సినిమా థియేటర్ల పరిశీలన
సాలూరు: పట్టణంలోని సినిమా థియేటర్లను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గున్నయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. థియేటర్‌కు ప్రభుత్వ అనుమతులు, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, ప్రేక్షకుల రక్షణ తదితర అంశాలపై థియేటర్లలో పర్యవేక్షించారు. ముందుగా లక్ష్మి, శ్రీలక్ష్మి థియేటర్లను, అనంతరం శ్రీరామా, శ్రీవెంకటేశ్వర డీలక్స్‌లలో సౌకర్యాలను పరిశీలించడమే కాకుండా తాగునీటి ట్యాంకులలో నీటిని పరిశీలన నిమిత్తం సేకరించారు.
అలాగే ఆయా థియేటర్లలోని క్యాంటీన్‌లలో విక్రయిస్తున్న చిరుతిళ్లను కూడాపరీక్షల నిమిత్తం తీసుకున్నారు. రోడ్లు భవనాలశాఖ, విపత్తుల నివారణశాఖ, మున్సిపల్ శానిటరీ విభాగం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో పాటు విద్యుత్‌శాఖ అధికారులు థియేటర్లకు గతంలో ఇచ్చిన అనుమతులను, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. నివేదికను ప్రభుత్వానికి అంద జేస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఆయనవెంట తహశీల్దార్ ఆనందరావు, జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు తదితరులున్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
సినిమా థియేటర్లలోని క్యాంటీన్లలో అధిక ధరలకు కూల్‌డ్రింక్‌లు, ఇతర తినుబండారాలను విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు హెచ్చరించారు. సమాచారం మేరకు సాలూరు తహశీ ల్దార్ ఆనందరావుతో కలిసి క్యాంటీన్‌ను పరిళీలించారు.