కోలారు: తాలూకాలోని హుత్తూరు గ్రామ పంచాయతీలోని వివిధ గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనులను వివిధ దేశాల నుంచి వచ్చిన అధికారుల బృందం పరి శీలన జరిపారు. తాలూకాలో ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తించిన హుత్తూరు గ్రామ పంచాయతీకి విదేశీ అధికారుల బృందాన్ని జిల్లా పంచాయతీ డిప్యూటీ సెక్రెటరీ చలువరాజ్ స్వయంగా తీసుకువెళ్లి అభివృద్ధి పనులు చూపించారు. ఉపాధిహామీ, ఇందిరా ఆవాస్ యోజనా, ఎన్‌ఎల్‌ఆర్‌ఎం, స్వచ్ఛ భారత్ మిషన్ తది తర కార్యక్రమాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను విదేశీ బృందానికి చూపించారు.
డ్రెయినేజీ, రహదారుల నిర్మాణం, అభివద్ధి పనులను విదేశీ బృందం ప ర్యవేక్షించారు. అదే విధంగా స్త్రీ శక్తి సంఘాల పనితీరు, రేషన్ దుకాణం నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళల బ్యాంకు నిర్వహణ గురించి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా కలిగి ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఈఓ నూర్ మహ్మద్ పనాలి జిల్లా పంచాయతీ ఆధ్వర్వంలో గ్రామ పంచాయతీలలో జరుపుతున్న అభివధ్ది పనుల గురించి తెలియ జేశారు. ఈ సందర్భంగా చిలీ, మలావి, కెన్యా, ఉగాండా, రష్యా తదితర దేశాలకు చెందిన 19 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామీణాభివృద్ధి పనులు పరిశీలించిన విదేశీ బృందం
Published Mon, Mar 23 2015 3:17 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
Advertisement