
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాలను శుక్రవారం ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ పరిశీలించారు. పేదలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వార్డుల్లో రోగులను పరామర్శించి యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వార్డు, ఆపరేషరేషన్ థియేటర్లు, సర్జికల్ ఐసియూ,డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ విభాగాలను పరిశీలించి..వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. వైద్య సదుపాయాలపై స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్న గవర్నర్.. ప్రభుత్వాసుపత్రుల్లో వసతి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు.