టీవీ నగర్‌ ఏర్పాటుకు కృషి చేస్తా.. | Movie Director Nagabala Suresh Kumar Special Story | Sakshi
Sakshi News home page

కళాత్మక జీవితం!

Published Wed, Jan 9 2019 11:07 AM | Last Updated on Wed, Jan 9 2019 11:07 AM

Movie Director Nagabala Suresh Kumar Special Story - Sakshi

సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకుంటూ (ఫైల్‌)

నాటక, కళా రంగాలంటే ఆయనకు అమితమైన ఇష్టం..ఆ ఇష్టంతోనే తహసీల్దార్‌ ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. టీవీ రంగంలోకి అడుగుపెట్టారు.. ఎన్నో ఒడిదొడుకులనుఎదుర్కొన్నారు. ఒక్కో మెట్టెక్కి ఎవరికీ దక్కని గౌరవాన్ని అందిపుచ్చుకున్నారు. తాను తీసిన సీరియల్‌ పేరునే ఏకంగా తన పేరులో భాగం చేసుకున్నారు. ఆయనే టీవీ, సినీ రంగాలకు సుపరిచితమైన దర్శక, నిర్మాత, రచయిత నాగబాల సురేష్‌కుమార్‌. అందరూ నాగబాల అంటే సురేష్‌కుమార్‌ ఇంటిపేరు అనుకుంటారు. కానీ ఆయన అసలు పేరు దండనాయకుల సురేష్‌కుమార్‌..దేశంలోనే మొట్టమొదటి స్నేక్‌ సీరియల్‌ నాగబాలను తీసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారాయన. టీవీ రంగంలో ఇప్పటికే 13 నంది అవార్డులు అందుకుని తన జీవితాన్నే ఒక కళగా మార్చుకున్నారు. తన కళా ప్రస్థానంపై సురేష్‌కుమార్‌ఏమంటున్నారంటే.. 

శ్రీనగర్‌కాలనీ: మాది ఆసిఫాబాద్‌. తండ్రి శ్రీనివాసరావు. ఆయన టీచర్‌. హిందూస్థానీ కళాకారుడు కూడా. తాతయ్య రామారావు రచయిత, కళాకరుడు. అప్పట్లో కొమురం భీంతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏ చేసి 1976లో రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరాను. మంచిర్యాల, ఆసిఫాబాద్, హైదరాబాద్‌లలో తహసీల్దార్‌గా పనిచేశాను. నా ఏడో ఏట మనదేశం నాటకంతో నా కళా ప్రస్థానం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసేవాడిని. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలు, టీవీ రంగంపై ఉండేది. దీంతో 1995లో లాంగ్‌ లీవ్‌ పెట్టి.. తెలుగు టీవీ రంగంలో అడుగుపెట్టాను. నా మొదటి సీరియల్‌ శ్రీ ఆదిపరాశక్తి. దక్షిణ భారతంలోనే మొదటి పౌరాణిక సీరియల్‌ ఇది. నటి సనా ఆదిపరాశక్తిగా టీవీ రంగానికి పరిచయమయ్యారు. అది పెద్ద సక్సెస్‌ సాధించింది. తర్వాత 8 భాషల్లో అనువాదమైంది. ఆ తర్వాత ఫారెస్ట్‌ అడ్వంచర్‌గా శభాష్‌ బేబీ, స్వాతిచినుకులు, స్వతంత్ర సంగ్రామం లాంటి సీరియల్స్‌ చేశాను. టీవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనవచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి నాటకాలకేపరిమితమయ్యాను.

నాగబాలతోటర్నింగ్‌.. 
ఆర్థిక ఒడిదుడుకులతో మార్కెటింట్‌ సొంతంగా చేసుకొని కసితో దేశంలోనే మొట్టమొదటి స్నేక్‌ సీరియల్‌ నాగబాలకు శ్రీకారం చుట్టాను. నాగబాల ఓ సంచనలమైంది. టీవీలో మైలురాయిగా, సినీ పరిశ్రమకు సైతం మైమరపించింది. దీంతో దండనాయకుల సురేష్‌కుమార్‌ అనే నేను నాగబాల సురేష్‌కుమార్‌గా మారాను. ఈ సీరియల్‌ నాలో ఆత్మస్థైర్యాన్ని, లాభాలను తెచ్చిపెట్టింది. తర్వాత అపరాధి, విజయసామ్రాట్, ఆత్మయాత్ర, రాఘవేంద్రరావు సృష్టి సీరియల్‌కి కథ, మాటలు అందించాను. ఈ తర్వాత లెజండరీస్‌ డాక్యుమెంటరీస్, పురాణగాథలు చేశాను.  12 బుక్స్‌ రాశానును. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచిక్చన షిరిడీసాయి చిత్రానికి కథా రచన చేశాను. అవధూత, మహారథి, రణం చిత్రాలకు రచన చేశాను. ఇప్పుడు రెండు పెద్ద సినిమాలకు కథా రచయితగా చేస్తున్నాను.  

ఆర్థికంగా నష్టపోయా..
టీవీ మాధ్యమంలో సీరియల్స్‌ ఘన విజయం సాధించినా. మార్కెటింగ్‌ తెలియక చాలా నష్టపోయాను. ఎంతలా అంటే చేతిలో డబ్బుల్లేక కాలి నడకన ఎర్రగడ్డ నుంచి నారాయణగూడ దాకా నడిచి తీరా అక్కడ డబ్బులు దక్కక జీవితం దుర్భరంగా తయారయ్యేంత దుస్థితి ఏర్పడింది. ఈ ఒడిదుడుకులతో చాలా అనుభవాలు తెలుసుకున్నాను. ఆటుపోట్లు, ఎలాంటి పొరపాట్లు జరిగాయి.. వాటిని ఎలా సరిదిద్దుకొని ఉన్నతంగా ఉండాలనేది పరిస్థితులే నాకు నేర్పించాయి.

టీవీ నగర్‌ ఏర్పాటుకు కృషి చేస్తా..
కొమరం భీం, చాకలి ఐలమ్మ, అభినవ పోతన, తెలంగాణా త్యాగధనులు లాంటి డాక్యుమెంటరీస్‌ తీశాం. ఇప్పటికీ 896 డాక్యుమెంటరీస్‌ చేశాను. ప్రస్తుతం టీవీ రచయితల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఫిలింనగర్‌ మాదిరిగా టీవీ నగర్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం. టీవీరంగంతో పాటు కళాకారుల సంక్షేమం కోసం టీవీ మహాసభలను రెండు నెలల్లో పెట్టబోతున్నాం. కళారంగానికే నా జీవితం అంకితం.    – నాగబాల సురేష్‌కుమార్‌

13 నంది అవార్డులు..  
టీవీ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న నంది అవార్డుల్లో 13 నంది అవార్డులు వచ్చాయి.  నేను చేసిన సీరియల్స్‌కు వివిధ విబాగాల్లో 43 నంది పురస్కారాలు అందుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా తీసుకోవడం, జాతీయ ఇందిరా ప్రియదర్శిని పురస్కారాన్ని అందుకోవడం మధురానుభూతినిఇచ్చింది. ఇవే కాకుండా మరెన్నో అవార్డులు, రివార్డులు లభించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement