sslc exams
-
పదో తరగతి పరీక్షల్లో మా అమ్మాయికి 582 మార్కులు వచ్చాయి.. తల్లిగా నాకు చాలా గర్వంగా ఉంది
-
వీడియో: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
-
టెన్త్ ఫెయిల్ అయ్యారని బాధపడొద్దు..ఈ వీడియో చుడండి
-
ఏపీ పదో తరగతి పలితాలు విడుదల
-
ఈ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు
-
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో నేడు పోలీసుల విచారణకు ఈటల
-
వాట్సాప్ గ్రూప్ లో టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్
-
తండ్రి మృతి..10th పరీక్షకు విద్యార్థి
-
10వ తరగతి పరీక్షకు ఆంక్షలు ఇవే
-
ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్
-
టెన్త్ పరీక్షలకు హైకోర్టు ఓకే
బనశంకరి/బెంగళూరు: రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల నిర్వహణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షల్ని రద్దు చేయాలని సింగ్రిగౌడ అనే వ్యక్తి వేసిన అర్జీని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, సంజీవ్‌కుమార్‌ల బెంచ్ కొట్టివేసింది. అందరినీ పాస్ చేయడం, మార్కుల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని హైకోర్టుకు ఏజీ ప్రభులింగ వివరించారు. కోవిడ్ వైరస్ తగ్గడంతో పరీక్షలు నిర్వహించవచ్చని, వారి ఉత్తమ భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అదే విధంగా... ఒకవేళ ఈ ఏడాది రాయకపోతే వచ్చే ఏడాది రాయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.48 శాతంగా ఉన్నందున కోవిడ్ నియమాలను పాటిస్తూ పరీక్షల్ని నిర్వహించాలన్నారు. కానీ బలవంతంగా విద్యార్థుల చేత పరీక్షలు రాయించరాదని తెలిపారు. కాగా, ఈ నెల 19 నుంచి 22 వరకు రెండు రోజుల్లో పరీక్షలను నిర్వహించాలని విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. -
Karnataka: జూలై 19–22 టెన్త్ పరీక్షలు
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షలకు సిద్ధమైంది. మంత్రి సురేశ్‌కుమార్ సోమవారం విధానసౌధలో వివరాలను వెల్లడించారు. జూలై 19న గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పరీక్ష జరుగుతుంది. జూలై 22న భాషా సబ్జెక్ట్ పరీక్ష ఉంటుంది. 8.76 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి పరీక్ష రాయనున్నారు. 7,306 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితాలకు కలిసి ఒక పరీక్ష, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లకు ఒక పరీక్ష జరుగుతుందని మంత్రి తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. చదవండి: దివ్యాంగుల వసతి గృహంలో కీచక హెచ్ఎం.. -
స్నేహమంటే ఇదేరా..
స్నేహితులకు మీరేదైనా చేస్తున్నారా? విపత్కర పరిస్థితుల్లో వారికి సహకరిస్తున్నారా? ఒక వేళ అలాంటి పనులేవీ చేయకపోతే.. ఇదిగో.. ఈ ఫొటోలోని వ్యక్తుల్ని చూసైనా తెల్సుకోండి.. చట్టాన్ని ఉల్లంఘించైనాసరే.. స్నేహితులకు సహాయపడటం ఎలాగో.. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పనులేవో చేస్తున్నట్లు కనిపిస్తున్న వీళ్లంతా అంతకంటే గొప్పపని చేస్తున్నారక్కడ! పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు తెలియని తమతమ స్నేహితులకు కిటికీల నుంచి చిట్టీలు అందిస్తూ మీడియా కంటికి చిక్కారు! ఒకటికాదు రెండు కాదు తాడు, నిచ్చెన లేకుండా అమాంతం నాలుగు ఫ్లోర్లెక్కిమరీ మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారు. ఈ తతంగమంతా జరిగింది బీహార్‌లో! ప్రస్తుతం పరీక్షల సీజన్ కదా.. బీహార్ లోనూ ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయితే అలాంటిదేమీ లేదని.. పరీక్ష హాలులో ప్రశ్న, జవాబు పత్రాలు తప్ప చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదని బీహార్ సీఎం నితిశ్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన అలా మాట్లాడిన తర్వాతిరోజే ఇదిగో మీరు చూస్తున్న ఈ చిత్రం వైశాలి జిల్లాలో ఆవిష్కృతమైంది. మరి పోలీసుల భయం లేదా? అనుకుంటారేమో! అక్కడ కూడా చట్టం తనపని తాను చేసుకుపోయింది. కిటికీల నుంచి చిట్టీలు అందిస్తున్న విద్యార్థుల స్నేహితులు, బంధువుల్ని తరిమితరిమి కొట్టింది. ఈ ఉరుకులాటలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయికూడా!