మీడియాకు కేసు వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్: బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) శాస్త్రవేత్త సురేష్ కుమార్ హత్య కేసును ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఛేదించారు. అమీర్‌పేటలోని ఘటనాస్థలి వద్ద సేకరించిన ఆధారాలతో నిందితు డు జనగామ శ్రీనివాస్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి జరిగిన ఈ హత్య కేసు వివరాలను డీసీపీ సుమతి, ఏసీపీ తిరుపత న్నతో కలసి పోలీసు కమిషనర్ అంజనీకుమార్.. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాల యంలో శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
ఎన్‌ఆర్‌ఎస్‌సీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎస్.సురే ష్ కుమార్ (56) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో 20 ఏళ్లుగా ఉంటు న్నారు. ఇండియన్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచే స్తున్న భార్య ఇందిరకు చెన్నైకి బదిలీ కావడంతో 2005 నుంచి ఆమె పిల్లలతో అక్కడే ఉంటున్నారు. అప్పటి నుంచి సురేష్ ఒంటరిగా ఉంటున్నారు. సోమవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి మంగళవారం కార్యాలయానికి రాకపోవడంతో సహోద్యోగులు కాల్ చేశారు. సమాధానం ఇవ్వక పోవడంతో ఇందిరకు తెలియజేశారు. ఆమె ఫోన్ కాల్స్‌కూ స్పందించకపోవడంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న ఇందిర పోలీసుల సాయంతో ఫ్లాట్ డోర్ పగులగొట్టారు.
శరీరంపై షర్ట్ మినహా మరేమీ లేకుండా తలకు గాయాలై సురేష్ రక్తపు మడుగుల్లో మరణించి కనిపించాడు. కేసు ఛేదనకు పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సీసీ టీవీ ఫుటేజీని, మృతుడి ఫోన్ కాల్‌డేటాను పరిశీ లించారు. మృతుడికి వచ్చిన ఫోన్‌కాల్స్‌లో నంబర్ ఆధారంగా హత్యకు ముందు జరిగిన సంభాషణ ను తెలుసుకున్నారు. అమీర్‌పేట విజయా డయాగ్నోస్టిక్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జనగామ శ్రీనివాస్‌ను నిందితుడిగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు.
రక్తనమూనాలు సేకరించేందుకు వచ్చి...
సురేశ్‌కుమార్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో తర చూ ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు. ఇదే సమ యంలో విజయా డయాగ్నోస్టిక్‌లో పనిచేసే శ్రీని వాస్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అతడే సురేష్ ఇంటికి వచ్చి రక్త నమూనాలు సేకరించడంతో పాటు మందులిచ్చేవాడు. ఈ విషయాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. రామగుండంకు చెందిన శ్రీనివాస్‌ను పెళ్లయిన 2 నెలల్లోనే భార్య వదిలివెళ్లింది. దీంతో ఒంటరిగా అమీర్‌పేట గురుద్వారా సాయిబాలాజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో సురేష్‌తో శ్రీనివాస్‌కు స్వలింగ సంపర్కం అలవాటైంది. డబ్బులు బాగా వస్తాయని అనుకున్న శ్రీనివాస్‌కు అందుకు అంగీకరిస్తూ వచ్చాడు. ఆ మేరకు డబ్బు లు రాకపోవడంతో సురేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
సెప్టెంబర్ 30న కత్తితో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు వచ్చాడు. రోజూలాగే స్వలింగ సంపర్కంలో పాల్గొన్నాక డబ్బుల గురిం చి వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘర్షణలో శ్రీనివాస్ వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయడంతో సురేష్ తలకు తీవ్రగాయాలై చనిపోయాడు. తానే ఈ హత్య చేసినట్లు శ్రీనివాస్ చెప్పాడు. నిందితుడి నుంచి మృతుడి ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసిన రూ.10వేల నగదు స్వాధీ నం చేసుకున్నారు. ఈ హత్యను ఛేదించడం లో కృషి చేసిన పోలీసు సిబ్బందిని సీపీ అంజనీ కుమా ర్ రివార్డులతో సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment