సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం పడుతుంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, బోరబండ, కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో డీఆర్‌ఎఫ్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా బొమ్మనదేవిపల్లిలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 35 కేంద్రాల్లో వర్షపాతం రికార్డయిందని, భద్రాచలంలో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.
చదవండి:
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు: రేపు నోటిఫికేషన్?
కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..!
Comments
Please login to add a commentAdd a comment