సాక్షి, అమరావతి: హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ అసోసియేషన్‌కు, పాఠశాల విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదని ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కొందరు వ్యక్తులు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేస్తున్నారని, నిరుద్యోగ యువత వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఈ తరహా మోసపూరిత కార్యకలాపాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని అనధికార సంస్థలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన ఒకే ఒక్క సంస్థ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని, ఈ సంస్థ న్యూఢిల్లీలోని నేషనల్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉందని తెలిపారు.
అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ కూడా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ అసోసియేషన్ అనేది నకిలీ సంస్థ అని, రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఇతర కార్యాలయాలు ఆ సంస్థకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన
స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment