పంచాంగశ్రవణాన్ని వినిపిస్తున్న పండిత బుట్టే
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు
Published Wed, Mar 29 2017 10:46 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– పంచాంగ శ్రవణంలో పండిత బుట్టే
శ్రీశైలం: ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఆయన పంచాంగం చెప్పారు.పొట్టి, నలుపు ధాన్యాలు ఫలిస్తాయని, నల్లరేగడి, ఎÆరుపు నేలల్లో విశేషంగా పంటలు పండుతాయని తెలిపారు. వేరుశనగ, మొక్కజొన్న, మిరప, పెసలు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలకు (ధనియాలు వగైరా) మంచి గిరాకీ ఉంటుందన్నారు. పాడిపరిశ్రమ చాలా బాగుంటుందని, పాల ఉత్పత్తులు కూడా పెరుగుతాయన్నారు. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. పంచాంగ శ్రవణానంతరం ఈఓ నారాయణ భరత్‌గుప్తకు పండిత బుట్టే శత సంవత్సర పంచాంగం, శేషవస్త్రాలను అందజేశారు. చివరగా దేవస్థానం అర్చకులు, వేదపండితులు, వివిధ విభాగాల అధికారులకు పండిత సత్కారం చేసి పంచాంగాలను పండిత బుట్టే ఇచ్చారు.
Advertisement