ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) పరీక్షలకు సిద్ధమైంది. మంత్రి సురేశ్‌కుమార్ సోమవారం విధానసౌధలో వివరాలను వెల్లడించారు. జూలై 19న గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పరీక్ష జరుగుతుంది. జూలై 22న భాషా సబ్జెక్ట్ పరీక్ష ఉంటుంది. 8.76 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి పరీక్ష రాయనున్నారు. 7,306 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితాలకు కలిసి ఒక పరీక్ష, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లకు ఒక పరీక్ష జరుగుతుందని మంత్రి తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment