లెహర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నాలుగు మండలాల్లో ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. గురువారం గుంటూరులో లెహర్ తుఫాన్పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సముద్రంలో నాలుగు అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో సముద్రం అల్లకల్లొలంగా తయారైంది.
ఈ నేపథ్యంలో మత్య్సకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.గత రాత్రి నుంచి తీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని చెప్పారు. తెనాలి డివిజన్ పరిధిలో పాఠశాలకు శెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులో ఐదవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు చెప్పారు.