మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: జాతీయ క్రీడ హాకీకి గతంలో జిల్లాలో మంచి ఆదరణ ఉండేదని, ఇప్పుడిప్పుడే ఈ క్రీడపై విద్యార్థులు ఆసక్తి కనబరచడం శుభపరిణామని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అండర్-14 ఎస్‌జీఎఫ్ హాకీ జిల్లా బాల, బాలికల జట్లను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయి హా కీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఎంపికలకు జిల్లావ్యాప్తంగా 168 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేశా రు. కార్యక్రమంలో హాకీ మహబూబ్‌నగర్ అధ్యక్ష, కార్యదర్శులు గోటూరు శ్రీనివాస్‌గౌడ్, దూమర్ల నిరంజన్, కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్, ఎంపిక కమిటీ సభ్యులు సురేందర్‌రెడ్డి, పరుశురాం, నిరంజన్‌రావు, మెర్సి, వడెన్న, మన్యం, నిరంజన్‌గౌడ్, మొగులాల్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
జట్ల వివరాలు
(బాలురు): శ్రీకాంత్, అనిల్‌కుమార్, నవీన్, వంశీ, గణేష్, సంతోష్, శ్రీశైలం, ఎం.నవీన్, రాజేందర్, కురుమూర్తి, శివకుమార్, పవన్‌కుమార్, చెన్నకేశవరెడ్డి, సాయితేజ, ముకేష్, నరేష్, స్టాండ్‌బై: సంతోష్, సాయిచరణ్, రాకేష్‌గౌడ్, ఎన్‌నరేష్. (బాలికలు): రేణుక, సుజాత, భీముద్వమ్మ, సునీత, అనిత, శ్వేత, సుధారాణి, సంధ్య, చంద్రకళ, శ్రావ్య, శిరీషా, లావణ్య, రేణుక, శిరీషా, రవళి, స్టాండ్‌బై: దుర్గా, కావ్య, పూజిత, జయమ్మ, ప్రియ.
హాకీలో జాతీయస్థాయికి ఎదగాలి
Published Fri, Nov 8 2013 4:06 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement