మొక్కల పరిశీలన
మొక్కల పరిశీలన
Published Mon, Aug 8 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
యాదగిరిగుట్ట : మండలంలోని మహబూబ్‌పేటలో ఇటీవల హరితహారంలో నాటిన మొక్కలను అటవీశాఖ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటీవ్ ఫర్గీన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. ఎక్కువ నీటి నిల్వలు ఎక్కడ ఉంటాయో అక్కడ విరివిగా నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ప్రస్తుతం మండలంలో నాటిన మొక్కలు వాడిపోకుండా ప్రతి రోజు నీళ్ళు పోయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది నాటిన మొక్కలు ఎండిపోతే వాటి ప్రదేశంలోనే మళ్లీ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకున్నప్పుడే హరితతెలంగాణ సాధించిన వాళ్లమవుతామని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో హరితహారంపై చర్చించి, మొక్కల నాటితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ సాంబ«శివరావు, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచ్ కందాల రంగారెడ్డి, ఎంఈఓ వనం రాజారాములు, ఈసీ కరుణాకర్, ప్రవీణ్ ఉన్నారు.
Advertisement