ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగాయి. వర్షం బీభత్సంతో వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. పలువురు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మహబూబాబాద్‌లో కురస్తున్న భారీ వర్షాలకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఐఎండీ గుజరాత్‌తో పాటు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న తెలంగాణా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలో ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం రాష్ట్రంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి దారి మళ్లించింది. హైదరాబాద్‌లోనూ శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. 2020 వరదల మాదిరిగానే 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్న అనుకూల వాతావరణంతో నగరానికి ఉపశమనం కలిగినట్లు తెలిపింది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం సహా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
గుజరాత్‌లో సైతం
1976 తర్వాత అరేబియా సముద్రంలో తొలిసారి తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. గుజరాత్‌లో ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 29 వరకు కురిసింది. ఈ వర్షం ధాటికి 47 మంది మరణించారు. ఈ తరుణంలో ఆదివారం (సెప్టెంబర్1) వాతవారణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన వర్షాలు సెప్టెంబర్ 5వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment