
మనసులు కలిసి.. మనువాడి..
- ఖండాంతరాలు దాటిన ప్రేమ
- లండన్ యువతిని పెళ్లిచేసుకున్న వరంగల్ అబ్బాయి
వరంగల్: ప్రేమకు ఎలాంటి కట్టుబాట్లు లేవని.. మంచి మనసు ఉంటే చాలని వీరిద్దరూ నిరూపించారు. దేశం కానీ దేశం నుంచి వచ్చి ఓ విదేశీ యువతి తెలంగాణ యువకుడిని పెళ్లి చేసుకుంది. వరంగల్ డాక్టర్స్ కాలనీకి చెందిన అనంతుల సాంబయ్య కుమారుడు సురేష్‌కుమార్ 8 ఏళ్లుగా లండన్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
లండన్‌లోని సౌతాంఫ్టన్‌కు చెందిన హెయినీమార్ష్ కూడా అక్కడే పనిచేస్తోంది. సురేష్, హెయినీమార్ష్‌లు ఐదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పిన జంట శుక్రవారం ఒక్కటైంది. హిందూ సంప్రదాయం ప్రకారం హెరుునీమార్ష్ తల్లిదండ్రులు క్రిష్టఫర్ డేవిడ్‌మార్ష్-లిసాజేన్.. పెళ్లి కొడుకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. పెళ్లికూతురు కుటుంబసభ్యు లు సంప్రదాయ దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకున్నారు.