👉ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కి.మీ, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కి.మీ, నెల్లూరు(ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 590 కి.మీల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 17వ తేదీన తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
👉విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరుకు సమీపంలో తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
పలుచోట్ల భారీ వర్షాలు
ఇప్పటికే రెండు రోజుల నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా విడదలూరు మండలం ఊటుకూరులో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా 15.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
భారీ వర్షాల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
రాయచోటి కలెక్టరేట్‌లో జిల్లా కంట్రోల్ రూమ్: 08561-293006.
రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబరు: 08565 240079.
రాయచోటి ఆర్డీఓ కార్యాలయం లో కంట్రోల్ రూమ్: 08561-293039.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మూడు షిఫ్టుల వారిగా కంట్రోల్ రూమ్ నంబర్
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు: 99899176247
మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు: 9490827676
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు: 6303308475
Comments
Please login to add a commentAdd a comment